Ott Movies : ఓటీటీలో అదరగొడుతున్న కామెడీ థ్రిల్లర్.. 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..

 


ఇటీవల థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ చిత్రానికి IMDB రేటింగ్ 7.5 కలిగి ఉంది. ప్రస్తుతం ఓటీటీ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటూ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సంచలనం సృష్టిస్తుంది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సినిమా ఏంటో తెలుసా.. ఆగస్ట్ 22న ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సినిమా గురించి మీకు తెలుసా. తమిళనాడులోని సుందరమైన మార్గాల్లో ఒక వృద్ధుడికి, చిన్న దొంగకు మధ్య జరిగే ప్రయాణం..ఆ తర్వాత ఇద్దరి జీవితాల్లో ఎదురయ్యే సవాళ్లు, కష్టాలను చూపిస్తుంది. సరైన మార్గం.. తప్పు మధ్య వ్యత్యాసాలను స్పష్టంగా తెలియజేస్తుంది. భావోద్వేగాలు, ఊహించని మలుపులతో సాగే ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. న్యాయం, విముక్తి వంటి అంశాలు జనాలను ఆలోచించేలా చేస్తాయి. అదే మారిశన్ చిత్రం. సుధీష్ శంకర్ దర్శకత్వం వహించిన 2025 తమిళ థ్రిల్లర్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.