పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kayan) అభిమానులు ఈ సినిమా పై ప్రాణాలు పెట్టుకున్నారు. తమ అభిమాన హీరో ఈ చిత్రం తో ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బద్దలు కొట్టి మళ్ళీ నెంబర్ 1 స్థానం లో కూర్చోవాలని కోరుకుంటున్నారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సుజీత్. ఆయన కూడా పవన్ కళ్యాణ్ అభిమాని అవ్వడం తో ఎంతో కసితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ విషయం మనకి గ్లింప్స్ వీడియో మరియు 'ఫైర్ స్ట్రోమ్' సాంగ్ తోనే అర్థం అయ్యి ఉంటుంది. ముఖ్యంగా 'ఫైర్ స్ట్రోమ్' సాంగ్ అయితే విస్ఫోటనం లాగా పేలింది. యూత్ ఆడియన్స్ ఈ పాట ని చూసి మెంటలెక్కిపోతున్నారు.
ఎక్కడ చూసినా, ఎక్కడికి వెళ్లినా ఈ పాటనే వినిపిస్తుంది. అయితే ఈ సినిమాలోని రెండవ పాట అప్డేట్ కోసం ఫ్యాన్స్ చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. ముందుగా ఆగస్టు 15 న విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ రెండు పాన్ ఇండియన్ సినిమాలు విడుదల ఉండడం తో వాయిదా వేశారు. నేడు కాసేపటి క్రితమే ఈ పాటకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక మోహన్(Priyanka Mohan) ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తూ, ఆమె క్యారక్టర్ పేరు 'కన్మణి' అని అభిమానులకు పరిచయం చేశారు. అంతే కాకుండా రెండవ పాట మెలోడీ అని, త్వరలోనే పాటకు సంబంధించిన ప్రోమో ని విడుదల చేస్తామంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే నేడు విడుదల చేసిన ప్రియాంక మోహన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
'ఓజీ' అంటే అందులో హీరోయిన్ చాలా స్టైలిష్ గా, పవన్ కళ్యాణ్ లాగానే యాక్షన్ ఫైట్స్ చేస్తూ ఉంటుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆమెని ఎంతో పద్దతిగా, గృహిణి గా ఈ చిత్రం లో ఈ లుక్ లో చూపించారు. ఇందులో ఆమె పవన్ కళ్యాణ్ కి భార్య గా కనిపించబోతుంది. అయితే ఆమె ఇంత పద్దతిగా ఉండడం చూసి అభిమానులు కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇంత పద్దతిగా ఈ అమ్మాయి ఉందంటే, కచ్చితంగా సినిమాలో ఆమెని విలన్స్ చంపేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ప్రియాంక మోహన్ డాక్టర్ వృత్తిలో కనిపించబోతుందట. ఆమె కెరీర్ లోనే ఈ క్యారక్టర్ ది బెస్ట్ గా నిలిచిపోతుందని అంటున్నారు. అయితే ఇంతటి యాక్షన్ చిత్రం లో మెలోడీ సాంగ్ అవసరమా అని అభిమానుల నుండి ఎదురు అవుతున్న ప్రశ్న. కానీ ఆ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని, ఫైర్ స్ట్రోమ్ ని మించిన హిట్ అవుతుందని అంటున్నారు నెటిజెన్స్.