కిష్కింధపురి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తక్కువ బడ్జెట్ తో గ్రాండ్ గా రూపొందించారు. సినిమాలో యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీసెంట్ గా కిష్కింధ పురి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హారర్ థ్రిల్లర్ జోనర్ లో చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన ఆ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు.
తక్కువ బడ్జెట్ తో గ్రాండ్ గా రూపొందించారు.
సినిమాలో యంగ్ బ్యూటీ గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ పాత్రలో నటించగా. హైపర్ ఆది, సుదర్శన్, తనికెళ్ల భరణి, ప్రేమ, శాండీ మాస్టర్ తదితరులు యాక్ట్ చేశారు. సెప్టెంబర్ 12వ తేదీన సినిమా రిలీజ్ కానుండగా.. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా రాబడుతోంది.
అయితే ఫస్ట్ డే కిష్కింధ పురి మూవీ సాలిడ్ కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది. బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు సెకండ్ డే ఇంకా మంచి వసూళ్లు రాబట్టనున్నట్లు అర్థమవుతోంది. చాలా చోట్ల థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. తొలి రోజు కన్నా రెండో రోజు ఆక్యుపెన్సీ బాగా పెరిగినట్లు కూడా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అలా కిష్కింధ పురి సినిమా సెకండ్ డే కలెక్షన్లు బాగా ఇంప్రూవ్ అయినట్లు తెలుస్తోంది. తొలి రోజు కన్నా డబుల్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. వీకెండ్ లో మరిన్ని కలెక్షన్లు సాధించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగులో మాత్రమే రిలీజ్ కాగా.. తొలి రోజు రూ.2 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు సినీ వర్గాల సమాచారం.
అదే సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా నెటిజన్ల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆయన.. ఇప్పుడు కిష్కింధ పురితో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. సినిమాలో ఆయన యాక్టింగ్ ను విమర్శకులు కూడా కొనియాడుతున్నారు. అద్భుతంగా నటించారని చెబుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. హీరో హీరోయిన్లు ఓ సంస్థలో పని చేస్తుంటారు. ఘోస్ట్ వాకింగ్ టూర్స్ పేరుతో కొందరినీ హాంటెడ్ ప్లేసులకు పట్టుకెళ్తుంటారు. అదే సమయంలో ఊరికి చివరలో ఉన్న సువర్ణమాయ రేడియో స్టేషన్ కు వెళ్తారు. అలా వెళ్లి వచ్చిన వాళ్లలో 11 మందిలో ముగ్గురు చనిపోతారు. అలా ఎందుకు జరిగింది? చివరకు ఏమైంది? అనేది పూర్తి సినిమా.