Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర విహారిని పడుకోపెట్టి బయటకు వెళ్తుంది. ప్రకాశ్ బయట ఉంటే వెళ్లి నేను బావ వెళ్లిపోయిన తర్వాత ఆ లక్ష్మీ అచూకీ తెలీకుండా చూడు అంటుంది.
ఆ లక్ష్మీ ఎప్పటికీ తిరిగి రాకుండా నేను చూసుకుంటాడు అంటాడు ప్రకాశ్. ప్రకాశ్ తనతో తాను కనకం నువ్వు పోతే ఇన్సూరెన్స్ 10 కోట్లు ఈ సహస్ర అటూ ఇటుగా రెండు కోట్లు ఇస్తుంది. కనకం పోతూ పోతూ నాకు కనకం వర్షం కురిపిస్తుందని అనుకుంటాడు.
యమున దేవుడికి పూజ చేసి విహారి, సహస్ర సంతోషంగా ఉండాలని ఇక్కడ గతం విహారి వదిలేసేలా చేయమని కోరుకుంటుంది. విహారి వెళ్లేలోపు విడాకుల పత్రాల మీద సంతకం పెట్టించాలని అనుకుంటుంది. పద్మాక్షి విహారితో నువ్వు అమెరికా వెళ్లేలోపు తేల్చాల్సిన పనులు ఉన్నాయని అంటుంది. ఏంటి అని వసుధ అడిగితే లక్ష్మీ వాళ్ల అమ్మానాన్నలు అంటూ వచ్చారు కదా అని చెప్పి రిపోర్ట్స్ తెప్పించమని అంబికకు చెప్తుంది. పండు అవుట్ హౌస్లో ఉన్న వాళ్లని పిలుస్తాడు. లక్ష్మీని పిలుస్తారు.
డాక్టర్ రిపోర్ట్స్ పట్టుకొని వస్తాడు. రిపోర్ట్స్ తీసుకున్న సహస్ర రిపోర్ట్స్ చూసి వాళ్లతో కోపంగా ఇప్పుడు నిజం చెప్పండి లక్ష్మీ తల్లిదండ్రులు మీరేనా అని అడుగుతుంది. అందరూ షాక్ అయిపోతారు. అవును అని వాళ్లు అంటారు. దాంతో సహస్ర ఇలా అబద్ధాలు చెప్పడానికి సిగ్గు లేదా అని అడుగుతుంది. డీఎన్ఏ రిపోర్ట్స్లో ఏం వచ్చిందని పద్మాక్షి అడిగితే వీళ్లిద్దరూ లక్ష్మీ తల్లిదండ్రులు కాదని వచ్చింది.. మిస్ మ్యాచ్ అని వచ్చింది. అంటే వీళ్లిద్దరూ లక్ష్మీ తల్లిదండ్రులు కాదు అని అంటుంది. ప్రకాశ్ చారుకేశవతో మీరు ఎన్ని డబ్బులు పోసినా నిజం మార్చలేరు అంటాడు.
పద్మాక్షి వాళ్లతో ఎవరు మీకు ఈ నాటకం ఆడమన్నారో చెప్పు అంటుంది. వాళ్ల చెప్పకపోవడంతో సహస్ర పోలీస్లకు కాల్ చేస్తా అంటుంది. దాంతో ఇదంతా చేసింది నేనే అని చారుకేశవ అంటాడు. వాళ్లని వదిలేయండి మీరు ఏ శిక్ష వేసినా నాకు వేయండి అని అంటాడు. మీరు ఈ ఇంటి అల్లుడు మరిది గారు మీరు ఇలా ఎందుకు చేశారు అని అడుగుతుంది పద్మాక్షి. ఇక లక్ష్మీతో వచ్చిన వాళ్లు నీ తల్లిదండ్రులు కాదు అని తెలిసి కూడా గుడ్లగూబలా ఉన్నావ్ కాని నోరు విప్పి చెప్పలేదు అని అంటుంది. అప్పుడు అలాగే ఉన్నావ్ ఇప్పుడు అదే క్వచిన్ మార్క్ ముఖంతో చూస్తున్నావ్ నిజం చెప్పవే అని అంబిక అంటుంది.
విహారి నేను చెప్తా అంటూ అంటాడు. లక్ష్మీ ఎందుకు మాట్లాడలేదో తన ఇబ్బంది ఏంటో నాకు అర్థమైంది అని అంటాడు. లక్ష్మీ జీవితంలోకి ఒకడు భర్త అంటే లక్ష్మీ ఒప్పుకోలేకపోయింది అందుకే మామయ్య తల్లిదండ్రులుగా తెచ్చే సరికి ఏం మాట్లాడలేదు అని అంటాడు. అత్తయ్య లక్ష్మీ ప్లేస్లో సహస్ర ఉంటే ఏం చేస్తావో మామయ్య అదే చేశాడు అంటే నా కూతురిని దాంతో పోల్చుతావేంట్రా.. ఇదే ప్లేస్లో నా కూతురు ఉంటే చెంప పగలగొట్టి భర్తతో కాపురం చేయించేదాన్ని అంటుంది. దాంతో అంబిక అందుకే కదా దాని భర్త అయిన ప్రకాశ్తో మేం దాన్ని కలుపుతున్నాం కాపురం చేసేలా చేస్తాం అని అంటుంది. పద్మాక్షి మనసులో సహస్ర అమెరికా వెళ్లిపోగానే లక్ష్మీని పంపేయాలి అనుకుంటుంది.
అంబిక సుభాష్ని కలుస్తుంది. ఇద్దరూ వర్కర్స్ని చంపేసే ప్లాన్ చేయడానికి రెడీగా ఉన్నామని అంటాడు. విహారి యూఎస్ వెళ్లిన తర్వాత రెండు మూడు రోజుల్లో ఇలా చేయాలని అంటుంది. విహారి ఇండియా రాకుండా చేయాలి అంటే అరెస్ట్ అయ్యే పరిస్థితి క్రియేట్ చేస్తే రాడని ఇక్కడున్న లక్ష్మీని అరెస్ట్ చేయిద్దాం అని అంటుంది. ఐడియా సూపర్ అని సుభాష్ అంటాడు. మరోవైపు చారుకేశవకు క్లే ఆర్డర్ గురించి అడుగుతాడు. సుబ్బారావు అనే పేరు మీద డెలివరీ వచ్చిందని చెప్తారు. సహస్ర మాటలు విని నవ్వుకుంటుంది. చాలా సేఫ్గా బయట పడ్డానని అనుకుంటుంది. ఇక విహారి విడాకుల గురించి కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మీ విహారి దగ్గరకు వెళ్తుంది. నేను నిజంగానే యూఎస్ వెళ్లాలి అని కోరుకుంటున్నావా అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.