Love story s, వెబ్ సిరీస్ లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. యూత్ కు ఆకట్టుకునేలా కొంచెం కొత్తగా ఉండాలే కానీ ఈ లవ్ స్టోరీలకు ఊహించని రెస్పాన్స్ వస్తుంటుంది.
ఇటీవలే 500 కోట్లు కొల్లగొట్టిన సైయారా నే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కూడ ఒక స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రమే. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యువతతో పాటు అన్ని వర్గాల ఆడియెన్స్ ను అలరించింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అద్భుతమైన కథా కథనాలు, హీరో, హీరోయిన్ల పెర్ఫామెన్స్, టోగ్రఫీ, మెలోడియస్ సౌండ్‌ట్రాక్, అందమైన గ్రామీణ దృశ్యాలు ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి.IMDBలో9.4/10రేటింగ్‌తో ఈ దూసుకుపోతోంది. ఈ కథ విషయానికి వస్తే.. మహారాష్ట్రలో ఒక గ్రామీణ ప్రాంతంలో గోల్యా, ప్రార్థనల తిరుగుతుంది. గోల్యా ఒక సాధారణ యువకుడు. స్థానికంగా ప్రార్థన అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమె కూడా గోల్యా ప్రేమను అంగీకరిస్తుది. అయితే బ్రిటిష్ పాలకుల నిరంకుశత్వం, గ్రామంలోని సామాజిక దురాచారాలు వీరి స్వచ్ఛమైన ప్రేమకు అడ్డంకిగా నిలుస్తాయి.
ముఖ్యంగా అదే గ్రామంలో ఉండే ఉపేంద్ర గోల్యా, ప్రార్థనల ప్రేమకు శత్రువుగా మారతాడు. తన అధికారాన్ని, పలుకుబడిని ఉపయోగించి వారిని విడగొట్టాలని ప్రయత్నిస్తాడు. బ్రిటిష్ వారితో కలిసి గోల్యా, ప్రార్థనలకు సమస్యలు సృష్టిస్తాడు. మరి చివరకు ఈ ప్రేమకథ ఏమైంది? గోల్యా, ప్రార్థనలు ఒక్కటయ్యారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ చూడాల్సిందే. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఎంతో ఎమోషనల్ గా ఉంటుంది.
ఈ పేరు మాఝీ ప్రార్థన. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ మరాఠీ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీలో పద్మరాజ్ రాజ్‌గోపాల్ నాయర్ (గోల్యా), అనుషా అడెప్ (ప్రార్థన), ఉపేంద్ర లిమాయే, జైనేంద్ర నికలే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మహారాష్ట్రలో ఒక గ్రామీణ ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ ఈ నెలలోనే ఓటీటీలోకి రానుంది. ఈ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు జీ5, జియో హాట్ స్టార్ వద్ద ఉన్నాయి.