Power Star Pawan Kalyan అభిమానులకు వినాయక చవితి పండుగ మరింత ఉత్సాహాన్ని అందించింది. పవన్ ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ' (OG) నుండి పండుగ కానుకగా ఓ అందమైన మెలోడీ పాటను విడుదల చేశారు.
ఈ పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో, డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా, ముంబైలోని ఒక గ్యాంగ్‌స్టర్ కథ ఆధారంగా రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
సంగీత దర్శకుడు తమన్ అందించిన "సువ్వి సువ్వి" అంటూ సాగే ఈ మెలోడీ పాటను కల్యాణ్ చక్రవర్తి రచించగా, శ్రుతి రంజనీ ఆలపించారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్ మధ్య ఉన్న కెమిస్ట్రీ సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవన్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.