Ammayi garu Serial Today Episode విజయాంబిక జీవన్లు చేతులు కలిపి సూర్య ప్రతాప్ కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్లాన్ చేస్తారు. ఈ క్రరమంలో సూర్యప్రతాప్ విరూపాక్షి పిలవడంతో ఇంటి పత్రాల పంపిణీకి, భూమి పూజకు వస్తారు.
అశోక్ జీవన్ చెప్పిన దాని ప్రకారం మీటింగ్ జరిగే చోట బాంబ్ ఏర్పాటు చేస్తారు. అశోక్ లొకేషన్కి వచ్చి అక్కడ కోమలిని చూస్తాడు.
కోమలి ఇక్కడ ఉందేంటి అని అనుకొని కోమలికి కాల్ చేస్తాడు. కోమలి అశోక్ని అక్కడ చూస్తుంది. ఇక్కడేం చేస్తున్నావ్ అని అడుతుంది. అశోక్ కోమలితో సూర్యప్రతాప్ ఫ్యామిలీని చంపేయాలని స్పాట్ పెట్టామని భూమి పూజ జరిగే ప్లేస్లో బాంబ్ పెట్టామని అంటాడు. కోమలి షాక్ అయిపోతుంది. భూమి పూజ చేయడానికి మొదటి పోటు గునపంతో పొడవగానే బాంబ్ పేలుతుందని అంటాడు. అశోక్ కోమలిని అక్కడి నుంచి వెళ్లిపోమని అంటాడు. ఈ మాట ఇప్పుడు చెప్తావా ముందే చెప్పాలి కదా అని అంటుంది. ఇక అశోక్ జాగ్రత్తగా ఉండమని అంటాడు.
కోమలి మెల్లగా విజయాంబిక వాళ్ల దగ్గరకు వెళ్లి విషయం చెప్తుంది. విజయాంబిక షాక్ అయి ఈ బాంబ్ గురించి అశోక్కి ఎవరు చెప్పారు అని అడుగుతుంది. తెలీదు అని కోమలి అంటుంది. విరూపాక్షి వాళ్లు నవ్వుతుంటే కోమలి చూసి ఇదే మీకు చివరి రోజు అని తెలీక ఇలా నవ్వుకుంటున్నారని అనుకుంటుంది. సూర్యప్రతాప్ వేదిక దగ్గరకు వస్తాడు. అందరూ ఘన స్వాగతం పలుకుతారు. విరూపాక్షి సీఎం గురించి పొగిడి మాట్లాడుతుంది. మీ అందరికీ సీఎం శాశ్వత ఇళ్ల పట్టాలు ఇస్తారని అంటుంది. సూర్యప్రతాప్ని మాట్లాడమని కోరుతుంది. సూర్యప్రతాప్ మాట్లాడుతుంటే రాజు కాస్త దూరంలో ఉంటాడు. అప్పుడే రాజు దూరంగా అనుమానంగా ఉన్న అశోక్ని చూస్తాడు.
రాజు అశోక్ని చూసి దొరికావ్రా అని వెళ్తాడు. రాజుని చూసి అశోక్ పరుగులు పెడతాడు. ఇక సూర్యప్రతాప్ ఇళ్ల పట్టాలు పంచుతారు. తర్వాత అందరూ భూమి పూజ దగ్గరకు వెళ్తారు. కోమలి కంగారు పడుతుంది. మరోవైపు రాజు అశోక్ని పట్టుకుంటాడు. అశోక్ని కొట్టి నువ్వు ఎవర్రా ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏంటి అని అడుగుతాడు. ఇక భూమి పూజ పూర్తి అయిపోతుంది. పంతులు భూమిని తవ్వమని అంటాడు.
అశోక్ రాజుని తనని వదిలేయమని తనని వదిలేస్తే నీకు నీ ఫ్యామిలీని కాపాడుకునే అవకాశం నీకు ఇస్తా అంటాడు. ఏంటి అని రాజు అంటే నీ పెద్దయ్యగారిని నీ అమ్మాయిగారితో పాటు అందరూ పోయేలా ప్లాన్ చేశారు. భూమి పూజ జరిగే చోట బాంబ్ పెట్టారని చెప్తాడు. రాజు షాక్ అయిపోతాడు. ఇక విరూపాక్షి రూపతో భూమి పూజ అయిపోయింది నీ చేతితో భూమి తవ్వు అని అంటుంది. విజయాంబిక, దీపక్, కోమలి మెల్లగా పక్కకి జరుగుతారు. రూప దండం పెట్టి తవ్వడానికి రెడీ అవుతుంది. సూర్యప్రతాప్ కోమలి దూరంగా జరగడం చూసి రూపగా ఉన్న రుక్మిణిని ఆపుతాడు. రూపతో పాటు కోమలి, విజయాంబిక షాక్ అయిపోతారు. మరోవైపు రాజు కూడా తన కుటుంబం ప్రమాదంలో ఉందని తెలిసి షాక్లోనే ఉంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.