Chinni Serial Today August 27th చిన్ని సీరియల్: పరువు తీసేశావంటూ మహిపై దేవా సీరియస్! మహిని ప్రేమిస్తున్న మధు!

 


Chinni Serial Today Episode మధుని మహి తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇప్పటికి బయట పడింది కానీ రేపు సమాజం ఎన్నో అంటుందని దాన్ని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు అని మధు తల్లిదండ్రులు ఏడుస్తారు.

మహి మధు తండ్రితో మధు కడిగిన ముత్యం మధు ఎలాంటిదో మనందరికీ తెలుసు తన మంచితనానికే మంచి భర్త వస్తాడు. పనీ పాట లేని వాళ్లు పనికట్టుకొని మరీ ఇలాంటివి వైరల్ చేస్తారు... కొన్ని రోజుల తర్వాత వదిలేస్తారు మీరు ఇది మర్చిపోండి అని ధైర్యం చెప్పి వెళ్లిపోతాడు. దేవా, నాగవల్లి అందరూ మహి కోసం వెయిట్ చేస్తుంటారు. సీఎం దేవాకి కాల్ చేసి వీడియో గురించి అడుగుతారు. పొలిటికల్ లీడర్స్ అందరూ ఫోన్లు చేసి అడిగితే మహిని ఫ్రెండ్స్ టీజ్ చేయడానికి అలా చేశారని చెప్తాడు. చాలా ఫోన్స్ రావడంతో దేవా అందరి మీద అరుస్తాడు. ఫోన్లు ఆపేయమని అంటాడు.


నాగవల్లి గారాబం వల్లే ఇలా అయిపోయాడని వల్లిని దేవా తిడతాడు. మహి ఇంతలో రాగానే మహి మీద అరుస్తాడు. నువ్వు చేసిన పనికి నన్ను అందరూ ఫోన్లు చేసి పరువు తీస్తున్నారని అంటాడు. నాగవల్లి నేను మాట్లాడుతా అంటే దేవా మళ్లీ వల్లిని తిడతాడు. మమ్మీని తిట్లొద్దు దాడీ ఓ అమ్మాయి పరువు కాపాడాలని ప్రయత్నించా అని అంటాడు. ఆ అమ్మాయి పరువు కాపడావో లేదో తెలీదు కానీ మా పరువు తీశావ్రా.. పొద్దున్నుంచి ఎంత మంది కాల్ చేసి ఎన్ని మాట్లాడారో నీకు తెలీదు. వాళ్లందరికీ సమాధానం చెప్పలేకపోయాం తెలుసా. బయట వాళ్లు అడిగితే నచ్చితే సమాధానం చెప్తాం లేదంటే ఫోన్ ఆపేస్తాం కానీ ఇంట్లో అంతా రాత్రంతా ఎంత టెన్షన్ పడ్డారో నీకు తెలుసా.. ఒకరికొకరు సర్ధి చెప్పుకుంటూ ఏదో ఒకలా రాత్రంగా గడిపాం. తెల్లారితే ఏం వార్త వినాల్సి వస్తుందో అని భయంతో వణికిపోయాం. ఎవడో దారిని పోయే దానయ్య చేస్తే వీడియో వైరల్ అయినా పర్లేదు కానీ నువ్వు ఓ హోంమినిస్టర్ కొడుకు అని మర్చిపోయావా.. మన ఫ్యామిలీలో ఎవరు చిన్న తప్పు చేసినా పెద్దది చేసి వైరల్ చేస్తారు. మహి ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్.. ఈ క్షణం నుంచి నువ్వు మన గురించి మన ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచించాలి. నాగవల్లి ఇక నువ్వు వాడి మీద అతి ప్రేమ అతి గారాబం చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. వెళ్లండి.. అని దేవా ఫుల్ ఫైర్ అవుతాడు.


నాగవల్లి దేవాతో నీ పొలిటికల్ కెరీర్ నాశనం అవకుండా నేను చూసుకుంటాను మనం ఫోకస్ మొత్తం ఆ చిన్ని, బాలరాజు మీద మాత్రమే ఉండాలి. వీలైనంత త్వరగా వాళ్లని కావేరి దగ్గరకు పంపాలి అప్పుడే మనం మనస్శాంతిగా ఉంటాం అని చెప్తుంది. మధు మహితో తన పరిచయాన్ని గుర్తు చేసుకుంటుంది. మహి నువ్వు నాకు ఇంత క్లోజ్ అయిపోతావ్ అనుకోలేదు. నువ్వు నా పక్కన ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుందని అనుకుంటుంది. మహి తనకు కప్పిన మహి జాకెట్ చూసి వేసుకుంటుంది. ఇది నా దగ్గర ఉంటే నువ్వు నాతోనే ఉన్నట్లు ఉంది మ్యాడీ.. పద్దూ, చంటి నేను నిన్ను లవ్ చేస్తున్నాను అంటే సరదాగా అనుకున్నా కానీ ఇప్పుడు అనిపిస్తుంది నువ్వు అంటే నాకు ప్రాణం అని తెలుస్తుంది అని అనుకుంటుంది.


ఇంతలో మధు దగ్గరకు స్వప్న వస్తుంది. మ్యాడీతో మాట్లాడాలి అని ఉందని మధు అంటుంది. దాంతో చేయమని స్వప్న అంటుంది. దాంతో మధు కాల్ చేసి మాట్లాడుతుంది. మహి మాట్లాడుతుంటే మధు చాలా టెన్షన్ పడుతుంది. మీ ఇంట్లో ఏమైనా అన్నారా అని అంటే మ్యాడీ లేదని అనేస్తాడు. నువ్వు కాపాడకపోయి ఉంటే నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు అని థ్యాంక్స్ చెప్తుంది. పరాయి వాళ్లకి చెప్పినట్లు అన్ని సార్లు చెప్పకు అని మ్యాడీ అంటే నువ్వు నాకు పరాయి వాడివి కాదు అని మధు అంటుంది. ఇక మహి చిన్నిని చూసి ఎమోషనల్ అవుతాడు. నాకు గడువు లోపల కనిపించు చిన్ని లేదంటే మనం శాశ్వతంగా దూరం అయిపోతాం అని భయంగా ఉందని అనుకుంటాడు.


మధు ఇంటికి పెళ్లిళ్ల పేరయ్య వస్తారు. మధుకి పెళ్లి సంబంధం తెస్తారు. ఇప్పట్లో పెళ్లి చేసే ఉద్దేశం లేదని సుబ్బు అంటే పెళ్లి తర్వాత చదువుకోవచ్చు పేరయ్య అంటారు. మధు గురించి తప్పుగా అనుకుంటున్నారు ఈ టైంలో కోరి వచ్చిన సంబంధం వదిలేయొద్దు అని చెప్తారు. సుబ్బు ఆలోచనలో పడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.