Mirai movie First Review
హను-మాన్ మూవీతో రూ.300 కోట్లు కొల్లగొట్టిన తేజ సజ్జ నటించిన తాజా చిత్రం 'మిరాయ్'. మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్న 'మిరాయ్' మూవీ, టీజర్, ట్రైలర్ నుంచే భారీ అంచనాలను క్రియేట్ చేయడంలో బాగా సక్సెస్ అయ్యింది.
రిలీజ్‌కి ముందే నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టిన 'మిరాయ్' మూవీ, సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. తెలుగుతో పాటు నార్త్‌లో 'మిరాయ్' మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రియా శరణ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న 'మిరాయ్' మూవీకి కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్..
'సూర్య వర్సెస్ సూర్య' మూవీతో దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని, గత ఏడాది రవితేజతో 'ఈగల్' మూవీని తెరకెక్కించాడు. 'మిరాయ్' మూవీ సెన్సార్ లాంఛనాలను పూర్తి చేసుకుంది. 2 గంటల 49 నిమిషాల నిడివి ఉన్న 'మిరాయ్' మూవీకి సెన్సార్ U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఎలాంటి కత్తిరింపులు సూచించకుండానే సోషియో ఫాంటసీ యాక్షన్ కథాంశం కావడంతో పెద్దల పర్యవేక్షణలో 16+ ఏళ్ల పిల్లలు చూసేందుకు అనుమతించింది సెన్సార్ బోర్డు...
'మిరాయ్' మూవీకి గ్రాఫిక్స్ ప్రధాన బలంగా మారుతాయని సెన్సార్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారట. చాలా తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన గ్రాఫిక్స్ వాడి, విజువల్ వండర్‌లా తెరకెక్కిన 'మిరాయ్' మూవీలో కొన్ని స్పెషల్ సర్‌ప్రైజ్‌లు కూడా దాచి పెట్టిందట చిత్ర యూనిట్.. 'అశోక వనంలో అర్జున కళ్యాణం' మూవీ ఫేమ్ రితికా నాయక్, 'మిరాయ్' మూవీలో హీరోయిన్. సీనియర్ హీరోయిన్ శ్రీయా శరణ్ కీలక పాత్రలో నటిస్తోంది. ఆమె గ్లామర్, నటన కూడా 'మిరాయ్' మూవీకి స్పెషల్ అడ్వాంటేజ్ అవుతుందని సెన్సార్ సభ్యులు అభిప్రాయపడ్డారట...
మొదటి రెండు సినిమాల విషయంలో కాస్త తడబడిన కార్తీక్ ఘట్టమనేని, ఈసారి పక్కా థ్రిల్లింగ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని, ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించాడని.. అందుకే కథ, కథనాలు క్లారిటీ ఉన్నాయని, ముఖ్యంగా శ్రీరాముడి సీన్స్ అద్భుతంగా వర్కవుట్ అయ్యాయని అంటున్నారు.
మంచు మనోజ్ క్యారెక్టరైజేషన్, అతని సెకండ్ ఇన్నింగ్స్‌కి బాగా ఉపయోగపడుతుందని.. ఈ మూవీలో అతని నటన ఆశ్చర్యపరుస్తుందని సెన్సార్ సభ్యులు భావించినట్టు సమాచారం.