Nindu Noorella Saavasam Serial Today August 28th: 'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్‌: ఆరును హెచ్చరించిన చిత్రగుప్తుడు - తనకేం కాదన్న ఆరు

 


Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు రూంలోకి వెళ్లకుండా భాగీని కిందకు పంపిస్తుంది మనోహరి. కిందకు వెళ్లి దేవుడి రూంలో దీపాలు వెలిగించి పైకి వెళ్తుంది భాగీ.

భాగీ పైకి వెళ్లడం చూసిన ఆరు కంగారుగా ఎలాగైనా భాగీని ఆపమని చిత్రగుప్తుడికి చెప్తుంది. కానీ ఏమీ జరగదని చిత్రగుప్తుడు చెప్తాడు. ఇంతలో పైన రూంలోంచి అమర్ వాళ్లు బయటకు వచ్చి లాక్ చేస్తారు. భాగీ డిసప్పాయింట్ అవుతుంది. ఆరు ఆలోచిస్తూ కూర్చుని ఉండగా భ్రమరం రూపంలో ఉన్న గుప్త వస్తాడు.


గుప్త: ఏమైంది బాలిక ఎందుకు విచారంగా ఉన్నావు


ఆరు: నా కోసం ఇంత చేస్తున్న నా ఫ్యామిలీని చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. నేను దూరమై ఇన్ని రోజులైనా కూడా అంత అభిమానాన్ని నేను ఎలా పొందుతున్నానా అని ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు పోతే రేపు రెండో రోజు అనుకునే ఈ రోజుల్లో కూడా ఇంత ప్రేమను పొందడం నాకు చాలా అంటే చాలా అదృష్టంగా అనిపిస్తుంది. అనాథ శరణాలయంలో ఉన్నన్ని రోజులు చాలా బాధపడేదాన్ని. నాకంటూ ఎవ్వరూ లేరని అలాంటప్పుడు నేను బతికి లేకపోయినా నాకోసం ఇంత మంది ప్రేమను చూపిస్తున్నారు


గుప్త: నీ పూర్వ జన్మలో చేసిన పుణ్యములు ఈ జన్మలో చేసిన మంచి పనులు అంతకు మించిన నీ మంచి మనసు వలనే నీకీ భాగ్యము కలిగినది బాలిక


ఆరు: గుప్త గారు నాకోసం మా వాళ్లు హోమం చేశారు కదా..? ఇక నా అసలు రూపం వస్తుందా..?


గుప్త: ఆవశ్యము బాలిక తప్పకుండా వచ్చును కానీ ఈరోజు కాదు


ఆరు: మరి ఏ రోజు వస్తుంది గుప్తగారు


గుప్త: రేపు వినాయక చవితి కదా అన్ని విఘ్నములను తొలగించు ఆ వినాయకుడు నీ అసలు రూపము ఇచ్చును


ఆరు: అంటే రేపు తప్పకుండా వస్తుంది కదా


గుప్త: ఆవశ్యము వచ్చును బాలిక కానీ రేపు వరకు నీవు అప్రమత్తంగా ఉండవలెను.. ఎందువలన అనిని ఏ క్షణమైనను ఆ చంభా నిన్ను బంధించుటకు వచ్చును నీవు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నను.. ఆ దుష్ట మాంత్రికురాలు నిన్ను బంధించును


చిత్ర గుప్తుడు: బాలిక.. బాలిక.. ఈ బాలిక ఎచ్చటకు వెళ్లింది..?


ఆరు: గుప్త గారు ఇక నాకేం పర్వాలేదు. నాకోసం మా ఆయన, నా చెల్లెలు, పిల్లలు హోమం చేశారు. రేపు వినాయక చవితి కూడా చేస్తారు. నాకు తోడుగా మీరు కూడా ఉన్నారు


చిత్రగుప్తుడు: ఈ బాలిక ఎవరితోనో సంభాషిస్తున్నది.. ఏయ్ భ్రమరమా ఆగుము


ఆరు: మిస్టర్ గుప్త ఎంతసేపని నుంచుంటారు. కూర్చోండి


చిత్రగుప్తుడు: బాలిక ఆ భ్రమరము ఎవరు


ఆరు: ఎవరు అదా తుమ్మెద కదా


చిత్రగుప్తుడు: నువ్వు ఇంతసేపు ఆ భ్రమరముతోనే సంభాషిస్తుంటివా..?


ఆరు: అవును ఇప్పుడు నాకున్న పర్సనాలిటీకి ఈగలతో దోమలతో తప్పా ఇంకెవరితో మాట్లాడలేను కదా మిస్టర్ గుప్త


చిత్రగుప్తుడు: నాకెందుకో ఆ భ్రమరము మా విచిత్రగుప్తుడేమోనని సందేహంగా ఉన్నది


ఆరు: మా గుప్తగారా..? ఆయన్ని మీరే కదా పైకి పంపించారు మళ్లీ ఎలా వస్తారు? ఎందుకు వస్తారు..?


చిత్రగుప్తుడు: ఏ రూపంలో అయినా వచ్చే అవకాశం మాకు ఉన్నది కదా బాలిక


ఆరు: అవునులేండి మీరు ఏ రూపంలోనైనా వస్తారు.. ఎన్ని రోజులైనా పని చేస్తారు. మమ్మల్ని మాత్రం మధ్యలో తీసుకెళ్లిపోతారు. మీకసలు మనఃసాక్షే లేదు..


అని ఆరు చిత్రగుప్తుడి మీద అరుస్తుంది. అయితే నీకు వచ్చే గండాలు తలుచుకుంటనే నాకు చింతవేస్తుంది బాలిక అంటూ చిత్రగుప్తుడు చెప్పగానే నాకేం కాదు మా వాళ్లు ఉన్నారు అంటూ ఆరు హ్యాపీగా వినాకుడి పాట పాడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.