Do you know which Telugu movie has played the longest in a single theater so far?

 


Longest Running Movie: ఒక సినిమా తెరపైన మనం చూడాలంటే దాని వెనకాల చాలామంది టెక్నీషియన్స్ కష్టపడాల్సిన అవసరమైతే ఉంది. ప్రతి ఒక్కరు తన పనిని సక్రమంగా చేయకపోయినా కూడా తెరమీద మనం చూసే సినిమాలో ఏదో ఒక వెళితే మనకు కనిపిస్తూ ఉంటుంది.

24 క్రాఫ్ట్స్ లోని ప్రతి ఒక్క వ్యక్తి తన వర్క్ పట్ల డేడికేషన్ తో చేసినప్పుడే మంచి సినిమాలు వస్తాయి. ఒకప్పుడు ఒక సినిమా థియేటర్ లోకి వచ్చిందంటే ఆ సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది అనేది ప్రతి ఒక్కరిలో ఆశ్చర్యాన్ని కలిగించేది. ఇక వంద రోజుల ఫంక్షన్ ని ఎక్కడ నిర్వహించాలి, వన్ ఇయర్ ఫంక్షన్ ని ఎక్కడ చేద్దాం… అనేంతల దాని గురించి చర్చించుకునేవారు. కానీ ఇప్పుడు ఒక సినిమా థియేటర్ లోకి వచ్చిందంటే వారం తిరిగేలోపే అది ఓటిటిలో ప్రేక్షకులకు అవలెబుల్ లో ఉండడంతో థియేటర్లో సినిమాలు చూసే జనాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువ రోజులు థియేటర్లో ఆడిన సినిమా ఏంటి అనేది గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలైతే జరుగుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో బాలయ్య బాబు హీరోగా వచ్చిన లెజెండ్ సినిమా ఒకే థియేటర్లో 1005 రోజులు ఆడింది…

కడప జిల్లాలోని ప్రొద్దుటూరు అనే ఊరులో అర్జున్ థియేటర్లో ఈ సినిమా 1005 రోజులు ఆడి ఒక భారీ రికార్డు ను క్రియేట్ చేసింది. బాలయ్య బాబు ఎంటైర్ కెరియర్ లోనే కాదు సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక పెద్ద రికార్డుగా చెప్పుకోవచ్చు. ఇక బాలయ్య బాబు లాంటి నటుడు మాస్ సినిమాలతో ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు.


దానికి తగ్గట్టుగానే ఈ సినిమాతో ఒక అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేశాడు. ఇప్పటికి ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే బీ,సీ సెంటర్లో ఉన్న ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతారు. ఇక బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన ‘లెజెండ్’ సినిమా ఎంతటి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే…


ఇక రాబోయే రోజుల్లో మన స్టార్ హీరోల సినిమాలు ఏవైనా ఈ రికార్డును బ్రేక్ చేస్తాయా లేదా అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక మరి కొంతమంది మాత్రం ఈ రికార్డును బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాదని తెగేసి చెబుతున్నారు. చూడాలి మరి రికార్డ్ ను ఎవరు బ్రేక్ చేస్తారు, ఎప్పుడు బ్రేక్ అవుతుంది అనేది…