కారు ఇక రాదు..కోర్టుకి వెళ్లాల్సిందే అని బాధపడుతుంటాడు బాలు.
ఇంతలో మీనా బార్ కి వెళ్లి ఫుటేజ్ తీసుకుని వచ్చి బాలుకి చూపిస్తుంది. ఏ యూ ట్యూబ్ చానెల్లో బాలు గురించి తప్పుగా ప్రచారం చేశారో అదే యూ ట్యూబ్ చానెల్లో అసలు వీడియో రిలీజ్ చేయిస్తుంది మీనా. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. పోలీసులు కూడా చూస్తారు. కార్ స్టాండ్ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లిన మీనాను పోలీసులు అంతా మెచ్చుకుంటారు. బాలు ఉడుక్కుంటాడు కానీ నా భార్యను చూసి చాలా గర్వంగా అనిపించిందని ప్రేమను వ్యక్తం చేస్తాడు.
వీడియో వైరల్ అవడంతో సత్యానికి పంపిస్తాడు బాలు మావయ్య రంగ. ఆ వీడియో చూసి సంతోషించిన సత్యం ఇంటికి వెళ్లి మళ్లీ సినిమా చూపిస్తానని చెప్పి హాల్లో ల్యాప్ టాప్ ఓపెన్ చేసి వీడియో చూపిస్తాడు. తన భర్త తప్పుచేయలేదని, గుణ అనే వ్యక్తి చేసిన కుట్రకు బలయ్యాడని మీనా ప్రూవ్ చేసింది..ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు మాట్లాడండి అని రోహిణి, మనోజ్, ప్రభావతి వైపు చూస్తాడు సత్యం. రోహిణి-మనోజ్ షాకవుతారు. దొరక్క దొరక్క దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకుంటే మీనా కాపాడేసిందని మనసులోనే అనుకుంటారు. అప్పుడు కూడా మీనాను టార్గెట్ చేస్తూ బార్ కి వెళ్లిన విషయంపై రచ్చ చేయాలి అనుకుంటారు. కానీ సత్యం ఇచ్చిపడేస్తాడు..శ్రుతి కూడా మీనా ధైర్యాన్ని మెచ్చుకుంటుంది. ఇంట్లో ఈ డిస్కషన్ జరుగుతుండగా.. మీనా, బాలు, రవి వస్తారు. జరిగిన విషయం మొత్తం రవి చెబుతాడు. ఇప్పుడు మాట్లాడండిరా అని బాలు మనోజ్, రోహిణి వైపు చూస్తాడు. తన భార్య మీనాను పొగుడుతాడు.
ఎప్పటిలా తన మొబైల్ పూల షాప్ రన్ చేసుకునే పనిలో పడుతుంది మీనా. ఓ ఆర్డర్ రావడంతో పూలు ఇచ్చి వచ్చేందుకు ఆ ఇంటికి వెళుతుంది. ఆ ఇల్లు ఎవరిదంటే..పోలీస్ స్టేషన్లో బారు కారు తాళాలు ఇచ్చేటప్పుడు మీనాను పొగిడిన SIది. ఆయన భార్యకు పూలు ఇస్తుంది మీనా..ఇంతలో లోపల నుంచి వచ్చి మీనాను చూసి ఈమె భర్తను కాపాడుకునేందుకు ఏం చేసిందో తెలుసా అని వీడియో గురించి మీనా గురించి చెబుతాడు. అప్పుడు ఆ పోలీస్ మాట్లాడుతూ..కేవలం వీడియో చూసి కాదు..సంజయ్ అనే వ్యక్తి CI కి కాల్ చేసి కారు సీజ్ చేయమని చెప్పాడని , అందుకే అంత సీరియస్ యాక్షన్ తీసుకున్నాం అని అసలు విషయం చెప్పేస్తాడు.
ఇదంతా సంజయ్ చేశాడని తెలుసుకున్న మీనా నేరుగా వాళ్లింటికి బయలుదేరుతుంది. అదే సమయంలో మౌనిక సంజయ్ దగ్గరకు వచ్చి ... దీని వెనుక ఎన్నో కుట్రలు జరిగాయ్ కానీ న్యాయమే గెలిచింది మా అన్నయ్య సేఫ్ అని చెబుతుంది. ఇదంతా చేసిందెవరంటే అని మాట్లాడుతున్న మౌనికపై చేయెత్తుతాడు సంజయ్..ఆ చేతిని పట్టుకుంటుంది అప్పుడే ఎంట్రీ ఇచ్చిన మీనా. పోలీస్ తనకు చెప్పిన విషయం చెప్పి సంజయ్ కి షాకిస్తుంది. లాగిపెట్టి సంజయ్ ని కొట్టిన మీనా.. ఆడపడుచు సౌభాగ్యం గురించి ఒక్క క్షణం పక్కనపెడితే నీ రక్తం కళ్లచూసేదాన్ని..ఇంకా ఆయనకు చెప్పలేదు చెప్తే ఏం జరుగుతుందో తెలుసా అని వార్నింగ్ ఇస్తుంది.