గణ షాక్ అయిపోతాడు. కోపంగా రంజిత్తో అంటే వాళ్లు తప్పుడు మనుషులు అని తెలిసి కూడా నువ్వు ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటున్నావా అని అడుగుతాడు.
రంజిత్ గణకు అది చెప్పాల్సింది వాళ్ల నాన్న.. ఎవరు తన అక్రమ సంతానమో ఎవరు సక్రమ సంతానమో చెప్పాల్సింది నువ్వు కాదు వీళ్లు కాదు నువ్వు అనుకుంటున్న మీ నాన్న వాళ్ల నాన్న.. ఆయనను తెచ్చి చెప్పించు అప్పుడు నమ్ముతా అప్పటి వరకు నువ్వు నా ఇంటి వైపు కూడా చూడటానికి వీల్లేదు అవుట్ అని గణని పొమ్మంటాడు. గణ ఆవేశంగా వెళ్లిపోతాడు. రంజిత్ ప్రేరణ వాళ్లతో లోపలికి రమ్మని పిలుస్తాడు. ఏంటి అక్క మనం ఏమైనా ఆట బొమ్మలమా ఒకరు పొమ్మంటారు ఒకరు రమ్మంటారు అని అంటుంది. మన రోజు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి మన రోజు వస్తే మనమేంటో ప్రపంచానికి తెలుస్తుందని అని ప్రేరణ అంటుంది.
గణ రంజిత్ మాటలు తలచుకొని కోపంగా ఉంటే ఈశ్వరి వచ్చి వాళ్లు ఈ ఊరిలో లేరని చెప్పురా అంటే గణ నేను మళ్లీ ఫెయిల్ అయ్యను అమ్మా వాళ్ల విషయంలో చేతకాని వాడిని అయిపోతున్నా అని అంటాడు. ఏమైంది అని ఈశ్వరి అడిగితే వాళ్లు ఇప్పుడు ఆ రంజిత్ గాడి ఇంట్లో ఉన్నారని చెప్తాడు. రంజిత్ అని ఈశ్వరి నోరెళ్లబెడతుంది. రెండేళ్ల తర్వాత నీకు వాడు కనిపించాడని అన్నమాట అని ఈశ్వరి అంటుంది. దాంతో గణ అనడమే కాదు వాళ్లని కాపాడుతున్నాడు అని అంటాడు. నేను వెళ్లగానే వాడికి విషయం అర్థమైంది. ప్రేరణ కుటుంబానికి అండగా నిలిచాడు. వాళ్లకి ఇక ఎవరూ లేరు ఆ దేవుడు వైపు చూడటం తప్ప వేరే దిక్కు లేదు అనుకుంటే ఇప్పుడు వాడు పిల్లర్లా వాళ్లకి అండగా నిలబడిపోయాడు అని గణ అంటాడు. వాడిని టచ్ చేయడం సాధ్యం కాదురా వాడు సామాన్యుడు కాదురా అని ఈశ్వరి అంటే టచ్ చేసి చూపిస్తా అంటాడు. దానికి ఈశ్వరి వాడిని ఢీ కొట్టాలి అంటే నీ పవర్ సరిపోదు నీకు ఎస్ఐ పోస్ట్ రావాలి డిపార్ట్ మంట్లో ఉండాలని అంటుంది.
ప్రేరణ తల్లిమామతో గణ వచ్చి చేసిన రచ్చ చెప్తుంది. ఇంతలో రంజిత్ వస్తాడు. ఇందిర రంజిత్తో సమయానికి మీరు వచ్చారు బాబు లేదంటే మా దుర్మార్గుడు నా బిడ్డల్ని అవమానించి మమల్ని ఇక్కడ ఉండనిచ్చేవాడు కాదు అని అంటుంది. రంజిత్ ప్రేరణకు పేపర్లు ఇచ్చి చదవమని అంటాడు. ఏంటి సార్ ఇది అని ప్రేరణ అంటే అగ్రిమెంట్ పేపర్లు ఇది కొత్త అగ్రిమెంట్ కొత్త రూల్స్ యాడ్ అయ్యావి. ఇవి ముఖ్యంగా నీ కోసం అని ఐశ్వర్యకు చెప్తాడు. రూల్స్ చదువుతా అని చెప్తాడు. నా పర్సనల్ స్పేస్ లోకి తొంగి చూడకూడదు.. నా గదిలోకి గది వైపు కన్నెత్తి చూడకూడదు.. నీ సౌండ్ పొల్యూషన్ తగ్గించాలి అని అంటారు. ప్రేరణ సంతకం పెడుతుంది. దాంతో రంజిత్ ముగ్గురు సంతకం పెట్టాలి అంటాడు. ముగ్గురు సంతకాలు పెడతారు.
సుధాకర్ రంజిత్తో రూల్స్ పెడితే పెట్టారు కానీ మా కోకిల నోటికి తాళం వేశారు అంటాడు. ఇక మీరు ఎవరు అని అడిగితే ప్రేరణ చెప్తుంది. అప్పుడప్పుడు వస్తాను అంటే అప్పుడప్పుడు రండి ఇప్పుడు కాఫీ తాగి వెళ్లండి అని అంటారు. ఇస్తాం సార్ ఇస్తాం అని ప్రేరణ అంటుంది. ప్రేరణ వాళ్లు రంజిత్కి థ్యాంక్స్ చెప్తారు. ఇప్పటికైనా ఆ మెట్టు ఎక్కకు అని ప్రేరణ వార్నింగ్ ఇస్తుంది. రంజిత్ పడుకొని ఉంటే నీ వల్లే ఇదంతా జరిగింది నీ వల్లే మాకు పరిస్థితి వచ్చింది.. ఇక జీవితంలో నువ్వు మేం కలిసి ఉండటం జరగదు అని మాటలు వినిపించి తడబడి లేస్తాడు. బయట వెళ్లి చూస్తే ఐశ్వర్య మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుంటుంది. రంజిత్కి కనిపిస్తే అంతే సంగతి అనుకుంటుంది. ఈ టైంలో ఎందుకు వచ్చాడా అనుకుంటుంది. రంజిత్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటుంది.
ఉదయం ప్రేరణ కోచింగ్కి రెడీ అవుతుంది. ఐశ్వర్య రంజిత్ని ఫాలో అవ్వాలి రంజిత్ గురించి మొత్తం తెలుసుకోవాలి అనుకుంటుంది. ఇందిర కూడా ఈశ్వరి ఇంటికి పనికి వెళ్లాలి అని కంగారు పడుతుంది. ఈశ్వరి కంగారు చూసి ఐశ్వర్య ప్రశ్నిస్తుంది. మార్కెట్కి వెళ్లాలి అని ఏదో చెప్తుంది. ఇక ప్రేరణ కంగారుగా వెళ్లిపోతుంది. బయటకు వెళ్లే సరికి సిద్ధూ ఎదురుగా ఉంటాడు. ప్రేరణకు హాయ్ చెప్తాడు. ప్రేరణ కంగారు పడి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.