Ott Thriller Movie: అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో కిల్లర్.

OTT Movie: ఇదేం సినిమారా బాబూ! అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో కిల్లర్.. మైండ్ బ్లాకయ్యే ట్విస్టులు

Thriller movie


శారీరక వైకల్యమున్న వ్యక్తికి సమాజంలో ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి? అందుకు అతను ఏం చేశాడు? అనే అంశాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. పేరుకు క్రైమ్ థ్రిల్లర్ సినిమానే అయినా ఈ మూవీలో అంతర్లీనంగా ఒక మంచి సామాజిక సందేశం కూడా ఉంది.

ఓటీటీలో అన్ని రకాల కంటెంట్ ఉంటుంది. అయితే ఆడియెన్స్ ఇప్పుడు ఎక్కువగా సస్పెన్స్, హారర్, క్రైమ్, థ్రిల్లర్ కంటెంట్ సినిమాలు, సిరీస్ లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే వివిధ ఓటీటీ సంస్థలు కూడా ప్రతివారం ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు సంబంధించినవే. ఇదొక తమిళ సినిమా. కొన్ని నెలల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆసక్తికరమైన కథా కథనాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో ఆడియెన్స్ ఈమూవీని బాగానే ఎంజాయ్ చేశారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నెడుమారన్ శారీరక అంగవైకల్యం కలిగిన ఒక యువకుడు. మరుగుజ్జుగా జన్మించిన అతనిని చూసి చాలా మంది అవమానిస్తారు. నెడుమారన్ తన తండ్రి, తల్లి, మతి అనే సోదరి తో కలిసి ఉంటాడు. తన తండ్రిలాగే పోస్ట్‌మన్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కంటాడు. అయితే ఇంతలోనే మతి తన ప్రియుడితో పారిపోతుంది. దీంతో ఆమెను వెతుక్కుంటూ నెడుమారన్ కూడా చెన్నై వెళ్లిపోతాడు. అదే సమయంలో చెన్నై నగరంలో వరుసగా అమ్మాయిల హత్యలు, మిస్సింగ్ కేసులు నమోదవుతాయి.

నెడుమారన్ తన కాలేజీ ఫ్రెండ్ ప్రభావతి సహాయంతో మతిని కనిపెడతాడు. కానీ ఆమె భర్త అనుమాన్ ఓ సీరియల్ కిల్లర్ అని తెలుసుకుంటాడు. పోలీసులతో కలిసి అతనిని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. మరి తన భర్త నిజస్వరూపం తెలిసిన మతి ఏం చేసింది? అనుమాన్ ఎందుకు సైకో కిల్లర్ గా మారాడు? చివరకు ఏమయ్యాడు? నెడుమారన్ తన ఊరికి తిరిగి వెళ్లి పోస్ట్‌మన్‌గా సెటిల్ అవుతాడా ? మతి తన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది ?అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

బాడీ షేమింగ్ పై సామాజిక సందేశం, క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి తెరకెక్కించిన ఈ సినిమా పేరు మతిమారన్. లవ్ టుడే, సింగిల్ సినిమాల హీరోయిన్ ఇవానా ఇందులో ఓ కీలక పాత్ర పోషించింది. అలాగే వెంకట్ సెంగుత్తువన్, ఆరాధ్య, ఎం.ఎస్. భాస్కర్, ఆడుకలం నరేన్ సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. మంత్ర వీరపాండియన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను లెనిన్ బాబు నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.