Brahmamudi September 12th Episode

Brahmamudi September 12th Episode
కావ్య ఫోన్‌లో పిల్లల వీడియోలు చూస్తూ నవ్వుకుంటుంది. ఇది చూసిన ఇందిర సంతోషిస్తుంది. ఇంతలో కావ్య ఫోన్ రింగ్ కావడంతో అప్పూ లిఫ్ట్ చేయగా అటు పక్క డాక్టర్ మాట్లాడుతుంది.

Brahmamudi

మీ అక్క ఈ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయకూడదని ఖచ్చితంగా అబార్షన్ చేయాల్సిందేనని చెప్పడంతో అప్పూ షాక్ అవుతుంది. జగదీష్‌తో రేవతి ఫోన్‌లో మాట్లాడుతుండగా రుద్రాణి చూస్తుంది. నిన్ను ఎలాగైనా ఇంట్లో వాళ్ల ముందు బుక్ చేయాలని అనుకుంటుంది. వెంటనే కావ్య రూమ్‌లోకి వెళ్లి అపర్ణ ఇచ్చిన నెక్లెస్‌ని రేవతి హ్యాండ్ బ్యాగ్‌లో వేస్తుంది.

ఇంతలో ఆ గదిలోకి రేవతి, కనకం, స్వరాజ్ వస్తారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని కనకం ప్రశ్నిస్తుంది. ఈ ఆంటీ నా చాక్లెట్లు దొంగతనం చేయడానికే వచ్చారని స్వరాజ్ అనడంతో రుద్రాణి మండిపడుతుంది. పిల్లల్ని ఇలాగేనా పెంచేది, పెద్దవాళ్లకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నేర్పించాలని క్లాస్ తీసుకుంటుంది. భోజనాల కోసం దుగ్గిరాల ఫ్యామిలీ రెడీ అవుతుండగా కావ్య మెడలో నెక్లెస్ కనిపించకపోవడంతో ఏమైందని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 12వ తేదీ ఎపిసోడ్ 824లో ఇంకా ఏం జరిగిందంటే?

అత్తగారు ఇచ్చిన నెక్లెస్ కనిపించకపోవడంతో కావ్య షాక్ అవుతుంది. ఇళ్లంతా వెతికినా అది ఎక్కడా కనిపించదు. నెక్లెస్ బాక్స్‌తో సహా రావడంతో నెక్లెస్ ఏది అని ఆమెను అందరూ అడుగుతారు. నెక్లెస్ కనిపించడం లేదని కావ్య చెప్పడంతో అంతా షాక్ అవుతారు. దాంతో 10 లక్షల రూపాయల నెక్లెస్ పోయిందా? అని రుద్రాణి నటిస్తుంది. ఈ ఇంట్లో తీసేవాళ్లు ఎవరూ లేరని నువ్వే ఎక్కడో పెట్టి మరిచిపోయి ఉంటావని ఇందిర అంటుంది. ఇంట్లో వాళ్లకి ఆ నెక్లెస్ దొంగిలించే అవసరం లేదని, మన పనిమనిషి రత్తాల్ని నిలదీయాల్సిందేనని చెబుతుంది రుద్రాణి. పనిమనిషిని పిలిచి మా నెక్లెస్ ఏమైనా తీశావా? అని నిలదీస్తుంది.

రుద్రాణి మాటలతో మండిపడ్డ రత్తాలు.. నన్ను అనుమానిస్తే బాగోదని వార్నింగ్ ఇస్తుంది. ధాన్యలక్ష్మీ అమ్మగారు ఎన్నోసార్లు నగలు పడేసుకుంటే నేనే తీసుకొచ్చి ఇచ్చానని అంటుంది. నీ మీద మాకు ఎలాంటి అనుమానం లేదని ఊరికే పిలిచామని చెబుతుంది రుద్రాణి. ఇంట్లో ఉన్నవాళ్లంతా మనవాళ్లే కాబట్టి ఈ నెక్లెస్ ఎవరు తీస్తారని రాజ్ అడుగుతాడు. ఇంట్లో మనుషులు తీసే అవకాశం లేనప్పుడు ఇంటికొచ్చిన కొత్త వాళ్లే తీస్తారని రేవతిని ఉద్దేశించి అంటుంది రుద్రాణి. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు.