దసరా పండగ రోజున OTTMovies అలరించే చిత్రాలివే!


Dhanush

ధనుష్, నిత్యా మేనన్‌ జంటగా నటించిన చిత్రం 'ఇడ్లీ కొట్టు'. ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

డాన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ధనుష్‌ తన వ్యక్తిత్వం కోసం ఉద్యోగాన్ని వదిలి.. తండ్రి వారసత్వంగా ఇడ్లీ కొట్టు నడిపే సాధారణ వ్యక్తి పాత్రలో కనిపించి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాడు. గ్రామీణ నేపథ్యంలో రూపొందడం, విజయవంతమైన 'తిరు' తర్వాత ధనుష్‌, నిత్యామేనన్‌ కలిసి నటించడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.