కార్తీక దీపం 2 ఆగస్టు 25వ తేదీ 445వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. జ్యోత్స్న ఎలాగైనా పెళ్లిని ఆపాలని ప్లాన్ చేస్తూనే ఉంటుంది.
ఇక పారుజాతం ఆ తాళిని ఎత్తుకొని రావాలా? అని అంటుంది. అలాగైతే పెళ్లేమీ ఆగిపోదు. ఏదో ప్రయత్నం చేసి 10 నిమిషాల్లో మళ్లీ పెళ్లి జరిపిస్తారు అని జ్యోత్స్న బదులిస్తుంది. ఇక పారిజాతం మరో ఐడియా ఇస్తుంది. లేదంటే పాలల్లో మత్తు మందు కలిపి ఇవ్వాలా? అని అంటుంది. అలాగైనా పెళ్లి ఆగిపోయే పరిస్థితి రాదని జ్యోత్స్న అభిప్రాయపడుతుంది. ఇదే సమయంలో శ్రీధర్ కూడా వస్తాడు. పలు ప్లాన్స్ చెబుతాడు. కానీ జ్యోత్స్న వద్దని అంటుంది. దాంతో మరీ ఏం చేద్దామని పారిజాతం, శ్రీధర్ లు జ్యోత్స్నను అడుగుతారు. పెళ్లి ఆగాలంటే పెద్ద ఆపద, ఆటంకం రావాలని అంటుంది. ఇప్పటికిప్పుడు అందరి దృష్టిని మళ్లించాలంటే కేవలం శౌర్యను కిడ్నాప్ చేయడం తప్ప మరే దారి లేదని అంటుంది. దీంతో శౌర్యను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఇక పిల్లంతా ఎక్కడ ఆడుకుంటున్నారో చూస్తారు. ఒక గదిలో ఆడుకుంటుండటం చూసి శ్రీధర్ వెళ్లి తాళం వేసి వస్తాడు. కానీ శ్రీధర్ కళ్లజోడు పెట్టుకోవడంతో శౌర్య పాప అనుకొని వేరే చిన్నారిని ఆ గదిలో బంధిస్తాడు.
ఇక తిరిగి వచ్చి శౌర్యను కిడ్నాప్ చేశానని జ్యోత్స్న, పారుజాతంతో చెబుతాడు. ఇక ఇదే సమయంలో కాంచన పెళ్లి జరుగుతున్న సమయంలో శౌర్య పాప ఎక్కడ ఉందని అడుగుతుంది. తన తల్లిదండ్రుల పక్కనే శౌర్య ఉండాలని అంటుంది. ముందుగా కాంచన అనసూయకు చెప్పి శౌర్య ను తీసుకు రమ్మని అంటుంది. ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటుందని నేను తీసుకొని వస్తానని వెళ్తుంది. కానీ తిరిగి వచ్చి శౌర్య పాప కనిపించడం లేదని అంటుంది. దీంతో కార్తీక్ బాబు, దీపా, కాంచన కంగారు పడుతారు. పెళ్లి ఆగిపోయినా పర్లేదు కానీ శౌర్య పాపను వెతకాలని కాంచన అంటుంది. ఆ మాటలు విని జ్యోత్స్న, కాంచన సంబర పడుతారు. వీళ్లంతా కంగారు పడుతున్న సమయంలో శౌర్యను తీసుకొని శివ నారాయణ వస్తాడు. ఈ ట్విస్ట్ కు జ్యోత్స్న దిమ్మతిరిగి పోతుంది. శౌర్య నీ దగ్గరే ఉందా అని అడుగుతారు.
దీంతో అవును నా దగ్గరే ఉంది. బయటికి వెళ్తుంటే నాతో పాటు తీసుకొని వెళ్లాను అని చెబుతాడు. దీంతో జ్యోత్స్న శ్రీధర్ పై మండి పడుతుంది. ఒక్క పని సరిగా చేయలేవు అని తిడుతుంది. ఇక పెళ్లి ఆపాలంటే కేవలం పాలల్లో మత్తు మందు కలిపి ఇవ్వడమే అని జ్యోత్స్న అంటుంది. చివరిగా ఇలా పెళ్లికి ఆటంకం కలిగించాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 26వ తేదీ 446 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?