ott cinema: The movie that has been ruling OTT for six years.. A detective series with unexpected twists..

 

నిజమైన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. ఇందులోని ప్రతి సన్నివేశం, ప్రతి మలుపు మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మొత్తం 7 ఎపిసోడ్స్ ఉండే ఈ సిరీస్ పేరు బార్డ్ ఆఫ్ బ్లడ్. 2019లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. దీనికి రిభు దాస్ గుప్తా దర్శకత్వం వహించారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో అతడు కబీర్ ఆనంద్ పాత్రలో కనిపించారు.

అలాగే ఈ సిరీస్ లో వినీత్ కుమార్ సింగ్, శోభితా ధూళిపాల, కీర్తి కుల్హారి, జైదీప్ అహ్లవత్ కీలకపాత్రలు పోషించారు. ఈ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ బిలాల్ సిద్ధిఖీ రాసిన అదే పేరుతో ఉన్న నవల ఆధారంగా చిత్రీకరించారు. ఆరేళ్ల క్రితం విడుదలైన ఈ సిరీస్ ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ కు IMDBలో 6.7 రేటింగ్ ఉంది.

ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇమ్రాన్ హష్మీ నటించిన ఈ సిరీస్ ఆద్యంతం సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది. ఇక ఇందులో వచ్చే సస్పెన్స్, ట్విస్టులు మిమ్మల్ని ఉత్కంఠకు గురిచేస్తాయి.