Brahmamudi Serial Today August 28th: 'బ్రహ్మముడి' సీరియల్: హాస్పిటల్‌ పాలైన రాజ్‌ - అయోమయంలో కావ్య


 

Brahmamudi Serial Today Episode: కావ్య కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో చెప్పమని రాజ్ నిలదీయడంతో కావ్య ఏడుస్తూ ఉండిపోతుంది. దీంతో రాజ్ కోపంగా ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకున్నావా..?

అంటాడు దీంతో అపర్ణ రాజ్ ను కొడుతుంది. నిజం చెప్పబోతుంది.


కావ్య: అత్తయ్యా ఆగండి..


అపర్ణ: ఏయ్ నువ్వు ఆగు ఇప్పటికే చాలా ఆలస్యం చేశానే.. అది నిన్ను నానా మాటలు అంటున్నా.. కన్నతీపితో కొడుకుకు ఏమీ కాకూడదని ఇన్ని రోజులు ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు నా కొడుకే ఇలా దిగజారిపోయి మాట్లాడుతుంటే ఇక నిజం దాచడంలో ప్రయోజనం లేదు. ఏంట్రా అలా చూస్తున్నావు. అర్థం కావడం లేదా..? నువ్వు నా కొడుకు లాంటి వాడివి కాదురా.. నా పేగు తెంచుకు పుట్టిన నా కన్న కొడుకువి ఈ కుటుంబం నీది నువ్వు పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే వీళ్లందరూ నీ వాళ్లురా అసలు నీ పేరే రామ్ కాదు రాజ్.. స్వరాజ్. నువ్వు కళావతి అంటూ పిలుచుకుంటున్న నీ భార్య పేరు కళావతి కాదురా..? తన పేరు కావ్య. కావ్య నెల తప్పడానికి కారణం నువ్వు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వు. ఈ దుగ్గిరాల ఇంటికి వారసుడివిరా నువ్వు..


అని ఎమోషనల్ అవుతూ కావ్య, రాజ్ కలిసి శ్రీశైలం వెళ్లడం అప్పుడు జరిగిన యాక్సిడెంట్ గురించి రాజ్ గతం మర్చిపోయిన విషయం చెప్తుంది. రాజ్ ఎమోషనల్ అవుతుంటాడు. కొంచెం గతం గుర్తుకు వస్తుంది.


అపర్ణ: శ్రీశైలానికి వెళ్లిన మీకు యాక్సిడెంట్ అయ్యి నువ్వు చనిపోయావని మేమందరం ఆశలు వదులుకుని ఏడుస్తూ ఉంటే నువ్వు బతికే ఉన్నావని నమ్మిన మొదటి మనిషిరా నీ భార్య. నువ్వు బతికే ఉన్నావని తన మనసు చెప్తుంది అంటే దాన్ని పిచ్చిదానిలా చూశామే కానీ దాని ప్రేమను అర్థం చేసుకోలేకపోయాము. ఈ యామిని నీకు కాలేజీలో పరిచయం అయి నువ్వు తన ప్రేమను రిజెక్టు చేస్తే నీకు జరిగిన యాక్సిడెంట్లో నువ్వు గతాన్ని మర్చిపోయావని ఆ అవకాశాన్ని వాడుకుని నిన్ను నమ్మించి తన ఇటికి తీసుకెళ్లి బావ అంటూ నిన్ను పెళ్లి చేసుకోవాలని చూసింది.


కావ్య: అత్తయ్యా మీరు ఏం మాట్లాడుతున్నారు..?


అపర్ణ: ఎవరో రోడ్డులో పడిపోయిన మనిషిని చూడగానే నీ మనసు ఎందుకు చలించిపోయిందిరా… ఎందుకు హాస్పిటల్కు తీసుకెళ్లిపోయావు… తనను చూసినప్పటి నుంచి తన వెంట ఎందుకు పడ్డావు.. పదే పదే ఎక్కడో చూసినట్టుగా ఉందని నీ మనసుకు ఎందుకు అనిపించింది. ఈ ఇంటి అడ్రస్ తెలియకపోయినా వెతుక్కుంటూ ఎలా వచ్చావు. తనకు ఎలా దగ్గరయ్యావు. అంతెందుకురా.. ఈ యామిని చస్తాను అని చెప్పినా సరే పెళ్లి మండపంలో కావ్యను పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్పావు.. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఉన్నది జన్మజన్మల బంధం. ఆ దేవుడు వేసిన బ్రహ్మముడే తనను నువ్వు గుర్తు పట్టకపోయినా నీ మనసు తన వైపు నడిపించింది.


రుద్రాణి: ( మనసులో) అయ్యో అయిపోయింది. ఏదో జరగబోతుంది.. ఇక యామిని పని ఖతం.


అపర్ణ: యామిని నిన్ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నా అంటున్నా తనను ఎందుకు పరాయి మనిషిలా చూశావు. పరాయి మనిషిలా ఉంటున్న కావ్యను సొంత మనిషిలా ఎలా ఫీల్ అవ్వగలిగావు. అసలు నిన్ను మోసం చేసింది కావ్య కాదురా ఈ యామిని దాని ఫ్యామిలీ. ఆఖరికి నీకు పుట్టబోయే బిడ్డ నీ బిడ్డ కాదు అని నమ్మించడానికి వచ్చింది. నీ నుంచి నీ భార్యను శాశ్వతంగా దూరం చేయడానికి వచ్చింది. హాస్పిటల్లో డాక్టర్ నీకు గతాన్ని గుర్తు చేయాలని ప్రయత్నిస్తే నువ్వు చనిపోతావని చెప్పడంతో నీకు ఏం జరుగుతుందోనని భయపడి ఈ పిచ్చిది తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వే అని గుండెలు పగిలేలా అరిచి చెప్పాలని ఉన్నా మౌనంగా భరించిందిరా నీకోసం.


కావ్య: అత్తయ్యా మీరు ఆవేశం తగ్గించుకుని కొంచెం ఆలోచించండి


అపర్ణ: ఏయ్ నువ్వు ఆగవే.. ఆఖరికి నువ్వు తనని వదిలేసి శాశ్వతంగా అమెరికా వెళ్లిపోతుంటే నువ్వు ఎక్కడో ఒక చోట హ్యాపీగా ఉంటే చాలని తన మీద నింద వేసుకోవడానికి సిద్ద పడింది. అంతే కానీ ఆ నిజాన్ని మాత్రం చెప్పడానికి ఒప్పుకోలేదు. ఆఖరికి తన మీద ఈ మచ్చ పడుతున్నా సరే నోరు మాత్రం తెరవలేదు. ఇదంతా ఎందుకు చేసింది. కేవలం నీకోసం రా నీకోసం. ఇప్పుడు చెప్తున్న విను నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నువ్వు తాళి కట్టిన భార్య. దీని కడుపున పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వే..


అని అపర్ణ ఏడుస్తూ చెప్తుంది. దీంతో రాజ్ కు కావ్యతో జరిగిన పెళ్లి దగ్గర నుంచి ఒక్కోక్కటి గుర్తుకు వస్తాయి. వెంటనే స్పృహ తప్పి పడిపోతాడు రాజ్. రాజ్ను హాస్పిటల్కు తీసుకెళ్తారు. ఐసీయూలో అడ్మిట్ చేస్తారు. డాక్టర్ వచ్చి రాజ్ పరిస్థితి క్రిటికల్ గానే ఉందని చెప్తాడు. అందరూ బాధపడతారు. రుద్రాణి, రాహుల్ వెనక నిలబడి నవ్వుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.