ఇక ఇ చిత్రం కి బేబి సాయి తేజస్విని ప్రధాన పాత్రలో, సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "ఎర్రచీర - ది బిగినింగ్". ఈ సినిమా అక్టోబర్ 10న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. దీపావళికి వారం ముందే విడుదలవుతున్న ఈ చిత్రంపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.
"ఎర్రచీర" ఒక విభిన్నమైన చిత్రం
మదర్ సెంటిమెంట్, హారర్ మరియు యాక్షన్ అంశాలతో కూడిన "ఎర్రచీర" ఒక విలక్షణమైన కథాంశంతో వస్తోందని దర్శకుడు సుమన్ బాబు తెలిపారు. ఈ సినిమాను చూసిన డిస్ట్రిబ్యూటర్లు, సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా కంటెంట్‌పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా సినిమాలోని ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని సెన్సార్ టీమ్ పేర్కొంది. ఈ సినిమా ఆలస్యమైనప్పటికీ, కంటెంట్ అద్భుతంగా ఉందని చూసినవారు ప్రశంసించారని సుమన్ బాబు చెప్పారు. ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం అయినప్పటికీ, కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుందని ఆయన అన్నారు.