Kantara 2 movie released dasara


Kantara

విజయవంతమైన 'కాంతార' చిత్రానికి ప్రీక్వెల్‌గా వస్తున్న మైథలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'కాంతార: చాప్టర్‌ 1' (Kantara: Chapter 1). రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా సినిమాని హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించింది. రుక్మిణీ వసంత్‌ కథానాయిక. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబరు 2న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రం ఆకట్టుకుంటోంది. సరికొత్త ప్రపంచం, ఓ అసాధారణ ప్రేమకథ, ఈశ్వరుడి నేపథ్యం, భారీ యుద్ధాలు..అన్నీ ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. ట్రైలర్‌ చివరిలో ఈశ్వర అవతారంలో త్రిశూలంతో రిషబ్‌ కనిపించిన తీరు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాకి అజనీశ్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందించాడు.