Gunde Ninda Gudi Gantalu September 12th
మీనా, బాలుల గొప్పదనం గురించి ఇంట్లో వాళ్లంతా మాట్లాడతారు. ప్రభావతి కూడా మాట్లాడాలని అందరూ పట్టుబట్టడంతో మీనాను మెచ్చుకుంటూ మాట్లాడుతుంది.
ఆ తర్వాత బాలు, మీనాలు కూడా ఒకరి గురించి మరొకరు మాట్లాడతారు. మీ ఇద్దరి లాగే నేను, నా భర్త ఉండాలని కోరుకుంటున్నామని మౌనిక చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఆమె మాటలతో మండిపడ్డ సంజూ వెంటనే ఇంటికి వెళ్దామని చెబుతాడు.
కారు దగ్గర సంజూ వేళ్లపై డోర్ వేస్తాడు బాలు. నా చెల్లెలు బాధపడితే నేను బాధపడతాను, నేను బాధపడితే నువ్వు రెట్టింపు బాధపడతావని వార్నింగ్ ఇస్తాడు. పెళ్లి రోజు కూడా బాలు మీనాలు మేడపైన పడుకోవడానికి వెళ్లడంతో సుశీల డార్లింగ్ మండిపడుతుంది. ఇద్దరు కోడళ్లు, ఇద్దరు కొడుకులను నువ్వు వేరు వేరుగా చూస్తున్నావని ప్రభావతిపై ఫైర్ అవుతుంది. ఇందులో అమ్మనాన్నల తప్పేం లేదని.. వాళ్ల ఆరోగ్యం కోసమే మేము మేడపైన పడుకుంటున్నామని చెబుతాడు బాలు. ఆ తర్వాత సత్యం దగ్గరికి వెళ్లిన సుశీల.. మేడపైన మరో రూమ్ కట్టించాలని ఇందుకు కావాల్సిన డబ్బు నేనే ఇస్తానని చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 12వ తేదీ, 509వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?