Jatadhara movie : జటాధర సినిమాలో ఒకప్పటి క్రేజీ హీరోయిన్.. భయపెడుతోన్న స్టార్ హీరో మరదలు.. ఎవరో మీరు గుర్తు పట్టారా?

 


టాలీవుడ్ క్రేజీ హీరో సుధీర్ బాబు నటిస్తోన్న కొత్త జటాధర. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ లో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తుంది.

ఆమెకు తెలుగులో ఇదే మొదటి కావడం గమనార్హం. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా ఈ కు దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో, ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రేరణ అరోరాతో కలిసి శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అక్షయ్ కేజ్రీవాల్ కుసుమ్ అరోరా సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే జటాధర చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. శోభ అనే పాత్రను ఆడియెన్స్ కు పరిచయం చేశారు. ఈ పోస్టర్ లో ఆమె నల్ల చీర కట్టుకుని హోమం ముందు కూర్చొని నాలుక బయటపెట్టి భయంకరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.


అయితే ఈ పోస్టర్ లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్.. అంతే కాదు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీని ఏలుతోన్న ఓ స్టార్ హీరో మరదలు కూడా. ఆమె మరెవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్, మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్. గతంలో పలు బాలీవుడ్ హిట్ ల్లో నటించిన ఆమె తెలుగులో బ్రహ్మ అనే లో యాక్ట్ చేసింది. అయితే పెళ్లై, పిల్లలయ్యాక ఇండస్ట్రీకి దూరమైంది. సుమారు 13 ఏళ్ల తర్వాత హిందీ బిగ్ బాస్ సీజన్ తో సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. దీని తర్వాత మళ్లీ శిల్పకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పుడు జటాధర తో తెలుగులోనూ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. తాజాగా రిలీజైన పోస్టర్ ను బట్టి ఈ మూవీలో శిల్ప నెగెటివ్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ నుంచి అప్డేట్స్ రానున్నాయి.