యంగ్ హీరో తేజ సజ్జ.. జాంబి రెడ్డి, హనుమాన్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు దర్శకుడు కార్తీక్ఘట్టమనేని గతంలో అనేక సినిమాలకు సినిమాటోగ్రఫీ చేశారు. అనంతరం రవితేజతో ఈగల్ చిత్రం తీశారు. ఇక తాజాగా తేజ సజ్జ- కార్తిక్ ఘట్టమనేని కాంబోలో వస్తున్న యాక్షన్అడ్వెంచర్థ్రిల్లర్చిత్రం 'మిరాయ్'. ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజైంది. ప్రతి ఫ్రేమ్ ఓ విజువల్ వండర్ లా కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ సినిమాపై సూపర్ బజ్ ను క్రియేట్ చేశాయి. తాజాగా రిలీజైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. చూస్తుంటే తేజ సజ్జ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ మూవీ ట్రైలర్ లో శ్రీ రాముడికి సంబంధించిన కొన్ని షాట్స్ కనిపించాయి. అవి విజువల్స్ పరంగా అద్భుతంగా ఉన్నాయి. శ్రీ రాముడి సీన్స్ తోనే మూవీ రూ. 100 కోట్లు రాబడుతుందంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. శ్రీ రాముడి సీన్స్ కు గూస్ బంప్స్ పక్కా అంటూ నెట్టింట వార్త చక్కర్లు కొడుతోంది. అయితే మరి ఈ మూవీలో శ్రీ రాముడి పాత్రలో నటించింది ఎవరు..? గతంలో రిలీజైన టీజర్ లోనూ చివరిలో రాముడి షాట్ పెట్టారు. అప్పటి నుంచీ మిరాయ్ మూవీలో శ్రీ రాముడిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్నారంటూ ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
అయితే ట్రైలర్ క్లియర్ గా చూస్తే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. శ్రీ రాముడి క్యారక్టర్ ని AI ఉపయోగించి డిజైన్ చేసినట్లు సమాచారం. అందుకే సహజత్వానికి చాలా దగ్గరగా ఆ గెటప్ ఉంది. ట్రైలర్ లో శ్రీరాముడి ముఖాన్ని పూర్తిగా చూపించకుండా కవర్ చేయడం కూడా ఇప్పుడు ఆడియన్స్ లో క్యూరియాసిటీని విపరీతంగా పెంచింది. AI అని తెలిసిన వాళ్లకు పెద్దగా సర్‌ప్రైజ్ ఉండకపోవచ్చు. కానీ మామూలు ఆడియన్స్ లో మాత్రం ఆ క్యారెక్టర్ ఎవరు చేసి ఉంటారా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఇక మిరాయ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 12 న విడుదల కానుంది. మొత్తం ఐదు భాషల్లో చిత్రం రూపొందింది. పీపుల్స్మీడియా ఫ్యాక్టరి బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీలో తేజ సజ్జతో పాటు రితిక నాయక్, మంచు మనోజ్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా పేరు పొందిన కార్తిక్ ఘట్టమనేని.. ఈసారి దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించాడు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. రైటింగ్, డైరెక్షన్ లోనూ ఆయన స్టైల్ స్పష్టంగా కనిపించింది.