ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.? చేసింది తక్కువ సినిమాలే.. కానీ క్రేజ్ మాత్రం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ దూసుకుపోతుంది. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ఉదయం నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. డైరెక్టర్ సుజీత్ రూపొందించిన ఈ మూవీపై పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Og movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ సినిమా నేడు ( సెప్టెంబర్ 25)న గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాకు మొదటి నుంచి మంచి హైప్ ఉంది. ఆ బజ్ ను సినిమా రెట్టింపు చేసింది. పవన్ చాలా కాలం తర్వాత పవర్ ఫుల్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఓజీ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. సినిమాలో పవన్ నటన, ఎలివేషన్స్, యాక్షన్స్ సీన్స్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. థియేటర్స్ దగ్గర అభిమానులు పండగ చేసుకుంటున్నారు.