మెగాస్టార్ చిరంజీవి స్వయంగా డైరెక్ట్ చేసి సూపర్ హిట్ కొట్టిన సినిమా... ఏంటా మూవీ? వివరాలు మీకోసం!
69 ఏళ్ళ వయసులో కూడా చిరంజీవి లో ఎక్కడ స్పీడ్ తగ్గటం లేదు. ఒక పక్క అనిల్ రావిపూడి తో సూపర్ ఫాస్ట్ గా చిత్రన్ని పూర్తిచేసి రిలీజ్ కు సిద్దమవుతున్నాడు.
ఇంకో పక్క విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న విశ్వంభర షూటింగ్ పార్ట్ పూర్తిచేసాడు. 150 కి పైగా చిత్రాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి మెగా ఫోన్ పట్టుకుని డైరెక్షన్ చేసాడని మీకు తెలుసా? అది కూడా ఇంద్ర సినిమాకు. అదేంటి ఇంద్ర సినిమాకు దర్శకుడు బి.గోపాల్ కదా? చిరంజీవి అంటారేంటి. అసలు ఏమి మాట్లాడుతున్నారు అంటూ సీరియస్ లుక్ వెయ్యొద్దు. నిజమే ఇది..ప్రూఫ్ కావాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే...
దర్శకుడు గా చిరంజీవి:
చిరంజీవి కెరీర్ లో ఇంద్ర సినిమా మర్చిపోలేనిది. కలెక్షన్ పరంగానే కాదు అనేక రకాలుగా ఈ చిత్రం ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. అప్పుడు వస్తున్న మాస్ ఫ్యాక్షన్ సినిమాల హవా నడుస్తున్న టైం లో చిరు చేసిన ఈ చిత్రం మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అందరిని ఉర్రూతలూగించి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఒక టైం లో ఈ సినిమాను కొన్ని మేనేజ్మెంట్ కాలేజీల్లో ఒక పాఠంగా కూడా చెప్పారట... ఇంద్ర సినిమా నుండి ఒక బిజినెస్ మాన్ లైఫ్ లో నేర్చుకోదగ్గ లెసన్స్ అనే టాపిక్ లో. ఇందులో నిజ నిజాల మాట ఎలా ఉన్నా అప్పట్లో ఓ ఊపు ఊపేసిన ఈ చిత్రం గురించి కొన్ని ఊహాగానాలు వినపడతాయి. అదే ఆ సినిమా షూటింగ్ టైం లో బి గోపాల్ తో చిరంజీవి విభేదాల గురించి. బి గోపాల్ తో ఆ సినిమా చిత్రీకరణలో గొడవలు వచ్చాయని, అందుకే చిరంజీవి కొన్ని పాటలకు, ఫైట్లకు తనే దర్శకత్వం వహించాడని. ఇది నిజమేనా అంటే విభేదాలు నిజం కాదు కానీ, చిరంజీవి మెగా ఫోన్ పట్టుకుని ఇంద్ర సినిమాలో కొన్ని సన్నివేశాలకు దర్శకత్వం వహించడం మాత్రం నిజమే అని డైరెక్టర్ స్వయంగా చెప్పాడు. అసలు చిరంజీవి డైరెక్షన్ చేసిన ఆ సన్నివేశాలు ఏంటి... అసలు చిరంజీవి ఎందుకు ఇంద్ర సినిమాకు బి గోపాల్ ను పక్కన పెట్టి తనే స్వయంగా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు అనే వివరాల్లోకి వెళితే...
అసలు కారణం ఇదీ:
బి గోపాల్ అప్పట్లో చిరంజీవి ఇంద్ర సినిమాతో పాటు ఎన్టీఆర్ అల్లరి రాముడు చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. రెండు చిత్రాలు ఒకసారి కమిట్ అవడం వల్ల తరచూ రెండు సినిమాల ఆర్టిస్టుల డేట్స్, షూటింగ్ షెడ్యూల్ లు క్లాష్ అవ్వకుండా చూసుకుంటూ చేయాల్సి వచ్చేది. అప్పట్లో దర్శకులు చాలా బిజీగా ఉండేవారు. ఇప్పట్లా ఒకే సినిమా సంవత్సరాలు చెక్కటం అప్పట్లో లేదు. దాంతో అప్పట్లో చిరంజీవితో చేస్తున్న ఇంద్ర సినిమాలో ఒక ఫైట్ సన్నివేశం అన్నపూర్ణ 7 ఎకరాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు బి గోపాల్ అల్లరి రాముడు సినిమా షూటింగ్ కోసం కెనడా వెళ్లవలిసి వచ్చింది. దాంతో ఇంద్ర సినిమాలో ఆ ఫైట్ సన్నివేశాన్ని చిరంజీవి స్వయంగా డైరెక్ట్ చేసాడు. అదే కాకుండా ఇంద్ర సినిమా సాంగ్స్ షూటింగ్ స్విట్జర్లాండ్ లో జరుగుతున్నప్పుడు కూడా ఇక్కడ అదే సినిమా మరో షెడ్యూల్ ప్లాన్ చెయ్యటం లో సాంగ్స్ షూటింగ్ వదిలేసి ఇండియా వచేసాడు బి గోపాల్. ఆ సీన్లు ఏవో కాదు...తేజ సజ్జ బాల ఇంద్ర సేనా రెడ్డిగా మెట్లు దిగే సీన్. ఆ సన్నివేశం చిత్రీకరణ కోసం చిత్రీకరణ కోసం బి గోపాల్ హైదరాబాద్ వచ్చేస్తే చిరంజీవే స్వయంగా డాన్స్ డైరెక్టర్ తో కో ఆర్డినేట్ చేసుకుని చిత్రీకరణ పూర్తిచేసుకున్నాడు. ఇంకో సందర్భంలో మళ్ళీ అల్లరి రాముడు షూటింగ్ కోసం బి గోపాల్ వెళ్లాల్సి రావడంతో చిరంజీవే స్వయంగా ఇబ్బంది ఏమి లేదు, నువ్వు ఆ షూటింగ్ చూసుకో ఇక్కడ నేను మేనేజ్ చేసుకుంటాను అని స్వయంగా చెప్పాడట. రచయిత పరచూరి గోపాలకృష్ణతో కలిసి బి గోపాల్ తో ముందే డిస్కస్ చేసి కొన్ని లీడ్ సీన్లకు చిరంజీవి దర్శకత్వం వహించాడు. ఇవన్నీ స్వయంగా బి గోపాల్ చెప్పిన మాటలే. అప్పట్లో సాంగ్స్ ఫైట్స్ కు దర్శకుడు ఉండకపోవడం అనేది చాలా మామూలు విషయం. సాంగ్స్ డైరెక్షన్ కొరియోగ్రాఫర్ కు వదిలేసి, ఫైట్స్ స్టంట్ మాస్టర్ కు వదిలేసి వేరే షూటింగ్లకు వెళ్ళిపోయేవారు. అప్పట్లో అలా వీలయ్యేది. తప్పనిసరి పరిస్థితుల్లో హీరో ఇన్వాల్వెమెంట్ ఉండేది.
వందల చిత్రాల్లో నటించి మెగా స్టార్ గా ఎదిగిన చిరంజీవికి డాన్స్, దర్శకత్వం ఇలా అనేక విభాగాల్లో పట్టుండటం ఆశ్చర్యం ఏమి కాదు. నిజానికి ప్రతీ చిన్న విషయం లో చిరంజీవి ఇన్వాల్వెమెంట్ ఉండటంతోనే సినిమాలు ఆ స్థాయిలో వచ్చేవని చెప్పొచ్చు కూడా. ఇది దర్శకుడి పనిలో వేలు పెట్టటంకాదు. చిరంజీవికున్న అనుభవం వారికి ఉపయోగపడటం. ఆ అంకితభావం వల్లేనేమో చిరు చిత్రాలు ఆ స్థాయిలో హిట్ అయ్యేవి, ప్రేక్షకుల గుండెల్లో మెగాస్టార్ ని చేసాయి.