సుధీర్ ఆనంద్. వెండితెరపై కూడా కథానాయకుడిగా ఇప్పటికే నాలుగు చిత్రాలు చేశారు. ఐదో చిత్రంగా 'హైలెస్సో' తెరకెక్కుతోంది.
ప్రసన్నకుమార్ కోట దర్శకత్వం వహిస్తున్నారు. వజ్ర వారాహి సినిమాస్ పతాకంపై శివ చెర్రీ, రవికిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుధీర్ సరసన నటాషా సింగ్, నక్ష శరణ్ కథానాయికలుగా నటిస్తున్నారు. అక్షర గౌడ ముఖ్యభూమిక పోషిస్తున్నారు.
శివాజీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్‌నిచ్చారు. దర్శకులు వశిష్ఠ, చందూ మొండేటి, మెహర్ రమేశ్ కెమెరా స్విచ్చాన్ చేశారు.
నిర్మాత బన్నీ వాస్ చిత్రబృందానికి స్క్రిప్ట్‌ని అందజేశారు. కథానాయకుడు నిఖిల్ టైటిల్‌ని ఆవిష్కరించారు. ''గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. యువ ప్రతిభావంతులు కలిసి చేస్తున్నారు. పోస్టర్ తరహాలోనే ఎంతో గాఢత ఉన్న అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంద''ని సినీవర్గాలు తెలిపాయి. మొట్ట రాజేంద్రన్, గెటప్ శ్రీను, బెవర దుహిత శరణ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్ దేవ్, ఛాయాగ్రహణం: సుజాత సిద్ధార్థ్, కూర్పు: చోటా కె.ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్: బ్రహ్మ కడలి, రచన: చింతా శ్రీనివాస్, పాటలు: రామజోగయ్యశాస్త్రి.