Rebel Star Prabhas కథానాయకుడిగా రూపొందుతున్న హారర్ కామెడీ సినిమా 'ది రాజా సాబ్' (The Raja Saab Movie). మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.
ఇందులో వింటేజ్ ప్రభాస్ కామెడీ టైమింగ్ వింటేజ్ డార్లింగ్ స్టైల్ చూపిస్తామని దర్శకుడు ప్రామిస్ చేశారు. ఆల్రెడీ విడుదలైన గ్లింప్స్, టీజర్ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్ విడుదల చేయడానికి చిత్ర బృందం రెడీ అయ్యింది.
సోమవారం సాయంత్రం 6 గంటలకు!
The Raja Saab Trailer Release Date and Time: సోమవారం... అంటే సెప్టెంబర్ 29వ తేదీన సాయంత్రం 6 గంటలకు 'ది రాజా సాబ్' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ట్రైలర్ స్క్రీనింగ్ చేయనున్నట్లు తెలిసింది. ఈ సినిమా మీద అభిమానులలో అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో ట్రైలర్ మరింత హైప్ ఇస్తుందని చెప్పవచ్చు. ప్రభాస్ స్టైల్, కామెడీని ఇప్పటివరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలలో పరిచయం చేశారు ఇప్పుడు కథ గురించి ఏం రివీల్ చేస్తారని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.