Mollywood Mohanlal: నిన్నటి వరకు ఇ చిత్రం 100కోట్ల వసూళ్లు.. నేడు ఓటీటీలో స్ట్రీమింగ్

మోహన్ లాల్ ఇటీవల తుడరమ్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా రిలీజ్ అయిన కొద్దీ రోజుల గ్యాప్ లోనే హృదయపూర్వం అనే మరో ఫ్యామిలీ ఓరియెంటెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Mohanlal


ఓనమ్ కానుకగా హృదయ పూర్వం వరల్డ్ వైడ్ గ రిలీజ్ అయింది. ఎంపురాన్, తుడారమ్ తో డబుల్ హండ్రెడ్ క్రోర్ చిత్రాలను దింపిన లాలట్టన్.. హృదయపూర్వం హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు.

ఓనం రోజు అనేక సినిమాలు రిలీజ్ అయిన కూడా హృదయపూర్వం సూపర్ హిట్ టాక్ తో రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు వచ్చేసింది. ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అందుకే వీకెండ్ వస్తుందంటే.. మాలీవుడ్ మూవీస్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. ఎవ్రీ ఫైడేలాగా ఈ వీకెండ్ కూడా మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన హృదయ పూర్వం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. రిలీజ్ కు ఈ ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ కొనుగోలు చేసింది. థియేటర్ సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఆగస్టు 28న రిలీజ్ కాగా నాలుగు వారల అనంతరం సెప్టెంబర్ 26 అనగా ఈ రోజు నుండి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్. కన్నడ, హిందీ వంటి పాన్ ఇండియా భాషల్లో హృదయపూర్వంను స్ట్రీమింగ్ చేస్తోంది హాట్ స్టార్.