'హరి హర వీరమల్లు' కంటే పెద్ద డిజాస్టర్ గా 'వార్ 2'? బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత రావాలంటే!


 

War 2 Collection: ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యధిక శాతం ఫ్లాప్ అయినవే ఉన్నాయి. వాటిల్లో పెద్ద హీరో సినిమాలే ఎక్కువ. వరుస ఫ్లాప్స్ లో ఉన్న టాలీవుడ్ ని పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) 'హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) కాపాడుతుందేమో అని ఆశపడ్డాయి ట్రేడ్ వర్గాలు.

కానీ ఆ చిత్రం ఈ ఏడాది అత్యధిక నష్టాలను తెచ్చిన చిత్రం గా నిల్చింది. 128 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి క్లోజింగ్ లో 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే దాదాపుగా 53 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది అన్నమాట. ఇప్పట్లో ఈ రేంజ్ నష్టాలు తెచ్చిపెట్టే సినిమా రాదులే అని అంతా అనుకున్నారు. కానీ నెల రోజులు కూడా గడవక ముందే ‘వార్ 2′(War 2 Movie) రూపం లో వచ్చేసింది. ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైంది.

‘దేవర’ భారీ హిట్ అవ్వడం తో ఆ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను కొనుగోలు చేసిన నాగవంశీ నే ‘వార్ 2’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేశాడు. ‘దేవర’ బాగా ఆడింది కదా, ఈ చిత్రం కూడా ఓపెనింగ్స్ నుండి వీకెండ్ వరకు భారీగా వసూళ్లను రాబడితే సేఫ్ అయిపోవచ్చు అని అనుకోని ఈ చిత్రాన్ని నాగవంశీ కొనుగోలు చేసి ఉండొచ్చు. యాష్ రాజ్ ఫిలిమ్స్ కి ఆయన దాదాపుగా 94 కోట్ల రూపాయిలు చెల్లించి ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేశాడు. అందులో 70 కోట్ల రూపాయిలు నాన్ రీకవరబుల్, 10 కోట్ల రూపాయిలు రీకవరబుల్, 14 కోట్లు GST. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.


ఇప్పటి వరకు ఈ చిత్రానికి రెండు రోజులకు కలిపి థియేట్రికల్ షేర్ 20(GST లేకుండా) కోట్ల రూపాయిల వరకు వచ్చింది. ఈరోజు రేపు మరో పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావొచ్చు. క్లోజింగ్ కి దాదాపుగా 35 కోట్ల రూపాయిలు రావొచ్చు. యాష్ రాజ్ సంస్థ నుండి 10 కోట్లు + రిటర్న్ GST 14 కోట్లు, మొత్తం మీద 24 కోట్లు తిరిగి వస్తాయి. నాగవంశీ కి 35 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లుతుంది. బిజినెస్ కూడా ఆయన GST తో చేశాడు కాబట్టి, బయ్యర్స్ కి కచ్చితంగా రిటర్న్ GST కట్టాల్సిందే. అలా ఓవరాల్ గా 50 కోట్లు నష్టాన్ని భరించాల్సి వస్తుంది. రికవరీ రేటు 50 శాతం కంటే తక్కువ. ఇది నిర్మాత నాగవంశీ కి అజ్ఞాతవాసి చిత్రం తర్వాత అతి పెద్ద డిజాస్టర్ అనుకోవచ్చు. మళ్ళీ ఆయన కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో చూడాలి.