Tollywood hero faces difficulties..working in the night shift as a thief..!

 

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో చాలామంది బ్యాగ్రౌండ్ లేకుండా.. చాలా కష్టపడుతూ పైకి వచ్చిన వారు ఉన్నారు.

అలాంటి వారిలో హీరో సత్యదేవ్ ( Satyadev) ఒకరు. విశాఖపట్నం కి సంబంధించిన ఈ కుర్రాడు... అంచలంచలుగా ఇండస్ట్రీలో ఎదుగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే 2011 సంవత్సరంలో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.


మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో గెస్ట్ పాత్ర చేసి... ఆ తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే బ్లఫ్ మాస్టర్, జ్యోతిలక్ష్మి, క్షణం, బ్రోచేవారెవరురా ఇలాంటి ఎన్నో సినిమాలు చేసిన... సత్యదేవ్.. హీరోగా మంచి సక్సెస్ అందుకున్నాడు. లేటెస్ట్ గా కింగ్డమ్ సినిమాలో... ప్రత్యేక పాత్రలో నటించి.. దుమ్ము లేపాడు. హీరోతో పాటు విలన్ పాత్ర కూడా చేయగల సత్తా సత్యదేవ్ లో ఉంది.


అయితే అలాంటి సత్య దేవ్... మొదట్ లో సాఫ్ట్వేర్ జాబ్ ( Soft Ware) చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించాడు. నైట్ షిఫ్టులు చేస్తూ.. ఉదయం పూట షూటింగ్లలో పాల్గొనే వాడట. ఐబీఎంలో ( IBM).. ఒక టీం ను లీడ్ కూడా చేశాడట. అయితే ఆ సమయంలో.. తన తోటి ఉద్యోగులకు తెలియకుండానే షూటింగ్లకు వెళ్లేవాడట. అలాగే సినీ ప్రముఖులకు తాను ఉద్యోగం చేస్తున్న విషయాన్ని ఎక్కడ రివీల్ చేయలేదట. అలా కష్టపడి ఇప్పుడు స్టార్ హీరోగా మారిపోయారు సత్యదేవ్.