Nagavamsi Film Industry Buzz:మొన్న 'కింగ్ డమ్'... ఇప్పుడు 'వార్ 2' .. అజ్ఞాతంలో నాగవంశీ!


 

Nagavamsi Film Industry Buzz: కరోనా లాక్ డౌన్ తర్వాత మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సక్సెస్ రేట్ అంతంత మాత్రంగానే ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే.

ఇలాంటి తక్కువ సక్సెస్ రేట్ లో ఉన్నప్పటికీ కూడా అత్యధిక శాతం సుక్స్స్ రేట్ ఉన్న నిర్మాత గా నాగవంశీ సరికొత్త రికార్డుని నెలకొల్పాడు. ఎంతటి వారికైనా ఫ్లాపులు తప్పవు అన్నట్టుగా నాగవంశీ కి కూడా ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తుంది. గత మూడు చిత్రాలు నిర్మాతగా నాగవంశీ(Nagavamsi) ని చావు దెబ్బ కొట్టాయి. రెట్రో చిత్రం నుండి ఆయనకు బ్యాడ్ టైం మొదలైంది. తమిళ హీరో సూర్య నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని నాగవంశీ ఏరికోరి కొనుక్కున్నాడు. సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.


ఇక ఈ చిత్రం తర్వాత ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఈ సినిమా కూడా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. నిర్మాతగా నాగవంశీ కి ఈ చిత్రం థియేట్రికల్ గా మిగిలించిన నష్టాలు 30 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందట. ఇక రీసెంట్ గా విడుదలైన ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) ‘వార్ 2’ కూడా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని 90 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. మొదటిరోజు థియేట్రికల్ షేర్ GST లేకుండా 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది, ఇక రెండవ రోజు అయితే కేవలం ఆరు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. మొత్తం మీద రెండు రోజులకు కలిపి 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నాగవంశీ బయ్యర్స్ కి రిటర్న్ GST ఇస్తాడో లేదో తెలియదు కానీ, ఇస్తే మాత్రం మరో ఆరు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు అదనంగా జమ అవుతుంది.

ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే దాదాపుగా 64 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఎంత వసూళ్లు వచ్చినా ఈరోజు, రేపే రావాలి. నేడు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాకు డెఫిసిట్స్ మొదలయ్యాయి. మహా అయితే ఇంకో 15 కోట్ల షేర్ క్లోజింగ్ లో అదనంగా వస్తుందేమో. అంటే దాదాపుగా 50 కోట్ల రూపాయిల నష్టం కళ్ళకు కనిపిస్తుంది. ఇది నాగవంశీ కి నిజంగా చాలా పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు కూడా ఈ సినిమా థియేట్రికల్ రన్ పై ప్రభావం చూపించిందని అంటున్నారు. దీంతో నాగవంశీ ఈ ఏడాది మీడియా, సోషల్ మీడియా కి దూరం గా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం, అంతే కాదు, ఈ నెలలో ఆయన ప్రొడక్షన్ హౌస్ నుండి విడుదల కావాల్సిన ‘మాస్ జాతర’ ని కూడా వాయిదా వేశాడట.