Gunde Ninda Gudi Gantalu Episod 28 aug: గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణి అంచనాలు రివర్స్- మనోజ్‌తో ఫర్నిచర్ షాప్ పెట్టించిన బాలు- తాగి ఊగిన అన్న


 

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణికి మీనా, శ్రుతి కౌంటర్స్ వేస్తారు. మీరు బాలులా మాట్లాడుతున్నారా అని రోహిణి అంటుంది. పైన అన్నదమ్ములు తాగడం గురించి మాట్లాడుకుంటారు.

బాలునే ఎక్కువగా అందరికంటే తాగుతాడు అని రోహిణి అంటుంది. ఈపాటికి తూలుతూ ఉంటాడు అని రోహిణి అంటుంది.


పైనుంచి సౌండ్స్ వస్తున్నాయ్


మరోవైపు పైన ఒక్క బీర్‌కే మనోజ్ తెగ వాగుతుంటాడు. పైనుంచి సౌండ్స్ వస్తున్నాయని శ్రుతి అంటే.. ఇంకెవరు అని బాలునే, బాలు వల్లే శబ్ధాలు అవుతుంటాయి అని రోహిణి అంటుంది. ఆయన ఇవాళ తాగను అని నాకు మాటిచ్చారు అని మీనా అంటుంది. లేదు పందెమా అని రోహిణి అంటే.. పందెం ఎందుకు వెళ్లి చూసొద్దాం పదండి అని శ్రుతి తీసుకెళ్తుంది.


తీరా పైన చూస్తే మనోజ్ వాగుతూ నేలపై పాకుతుంటాడు. రోహిణి కాళ్లు పట్టుకుని పార్క్‌లో చెట్టు చుడీదార్ వేసుకుంటుందా అని మనోజ్ అంటే మీనా, శ్రుతి తెగ నవ్వుతారు. తలపై పెట్టుకున్న కళ్లద్దాలను మనోజ్ వెతుకుతుంటాడు. ఈ శబ్ధాలన్నీ ఎవరు చేశారు అని రవిని శ్రుతి అడిగితే.. ఇంకెవరు ఆయనే అని మనోజ్ పేరు చెబుతాడు రవి. అలా రోహిణి పరువు పోవడమే కాకుండా అనుకున్నదంతా రివర్స్ అవుతుంది.


మా ఆయన ఇదంతా చేస్తారన్నావ్ అని రోహిణిని మీనా అంటే.. బాలు స్టడీగానే ఉన్నాడుగా అని శ్రుతి అంటుంది. అసలు బాలు అన్నయ్య తాగనేలేదు అని రవి అంటాడు. తర్వాత మనోజ్‌పై బకెట్ నిండా నీళ్లు పోస్తుంది మనోజ్. నేను కాబోయే బిజినెస్ మ్యాన్. నాకు దేవత డబ్బులిచ్చింది అని మనోజ్ అంటే ఎవరా దేవత అని బాలు అంటాడు. నాకు డబ్బులిచ్చిన దేవత తెలియదా అని మనోజ్ అంటే రోహిణి ఆపుతుంది.


అలా మాటివ్వలేను


మా నాన్న ఇస్తే నన్ను దేవత అంటున్నాడు అని మనోజ్‌ను కిందకు తీసుకెళ్లిపోతుంది. రవి, శ్రుతి వెళ్లిపోతారు. మీరు తాగలేదా. ఊదండి అని మీనా అంటే ట్రాఫిక్ పోలీస్‌లా అడుగుతావేంటీ అని ఊదుతాడు బాలు. నిజమే తాగలేదు. రోజు తాగరా అని మీనా అంటే.. అలా మాట ఇవ్వలేను. రేపు అనిపిస్తే తాగుతానేమో అని బాలు అంటే.. తాగకుండా ఉండాలంటే ఏం చేయాలని మీనా అంటుంది.


దానికంటే కిక్కిచ్చేది ఇవ్వాలని మీదకు వెళ్తాడు బాలు. మల్లెపూలు కింద ఉన్నాయని మీనా వెళ్లిపోతుంది. ఆహా అనుకుంటూ బాలు కిందకు వెళ్లిపోతాడు. మరోవైపు మీనా కొట్టింది తలుచుకుని సంజు తెగ తాగుతాడు. మౌనిక ముందే వాడి భార్య వచ్చి కొట్టింది. ఆ కారు తోలుకునేవాన్ని, పూలు అమ్ముకునే దాన్ని ఏదోటి చేయాలి. లేకుంటే మౌనిక లెక్కచేయదు అని కోపంగా బాటిల్ పగులగొడతాడు సంజు.


ఓ ప్యాసెంజర్‌ను దింపుతాడు బాలు. అతనికి ఫర్నిచర్ షాప్ ఉంటుంది. ప్యాసెంజర్ తన షాప్ అమ్ముకోవాలనుకుంటే ఇద్దరు రౌడీలు సగం రేటుకే అమ్మమని గొడవ చేస్తారు. దాంతో వాళ్లిద్దరు కొట్టి తరిమేస్తాడు బాలు. తర్వాత బాలుకు ఓనర్ డబ్బులిస్తాడు. చేసిన మేలు మర్చిపోనంటాడు. ఈ షాప్ ఎందుకు అమ్మేస్తున్నారని బాలు అడిగితే అమెరికాలో ఉన్న తన కొడుకు దగ్గరికి వెళ్లాలనుకుంటున్నట్లు చెబుతాడు అతను.


తలంతా పట్టేసింది


దాంతో ఆ ఫర్నిచర్ షాప్‌ను తన మనోజ్‌కు అమ్మమని అడుగుతాడు బాలు. మీ అన్నయ్య కాబట్టి ధర తగ్గిసాను. కానీ, షాప్ బాగా చూసుకుంటే చాలు అని అతను బాలు నెంబర్ తీసుకుంటాడు. బెడ్‌పై మనోజ్ పడుకుని ఉంటే రోహిణి తిట్టుకుంటుంది. మనోజ్ లేచి తలంతా పట్టేసిందంటాడు. ఒక్క బీర్‌కే అంత ఎక్కేశావా. కల్పన గురించి మాట్లాడబోయావ్. ఇంకోసారి అలా చేయకు అని రోహిణి వార్నింగ్ ఇస్తుంది.


మరోవైపు తలనొప్పిగా ఉందని ట్యాబ్లెట్ ఇవ్వమని మీనాను అడుగుతాడు సత్యం. మనోజ్ వచ్చి తలనొప్పిగా ఉందంటాడు. రవి కూడా వచ్చి తలనొప్పి అంటాడు. ఇద్దరం కూర్చుని బిజినెస్ గురించి ఆలోచించామని చెబుతారు రవి. బిజినెస్ ఐడియా ఏమైనా వచ్చిందా అని సత్యం అడిగితే.. రాలేదంటారు. రెండు ఇళ్లు కట్టి రెంట్‌కు ఇవ్వండని ప్రభావతి ఐడియా ఇస్తుంది.


మనోజ్‌కు ఫర్నిచర్ షాప్


పాతిక లక్షలతో రెండు ఇళ్లు శభాష్. కోళ్లు, పావురాలు ఉండటానికా అని సత్యం అంటాడు. ఇంతలో బాలు వస్తాడు. తాను మనోజ్ కోసం ఫర్నిచర్ షాప్ చూసినట్లు చెబుతాడు బాలు. తర్వాత సత్యం కుటుంబం అంతా వెళ్లి ఫర్నిచర్ షాప్ చూసి నచ్చిందని చెబుతాడు.


ఫర్నిచర్ షాప్‌కు ప్రభావతి పేరు వద్దని, అచ్చిరాదని మనోజ్ అనడాన్ని బాలు రికార్డ్ చేస్తాడు. అది తల్లి ప్రభావతికి చెబుతానని మనోజ్‌ను బెదిరిస్తాడు బాలు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.