గుండెనిండా గుడిగంటలు ఆగష్టు 28 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu August 28 Episode)
మనోజ్ , రోహిణి సెకెండ్ హ్యాండ్ కారు కొనుక్కుని ఇంటికి వస్తారు.
వాళ్లను చూసి మురిసిపోతుంది ప్రభావతి. మీరు గొప్పవాళ్లు అవుతాంటూ చాలా హడావుడి చేస్తుంది. తీరా కారుకి హారతి ఇస్తుంటే ఆరిపోతుంది. గాలికి ఆరింది..కంగారుపడకండి అని సర్దిచెబుతుంది. నువ్వేమైనా పూలమ్ముకునే దానివి కాదు కదా..సెకెండ్స్ లో కారు కొనాల్సిన అవసరం ఏంటంటూ మీనాను టార్గెట్ చేస్తుంది. నేను కూడా కొంటాను అంటుంది శ్రుతి. నీకేం ఖర్మ మీ నాన్నని అడిగితే పెద్ద కారే కొనిస్తారంటుంది ప్రభావతి. మావగారు ఇచ్చిన సొమ్ము తినేంత చవటను నేనుకాదంటూ ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేస్తాడు రవి. మనోజ్-రోహిణి ఇద్దరూ లోలోపలే రగిలిపోతారు
కారు తీసుకొచ్చిన ఆనందాన్ని ముగ్గురు సోదరులు సెలబ్రేట్ చేసుకుంటారు. ముగ్గురు తోడికోడళ్లు బాలుగురించి బెట్ కాసుకుని మేడపైకి వెళతారు. అదే సమయానికి బీర్ బాటిల్ మూతను నోటితో తీస్తూ కనిపిస్తాడు బాలు. నేను చెప్పానుగా ముందు బాలునే తాగుతాడని సెటైర్ వేస్తుంది రోహిణి. పందెం అని రోహిణి అంటే పదండి వెళ్లి చూద్దాం అంటుంది శ్రుతి.
మేడపైకి వెళ్లి చూసేసరికి మనోజ్...ఏదేదో మాట్లాడుతుంటాడు.. మేడంతా పాకుతూ పార్క్, పల్లీలు, గుడి, అడుక్కోవడం అని మాట్లాడుతుంటాడు. పైన ఇవన్నీ పగలగొట్టింది ఎవరు అని శ్రుతి అడిగితే మనోజ్ అని చెబుతాడు రవి. బాలు కాదా అని అడిగితే బాలు అన్నయ్య అసలు తాగలేదంటాడు. రవి , బాలు బాగానే ఉన్నారు.. ఇప్పుడు అర్థమైందా రోహిణీ ఎవరు ఎక్కువ తాగారో అని శ్రుతి ఇచ్చిపడేస్తుంది. రోహిణి బలవంతంగా లాక్కెళ్లిపోతుంది మనోజ్ ని.
మీరు తాగలేదా అని మీనా పదే పదే అడుగుతుంటే.. అయితే ఊదండి అంటుంది మీనా. హమ్మయ్య తాగలేదు ...ఇవాళే కాదు ఎప్పటికీ తాగకూడదు అంటుంది. అలాఅని మాటివ్వలేను అంటాడు..అంతకన్నా కిక్ ఇచ్చేది ఏదైనా ఉంటే తాగడం మానేస్తా అంటాడు. మల్లెపూలు కిందే ఉన్నాయనే హింట్ ఇస్తుంది మీనా.
మీనా లాగిపెట్టి కొట్టిన విషయం గుర్తొచ్చి సంజయ్ రగిలిపోతుంటాడు.. మీనా ఇచ్చిన వార్నింగ్ పదే పదే గుర్తుచేసుకుంటాడు. బాలుని వాడి ఫ్యామిలీని టార్గెట్ చేద్దామని మౌనికను పెళ్లిచేసుకున్నా..కానీ ఎన్నిసార్లు ప్లాన్ చేసినా ఫెయిల్ అవుతోంది.. వాడిని ఏదో ఒకటి చేయకపోతే నా పెళ్లాం నన్ను లెక్కచేయదు అనుకుంటాడు. మీనా బాలుని వదిలిపెట్టను అనుకుంటాడు
బాలు కార్లో వచ్చిన ఫర్నిచర్ షాప్ ఓనర్ ...పర్స్ మర్చిపోయాను లోపల ఉందని చెబుతాడు. నేను వచ్చి డబ్బులు తెచ్చుకుంటా అంటాడు బాలు. ఇంతలో ఫర్నిచర్ షాప్ ఓనర్ ని రౌడీలు వచ్చి బెదిరిస్తారు. నా షాప్ ని అమ్మను అని చెబుతున్నా సగం రేట్ కి ఇమ్మని నన్ను బలవంతం చేస్తున్నారని చెబుతాడు. వాళ్లని ఉతికి ఆరేస్తాడు బాలు. వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చుకదా అని అంటే... వాళ్లకు రాజకీయ సపోర్ట్ ఉందని చెబుతాడు. నాకు తెలిసిన నాయకుడు ఉన్నాడు ఆయనతో చెప్పి మీకు సమస్య లేకుండా చేస్తాను అంటాడు. మీరు నా తండ్రిలాంటివారు అంటాడు.
ఇంత మంచి షాప్ ఎందుకు అమ్మాలని అనుకుంటున్నారని బాలు అంటే... నా కొడుకు అమెరికాలో ఉంటున్నాడు వాడి దగ్గరకు వెళ్లేందుకు ఇది అమ్మేద్దామని అనుకుంటున్నా అని చెబుతాడు. ఎంతకు అమ్మాలి అనుకుంటున్నారని అడిగి..మా అన్నయ్య బిజినెస్ చేస్తాడేమో అడుగుతాను అంటాడు. సరే మా అన్నయ్యకి చెప్పి చూస్తాను అంటాడు బాలు. నీ నంబర్ చెప్పు అని బాలు నంబర్ తీసుకుంటాడు ఫర్నిచర్ షాప్ ఓనర్.
మనోజ్, రవి తాగి ఆలస్యంగా లేస్తారు...ప్రభావతి అడుగితే గట్టిగా అరవొద్దు తలనొప్పిగా ఉందంటారు. ఇంతకీ మీరు ఏం బిజినెస్ చేస్తున్నారని శ్రుతి అడుగుతుంది. రెండు ఇళ్లు కట్టి రెంట్ కి ఇవ్వండి అంటుంది ప్రభావతి. 25 లక్షలతో రెండు ఇళ్లు...షభాష్ పావురాలు ఉండడానికా, కోళ్లు ఉండడానికా అని అడుగుతారంతా. ఇంతలో బాలు వస్తాడు... అందరూ ప్రభావతి సెటైర్ వేస్తారు...
ఇందాక నేను ఓ కష్టమర్ ని ఓ షాప్ దగ్గర డ్రాప్ చేశాను.. వాళ్ల షాప్ అమ్మకానికి పెట్టారంటాడు. చాల్లే నువ్వు కిరాణా కొట్టో, పూల షాపో చూసి ఉంటాడు అని సెటైర్ వేస్తుంది. నేను చూసింది ఫర్నిచర్ షాప్ అని చెబుతాడు బాలు..అంతా అవాక్కై చూస్తారు..