OTT Movies This Week



Dasara ott movies

ఈసారి దసరా పండగ హడావుడి తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. ఈ వారంలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఏం విడుదల కావట్లేదు. ధనుష్ 'ఇడ్లీ కొట్టు', రిషభ్ శెట్టి 'కాంతార 1' లాంటి డబ్బింగ్ చిత్రాలు వరస రోజుల్లో బిగ్ స్క్రీన్‌పైకి రానున్నాయి.

వీటిలో 'కాంతార' ప్రీక్వెల్‌పై ఓ మాదిరి బజ్ ఉంది.

మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గ రీతిలో పలు చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మదరాసి, జూనియర్ మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు 'ద గేమ్' సిరీస్ కూడా కాస్తోకూస్తో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఈ వారం ఓటీటీల్లోకి ఏయే మూవీస్ ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 5 వరకు)

అమెజాన్ ప్రైమ్

మదరాసి (తెలుగు డబ్బింగ్ సినిమా) - అ‍క్టోబరు 01

ప్లే డర్టీమూవీ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 01

నెట్‌ఫ్లిక్స్

మిస్సింగ్ కింగ్ (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 29

నైట్ మేర్స్ ఆఫ్ నేచర్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 30

ద గేమ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అ‍క్టోబరు 02

మాన్‌స్టర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 03

ఆహా

జూనియర్ (తెలుగు సినిమా) - సెప్టెంబరు 30

సన్ నెక్స్ట్

సాహసం (తమిళ మూవీ) - అక్టోబరు 01

గౌరీ శంకర (కన్నడ సినిమా) - అక్టోబరు 01

టేల్స్ ఆఫ్ ట్రెడిషన్ (తమిళ సిరీస్) - అక్టోబరు 02

జీ5

చెక్ మేట్ (మలయాళ సినిమా) - అక్టోబరు 02

డాకున్ డా ముందా 3 (పంజాబీ మూవీ) - అక్టోబరు 02

సోనీ లివ్

13th (హిందీ సిరీస్) - అక్టోబరు 01

ఆపిల్ ప్లస్ టీవీ

ద సిస్టర్ గ్రిమ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 02

లాస్ట్ బస్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 03