Tamannaah Bhatia on Sunny Leone's path.. Milky beauty in a bold movie:సన్నీ లియోన్ దారిలో తమన్నా భాటియా.. బోల్డ్ మూవీలో మిల్కీ బ్యూటీ


 స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రస్తుతం తన కెరీర్ ను సెకండ్ ఇన్నింగ్స్ లో కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా మరింత జోరుగా సినిమాలు చేస్తోంది. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్స్ ల్లో నటిస్తూ షాక్ ఇస్తోంది.

ఛాలెంజింగ్ రూల్స్ తో నటిస్తూ ఆకట్టుకుంటూ వస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ మిల్క్ బ్యూటీ చాలానే గుర్తుండిపోయే సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇటు సౌత్ అటు బాలీవుడ్ లో బ్యాలెన్డ్స్ గా సినిమాలు చేస్తోంది. అయితే టాలీవుడ్, సౌత్ చిత్రాల కంటే ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం విశేషం.


ఇప్పటికే హిందీలో తమన్నా భాటియా కొన్ని సెన్సేషన్ చిత్రాలు, సిరీస్ ల్లో నటించింది. బోల్డ్ సీన్లలో నటించి, తొలిసారిగా ముద్దులు కూడా పెట్టేసి తన కెరీర్ లో పెట్టుకున్న రూల్ ను చెరిపేసింది. తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి తమన్నా భాటియా నటించిన లస్ట్ స్టోరీ 2 చిత్రంలో రొమాన్స్ సీన్లలో తమన్నా రెచ్చిపోయి నటించింది. తన బ్యూటీనెస్ తో మైండ్ బ్లాక్ చేసింది. తొలిసారిగా తమన్నా భాటియా ఇలాంటి సన్నివేశాల్లో నటించడంతో అంతా షాక్ అయ్యారు. ఇక మరో షాక్ ఇచ్చింది.


ఈాసారి తమన్నా భాటియా ఏకంగా బీ గ్రేడ్ తరహాలోని సీన్లలో నటించి అభిమానులతోపాటు అందరి నోట మాట రాకుండా చేసింది. తమన్నా భాటియా ఇలా తన కెరీర్ లో చేస్తున్న బోల్డ్ సినిమాలకు షాక్ అయ్యారు. చిత్ర పరిశ్రమలోనూ తమన్నా భాటియా నిర్ణయానికి షాక్ అయ్యారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ తర్వాత తమన్నా భాటియా పలు స్పెషల్ సాంగ్స్ ఆజ్ కి రాత్, నువ్వు కావాలయ్యా వంటి సాంగ్స్ ల్లో గ్లామర్ ను వెదజల్లింది. ఆ సాంగ్స్ కూడా సెన్సషనల్ గా హిట్ అయ్యాయి. ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.


ఇక ఇప్పుడు తమన్నా భాటియా మరో బోల్డ్ చిత్రంలో నటించోబోతోందని తెలుస్తోంది. బాలీవుడ్ లో రూపుదిద్దుకోబోతున్న రాగిని ఎంఎంఎస్ 3 చిత్రంలో తమన్నా భాటియా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఎక్తా కపూర్, సన్నీ లియోన్ లు రాగిని 2011లో ఎంఎంఎస్ 1, 2014లో రాగిని ఎంఎంఎస్ 2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఈ చిత్రం హార్రర్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాగిని ఎంఎంఎస్ 2లో సన్నీ లియోన్ నటించిన బాబీ డాల్, చార్ బాటల్ వొడ్కా వంటి సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి.


ప్రస్తుతం తమన్నా భాటియా రాగిని ఎంఎంఎస్ 3లో నటించబోతోందని అనడంతో ఇంకెంతటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందోనని అంటున్నారు. ఈ చిత్రంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగులో తమన్నా భాటియా ఇప్పటికే ఓదెల 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. రీసెంట్ గా రెయిడ్ 2లో నషా అనే స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకుంది. నెక్ట్స్ హిందీలో డార్లింగ్ పార్టనర్స్, రొమియో, రేంజర్ తో పాటు మరో రెండు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.