Nuvvunte Naa Jathaga Serial Today August 27th: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున కోసం దేవా త్యాగం!! హరివర్ధన్ కోపానికి కారణమేంటి?

 


Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథునకు తనకు మధ్య బాండ్ గుర్తు చేసుకొని కన్న కూతురు బతుకుతుందో లేదో తెలియని పరిస్థితిలో ఉండటంతో హరివర్ధన్ చాలా ఏడుస్తాడు.

సత్యమూర్తి హరివర్ధన్ దగ్గరకు వచ్చి ఓదార్చే ప్రయత్నం చేస్తాడు.


దేవుడు సంతోషంగా ఉంటే చూడలేడేమో అందుకే కాసేపటి క్రితం సంతోషంతో ఉన్న అందరి కళ్లని కన్నీటితో నింపేశాడు. మీరు బాధ పడకుండా ధైర్యంగా ఉండండి మిథునకు ఏం కాదు అని సత్యమూర్తి కూడా కన్నీరు పెట్టుకుంటారు. దేవా ఏడుస్తూ పరమేశ్వరుడి గుడికి వెళ్తాడు. శివుడు ముందు మోకరిల్లి మిథునకు చిన్నప్పటి నుంచి నిన్నే నమ్ముతుంది. తన జీవితంలో జరిగే ప్రతీ విషయం నీ నిర్ణయమే అని నమ్ముతుంది. అందుకే ఓ చెత్త వెధవ అయిన నాకోసం వచ్చేసింది. అంతలా నమ్మిన తనని నువ్వు చావు బతుకుల్లోకి తీసుకొస్తావా.. నమ్ముకున్న వారిని ఏడిపిస్తావా.. నువ్వు దేవుడివా లేక ఆ రూపంలో ఉన్న రాక్షసుడివా.. నువ్వు నిజంగా ఉంటే నిన్ను నమ్ముకున్న భక్తురాలిని కాపాడు అని ఏడుస్తాడు.


ప్రమోదిని అక్కడికి వచ్చి దేవాని ఓదార్చుతుంది. దేవుడు లేడు వదినా.. అంత మంచి మిథునని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన వాడు దేవుడు ఎలా అవుతాడు అని ఏడుస్తాడు. ఇక గుడిలో అందరూ నిప్పుల గుండం తొక్కుతుంటే దేవా చూసి పంతుల్ని అడుగుతాడు. మన వాళ్లు ప్రమాదంలో కష్టంలో ఉంటే పరమేశ్వరుడుని మొక్కుకుంటే మొక్కు చెల్లిస్తే ప్రమాదంలో ఉన్న వాళ్లు కోలుకుంటారని అంటారు. వెంటనే దేవా మిథున కోసం అలా చేయాలని అనుకుంటాడు. ప్రమోదిని దేవాని ఆపుతుంది. నువ్వు ఎప్పుడూ అలాంటివి చేయలేదు అంటే దేవా చేస్తాను అనడంతో దేవాకి ప్రమోదిని బొట్టు పెట్టి పంపుతుంది.


డాక్టర్లు హరివర్ధన్ వాళ్లతో మిథునకు బులెట్ తీశాం కానీ కండీషన్ సీరియస్ అని అంటారు. ఏ దేవుడో కాపాడుతాడని సత్యమూర్తి ధైర్యం చెప్తాడు. దేవా మిథున కోలుకోవాలని కోరుకొని నిప్పుల గుండం తొక్కుతాడు. ప్రమోదిని దేవాని తీసుకొచ్చి కాళ్లకి పసుపు రాస్తుంది. మిథున కళ్లు తెరుస్తుంది. ప్రమోదిని ఏడుస్తూ మిథున నీలో కేవలం మార్పుని తీసుకొచ్చింది అనుకున్నాం కానీ ఇంత ప్రేమ నింపేసిందని అనుకోలేదు.. నీకు మిథున మీద ఉన్న ప్రేమ మిథునని బతికించేస్తుంది దేవా అని ప్రమోదిని చెప్తుంది.


పోలీసులు హరివర్ధన్ దగ్గరకు వస్తారు. షూటర్ తప్పించుకున్నాడని వాడు మీ శత్రువు కాదు సార్ దేవా శత్రువు. ఆ షూటర్ దేవాని షూట్ చేయడానికి వచ్చాడు. దేవా తప్పించుకోవడంతో మిథున మేడంకి దెబ్బ తగిలిందని చెప్తారు. హరివర్ధన్ షాక్ అయిపోతాడు. ఇక దేవా అమ్మవారికి పసుపు నీటితో అభిషేకం చేస్తాడు. దీపం వెలిగించి మిథున కోసం మొక్కుకుంటాడు. తర్వాత కుంకుమ తీసుకొని మిథున దగ్గరకు వెళ్తాడు. మిథున నుదిటిన కుంకుమ పెడతాడు. మిథున నీకేం కాదు అని బలమైన నమ్మకం ఉంది మరోవైపు భయం వేస్తుంది. నువ్వెప్పుడూ చెప్తావ్ కదా మనది దేవుడు వేసిన బంధం మనల్ని ఎవరూ విడదీయలేరని ఆ మాట నిజమైంది అంటాడు.


దేవా మిథున చేయి పట్టుకొని ఏడుస్తుంటే హరివర్ధన్ కోపంగా ఉన్న కొన ఊపిరి కూడా తీసేస్తావా అని అంటాడు. దేవా షాక్ అయిపోతాడు. నా కూతురిని ప్రాణాలతో ఉండనివ్వవా. తననిమాకు దూరం చేస్తావా ఈ లోకంలోనే లేకుండా చేస్తావా అని అంటారు. ఏంటి సార్ అలా అంటారు మిథున క్షేమంగా ఉండాలని మీ అందరి కంటే నేను ఎక్కువ కోరుకుంటాను.. మిథునని ఇలా చూసి ఏ క్షణం నా ప్రాణాలు పోతాయో అర్థం కావడం లేదు.. అలాంటిది మిథునని బతకనివ్వవా అని అంత దారుణంగా అంటారేంటి సార్ అని దేవా అడుగుతాడు. దానికి హరివర్ధన్ దారుణం కాదు నిజం అంటారు. దేవా షాక్ అయిపోతాడు. నీ వల్ల నీకు ఉన్న శత్రువుల వల్లే నా కూతురికి ఈ పరిస్థితి వచ్చింది.. అని జడ్జి అంటారు. ఇది నా మాట కాదు పోలీసుల ఎంక్వైరీలో తేలిన నిజం అని చెప్తారు. దేవా షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.