Illu Illalu Pillalu Serial Today August 26th: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్: అక్కాచెల్లెళ్లు ఒక్కటైపోయారా? తోడికోడళ్ల జీవితంలోకి వల్లి తొంగి చూస్తుందా? లవర్ రీ ఎంట్రీ!


 

Illu Illalu Pillalu Serial Today Episode ఇడ్లీ బాబాయ్ తిరుపతికి ఇడ్లీ తినిపిస్తూ చెంబుని బాగా చూసుకో చెంబు కట్ చేస్తే పెళ్లి కాదు అని అంటాడు.

ప్రేమ ఒంటరిగా ఇంటి బయట కూర్చొంటే ఇంటి లోపల నర్మద కూర్చొని ఉంటుంది. ఎడ ముఖం పెడ ముఖంగా ఉన్న ఇద్దరు తోటికోడళ్లని చూసిన వల్లి ఇద్దరికీ ఏమైంది ఎప్పుడూ అంటుకొని ఉంటారు కదా అనుకుంటుంది.


నర్మద, ప్రేమ దూరం నుంచి ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ప్రేమ నర్మదని చూసి ముఖం తిప్పుకుంటుంది. ఇదేదో మనకు కలిసి వచ్చేలా ఉందని వల్లి ఇద్దరినీ చూస్తుంది. ఇక కిచెన్లో వేదవతి ఆడుతూ పాడుతూ వంట చేస్తూ గవర్నమెంట్ కోడలూ, మేన కోడలూ రండి అని అంటుంది. ఇద్దరూ వెళ్తే వంట పనిలో సాయం చేయమని అంటుంది.


నర్మద: ఎప్పుడూ మీ అగ్గిపుల్ల కోడలే వంటింటిని ఆక్రమించేస్తుంది కదా ఎవరినీ రానివ్వదు కూడా మరి ఈ రోజు ఏమైంది మీ నిప్పు నీలవేణికి.

వేదవతి: పాపం పుట్టింటి ఆస్తులు పోయావనే బాధలో ఉంది కదా అందుకే నేనే తనని పిలవలేదు.

వల్లి: ఈవిడ ఇంత అమాయకంగా ఉండటం వల్లే అది అలా ఆడుకుంటుంది.

ప్రేమ: అత్తయ్య నువ్వు పదే పదే ఆ వల్లిని పాపం అనకు.

వేదవతి: ఊరికే వస్తుందా కోపం.. అది మీ తోటి కోడలే. పాపం ధైర్యం చెప్పండే కలిసి ఉండండే.. ఏయ్ ఏమైందే మీకు. ఇందాక నుంచి చూస్తున్నా మీ ఇద్దరూ ఏంటే మాట్లాడుకోవడం లేదు. ఏమైంది. ఏయ్ ఏంటే తేడా తేడాగా ఉన్నారు. ఏమైంది. హా అయ్య బాబోయ్ చెప్పండే. ఎప్పుడు చూసినా మీ ఇద్దరు గుణగుణా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుండేంటే ఇలా ఉన్నారు. నన్ను ఆట పట్టించడానికే ఇలా ఉన్నారా.. నాకు చాలా కంగారుగా ఉందే.. ఏమైందో చెప్పండే..

నర్మద, ప్రేమ: ఏం కాలేదు.


ఇద్దరినీ అక్క, చెల్లి అని పిలుచుకోమని అంటుంది. ఇద్దరూ కోపంగా వెళ్లిపోతారు. డౌటే లేదు వీళ్లిద్దరి మధ్య ఏదో జరిగింది అని అనుకుంటుంది. వల్లి మొత్తం చూసి గెంతులేస్తుంది. ప్రేమ కోపంగా బయటకు వెళ్లిపోతుంది. నర్మద వెళ్లి పక్కనే కూర్చొంటుంది. ఇద్దరి మధ్య గొడవని తాను క్యాష్ చేసుకొని ఇద్దరూ ఈ జన్మలో కలవకుండా చేయాలి అని అనుకుంటుంది. నర్మద ప్రేమ పక్క పక్కనే కూర్చొంటే ప్రేమ దూరం జరిగిపోతుంది. చివరకు ప్రేమ లేచి వెళ్లిపోతుంది.


నర్మద: పక్కనే కూర్చొంటే ఎందుకు లేచి వెళ్లిపోతున్నావ్

ప్రేమ: ఎందుకంటే నువ్వు నాకు ఇష్టం లేదు కాబట్టి.

నర్మద: కొడితే ముఖం పగిలిపోద్ది. ఏదో చిన్న పిల్లలి అని చూస్తుంటే రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నావ్ ఏంటి.

ప్రేమ: నేనేం ఎక్కువ చేయడం లేదు నువ్వు చేసింది నాకు నచ్చడం లేదు కాబట్టి నీతో మాట్లాడటం లేదు.

నర్మద: ప్రేమ కథలు పడ్డావంటే నిజంగానే కొట్టేస్తాడు. అయినా ఎవరి కోసమో మనం గొడవ పటడం ఏంటి. బుద్ధి లేకుండా. అసలు ఈ చెత్త డిస్ట్రబెన్స్ ఏంటి. నాతో మాట్లాడకుండా నువ్వు ఉండగలవా. ఊ ఊలు కాదు నా ముఖం చూసి మా మాట చెప్పు.


నర్మద అలా అనగానే ప్రేమ ఏడుస్తూ అక్కా అని వాటేసుకుంటుంది. వల్లి చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. నర్మద ప్రేమతో ఒక తల్లి పిల్లలం కాకపోయినా మనం ఒక్కటే. నువ్వు నాతో మాట్లాడకుండా ఉండటమే కాదు నా చెల్లితో మాట్లాడకుండా నేను ఉండలేను అని ఇద్దరూ హగ్ చేసుకొని ఏడుస్తారు. వల్లీ మళ్లీ కుళ్లుకుంటుంది.


వేదవతి ఇద్దరూ ప్రియమైన కోడళ్లు మాట్లాడుకోవడం లేదని బాధ పడుతుంటే ఇద్దరూ వచ్చి అక్కా చెల్లి అని పిలుచుకొని అత్తకి షాక్ ఇస్తారు. ఐలవ్యూ అక్క ఐలవ్యూ చెల్లి అని అత్తని వాటేసుకుంటారు. మీరు కలిసిపోయారా ఇందంతా డ్రామానా అని అత్త షాక్ అవుతుంది. అప్పడప్పుడు అలా జరుగుతాయని ఇద్దరూ అంటారు. మీ ఇద్దరు ఎప్పుడైనా గొడవ పడితే ఏంచేస్తారే అని వేదవతి అడిగితే వేదవతిని ఇద్దరూ ముద్దు పెట్టుకొని ఇలా ముద్దు పెట్టుకుంటాం అని అంటారు. ముగ్గురు ఫ్రెండ్స్ అనుకుంటూ నవ్వుకుంటారు. వల్లి తెగ ఫీలైపోతుంటుంది.


వల్లి పుట్టింటికి వెళ్తుంది. నర్మద, ప్రేమలు ఎందుకు మనల్ని వదిలేశారని నిజం ఎందుకు చెప్పలేదని ఆలోచిస్తారు. ఇక వల్లి పది లక్షల గురించి టెన్షన్ పడితే ఇడ్లీ బాబాయ్ కూతురితో అల్లుడి కాళ్ల మీద కూడా పడి ఇవ్వలేం అని చెప్పేశాం అని నవ్వుతాడు. మీరు సింపుల్గా చెప్పేశారు కానీ ఆయన ఎక్కడ నుంచి తెస్తారు. ఈ విషయంలో నాతో సరిగా ఉండరు. పైగాఆ నర్మద నాకు వార్నింగ్ ఇచ్చిందని చెప్తుంది. ఎప్పటికైనా వాళ్లతో ప్రమాదం ఉంది. వాళ్లు అలా చేయకుండా ఉండాలి అంటే మనం వాళ్ల నోరు మూయించాలి అలా చేయాలి అంటే ఏదో ఒక తప్పు వాళ్లది మనకు తెలియాలి అంటుంది. వాళ్లు చాలా మంచోళ్లే పొరపాటున కూడా వాళ్లు తప్పు చేయరే అని వల్లి తల్లితో చెప్తుంది. నర్మద, ప్రేమలు ఏవో పెద్ద తప్పులు దాచుంటారు అవేంటో మనం తెలుసుకుంటే ఈ జన్మలో మన జోలికి రాకుండా చేయొచ్చని అంటుంది. నాకు వాళ్లు పెట్టిన టెన్షన్ని డబుల్ వాళ్లకి ఇస్తా అని అంటుంది వల్లి. కథలోకి ప్రేమని లేపుకెళ్లిన లవర్ ఎంట్రీ ఇస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.