Kotha Lokah Collection Day 12: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అవుతున్నాయి, ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా వచ్చిన సినిమాలు మాత్రం బంపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి.
అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘లోక'(Lokah Movie) అనే చిత్రం మరో ఉదాహరణ గా నిల్చింది. ఎంతసేపు హీరోల సినిమాలే సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం ఇన్ని రోజులు మనం చూసాము కానీ, చాలా కాలం తర్వాత ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం ఈ సినిమా ద్వారానే చూస్తున్నాం. కళ్యాణి ప్రియా దర్శన్(Kalyani Priyadarshan) ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఈరోజుతో 200 కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి అడుగుపెట్టింది. తెలుగు లో ఈ సినిమా ‘కొత్త లోక'(Kotha Lokah) అనే పేరు తో విడుదలైన సంగతి తెలిసిందే.
తెలుగు డబ్ వర్షన్ కూడా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాని కొనుగోలు చేసిన నాగవంశీ కి లాభాల వర్షం కురిపించింది. ఓవరాల్ గా 12 రోజులకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. కేరళ ప్రాంతం లో 12 రోజులకు గాను ఈ చిత్రానికి 64 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఊపు చూస్తుంటే ఈ చిత్రం ఈ వీకెండ్ తో కేవలం కేరళ రాష్ట్రము నుండి వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకునేలా ఉంది. ఇప్పటి వరకు మోహన్ లాల్ సినిమాలకు తప్ప, ఏ హీరో కి కానీ, హీరోయిన్ కి కానీ కేరళ రాష్ట్రంలో వంద కోట్ల గ్రాస్ వసూళ్లు రాలేదు. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 12 రోజులకు గాను 12 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
తమిళనాడు లో కూడా తెలుగు వెర్షన్ లో వచ్చినంత వసూళ్లే వచ్చాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వాళ్ళ లెక్కల ప్రకారం ఈ చిత్రానికి తమిళనాడు లో 12 రోజులకు గానూ 12 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక లో 9 కోట్ల 35 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 5 కోట్ల 25 లక్షలు, ఓవర్సీస్ లో 92 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా 12 రోజులకు 195 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 87 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. తెలుగు వెర్షన్ డబ్బింగ్ రైట్స్ ని నిర్మాత నాగవంశీ 3 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంటే, ఇప్పటి వరకు ఈ చిత్రానికి 6 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే దాదాపుగా 3 కోట్లు లాభం అన్నమాట. ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది.