Gunde Ninda Gudi Gantalu August 30th


గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 29వ తేదీ 499వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.

బాలును ప్రభావతి మరింతగా తిడుతుంది. బాలు కు వ్యాపారం గురించి పెద్దగా ఏం తెలుస్తుందంటూ ప్రభావతి చులకన చేసి మాట్లాడుతుంది. దాంతో వెంటనే సత్యం ప్రభావతి నోరు మూయించేందుకు ఫైర్ అవుతాడు. నువ్వు నోరు మూసుకుంటే చాలా బాగుంటుందని అంటాడు. అసలు నీకు ఈ విషయంలో ఏమాత్రం మాట్లాడే అర్హత లేదని అంటాడు సత్యం. ప్రభావతి మాటలకు తీవ్రంగా మండి పడుతాడు. దాంతో ప్రభావతి దెబ్బకు నోరు మూసుకుంటుంది. ఆ తర్వాత బాలు మాట్లాడుతూ వ్యాపారం అని చెప్పింది ఫర్నీచర్ షాప్. ఆ వ్యాపారం చేయాలంటే లక్లల రూపాయల పెట్టుబడి అవసరం అవుతుంది. అయితే ఇక్కడ ఒక వెసులుబాటు ఉంది. నేను చెప్పిన షాప్ ఫ్రాంచైజీలో ఉంది. అందుకు మీ దగ్గర ఉన్న డబ్బులు సరిగ్గా సరిపోతాయని అనుకుంటున్నానని బాలు అంటాడు. వ్యాపారం మంచిగా జరిగితే అధికంగా కమీషన్ వస్తుందని చెబుతాడు. దాంతో సత్యం చక్కటి సలహా ఇచ్చావు బాలు అని అంటాడు. అందుకే ఎవరైనా చెప్పేది పూర్తిగా వినాలని మరోసారి ప్రభావతిపై సత్యం కోపం చేస్తాడు.


ఇక వెంటనే ఆ షాఫ్ దగ్గరకు వెళ్లి ఎలా ఉంటుందో ఏంటో అని వివరాలు తెలుసుకుందాం. మనోజ్, రోహిణితో పాటు మనం అందరం వెళ్లి చూద్దాం. అప్పుడు మంచి చెడులు చూస్తామని అంటుంది. దానికేం నా కొడుకు మనోజ్ ఫర్నీచర్ బిజినెస్ చాలా బాగా చేస్తాడని ప్రభావతి అంటుంది. ఇక మీనా ఆ వ్యాపారం చూపించింది మా ఆయన బాలునే అని మీనా చెబుతుంది. దాంతో ప్రభావతి ఇచ్చాడులే పెద్ద సలహా అని అంటుంది. దాంతో మీనా బాలును పక్కకు తీసుకెళ్తుంది. మనం మన స్థాయిలో ఉంటే సరిపోతుంది కదా, ఊరికే మనోజ్ రోహిణిల విషయంలో తలదూర్చడం ఎందుకు అని అంటుంది. వాడు మంచిగా ఉండాలన్నదే నా కోరిక. అందుకే పదిమార్లు ఇలా చెబుతూ ఉంటున్నానని మీనాతో బాలు అంటాడు. ఇక ఆ తర్వాత అందరూ కలిసి ఫర్నీచర్ షాప్ దగ్గరకు వెళ్లేందుకు సిద్దమవుతారు. ఫర్నీచర్ షాప్ వద్దకు చేరుకుంటారు. అక్కడ బాలును ఓనర్ మర్యాదగా ఆహ్వానిస్తాడు. ఇక షాప్ గురించిన వివరాలు చెబుతాడు. మొత్తం షాప్ చూపిస్తాడు. షాప్ పెద్దగా ఉండటంతో అందరూ చూసి సంబర పడుతారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 30వ తేదీ 400 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?


మనోజ్ కు బిజినెస్ ఏర్పాటు చేయడానికి బాలు ఎంతో ప్రయత్నం చేస్తాడు. ఇక మనోజ్ వ్యాపారం కోసమని రోహిణి వాళ్ల నాన్న 25 లక్షల రూపాయలు ఇచ్చాడని, మనోజ్ ఏదోక బిజినెస్ చేసి కోటీశ్వరుడు అయిపోతాడని తల్లి ప్రభావతి కూడా సంతోషిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో బాలు రైడ్ కు వెళ్లినప్పుడు ఒక ఫర్నీచర్ షాప్ యజమాని తన కారులోకి ఎక్కుతాడు. డ్రాప్ లోకేషన్ లో ఆయన్ని కొందరు ఇబ్బంది పెడుతుంటే బాలు వాళ్లని తన్ని తరిమేస్తాడు. అలా మనోజ్ కు ఫర్నరీచర్ షాప్ ను పెట్టే వ్యాపార అవకాశం లభిస్తుంది. అయితే బాలు ఎంతో శ్రద్ధగా ఆ అవకాశాన్ని కల్పిస్తే.. మనోజ్ మాత్రం అంతే నిర్లక్ష్యంగా ఉంటాడు. మనస్సు వ్యాపారం మీద కాకుండా విలాసాలపై ఉంటుంది. దాంతో బాలు మరోసారి మనోజ్ ను హెచ్చరిస్తాడు. నువ్వు బిజినెస్ పైనా ఫోకస్ పెట్టాలని, పార్కులో, గుడి ముందు కూర్చున్నట్టుగా ఖాళీగా ఇక్కడ కూర్చొంటే వ్యాపారం సాగదని హెచ్చరిస్తాడు. ఇక ఫర్నీచర్ షాప్ నుంచి వెళ్లిపోయే సమయంలో శృతి ప్రాఫిట్స్ గురించి అడుగుతుంది. దాంతో వెంటనే రోహిణి జ్యోక్యం చేసుకొని అవన్నీ షాప్ ఓనర్ తో మేం మాట్లాడుకొని అడ్వాన్స్ ఇస్తామని అంటుంది.

దాంతో బాలు, మీనా, శృతి, రవికి కోపం వస్తుంది. ఇక ఆవేశంతో బాలు అవునులే. ఈ వ్యాపారం నుంచి ఎంత డబ్బులు వస్తాయనేది మనకు తెలుస్తుందేమోనని ఇప్పుడు వద్దంటున్నారు. అయినా మనకెందుకు వాళ్లే చూసుకుంటారులే అని బాలు అంటాడు. ఇక ఆ తర్వాత బాలు కుటుంబంతో కలిసి ఇంటికి వెళ్లిపోతారు. ఇక ఇంటికి వెళ్లిన తర్వాత మనోజ్ రోహిణి ఆసక్తికంగా మాట్లాడుకుంటారు. మన వ్యాపారానికి ఏ పేరు పెడితే బాగుంటుందని మనోజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే సమయంలో రోహిణిని ఒక మంచి పేరును చెప్పమని అడుగుతాడు. ఇక రోహిణి మాత్రం అత్తమ్మ ప్రభావతి పేరే పెడుదామని అంటుంది. కానీ మనోజ్ మాత్రం అమ్మ పేరు వద్దని అంటాడు. అమ్మ పేరు కలిసి రాదని చెబుతాడు. ఇప్పటికే అమ్మ పేరు పెట్టిన మన బ్యూటీ పార్లర్ ను వేరే వాళ్లకు అమ్మేయాల్సి వచ్చింది. ఇక ఇంటి ముందు బాలు మీనాలు ఏర్పాటు చేసిన పూల కొట్టును మున్సిపాలిటీ వాళ్లు ఎత్తుకెళ్లారు. ఇలా మా అమ్మ పేరు పెట్టిన ప్రతిది మధ్యలోనే ఆగిపోయింది. అందుకు మా అమ్మపేరు కాకుండా మరేదైనా పేరు పెడదామని చెబుతాడు. ఇక రోహిణి అత్తమ్మ వల్లే మనం ఈ ఇంట్లో సంతోషంగా ఉంటున్నామని, ఎన్ని తప్పులు చేసినా సాగుతోందని రోహిణి చెబుతుంది. అందుకు మనోజ్ అమ్మకు మంచి సారీ కొనిద్దాంలే అని అంటాడు.

ఆ తర్వాత అందరూ కలిసి టిఫిన్ చేస్తుంటారు. ఇక అందరూ కూర్చొని తింటూ ఉండటంతో మీనాను కూడా కూర్చొని తినమని సత్యం అంటాడు. లేదు మామయ్య నేను తర్వాత తింటాను. మీరు తిన్నాక తింటానులే అని చెబుతుంది. మేం అందరం తిన్నాక నీకేం మిగులుతుందని రవి, శృతి అంటారు. ఎప్పుడూ నువ్వు మాతో కలిసి తినడం లేదు. ఇక మేం తిన్నాక నీకు తినడానికి ఉంటుందో లేదో అని అంటారు. దాంతో ప్రభావతి దానికి వేరే గిన్నెలో తీసుకొని ఉంటుందని ప్రభావతి అంటుంది. దాంతో మీనాకు మండిపోతుంది. నువ్వు వెళ్లి లేచి ఎక్కడ దాచానో తీసుకొని రండి అత్తయ్య అని అంటుంది. దాంతో ప్రభావతి మౌనంగా ఉంటుంది. అందరూ ప్రభావతిని తిడుతారు. ఇక శృతి రోహిణిని మీ వ్యాపారానికి ఏం పేరు పెడుదామని అనుకుంటున్నారని అంటుంది. ఇంకా డిసైడ్ అవ్వలేదని చెబుతుంది. దాంతో మీనా సుశీలమ్మ గారి పేరు పెడితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని చెబుతుంది. మిగిలిన వారందరూ అందరూ సరేనని అంటారు. కానీ రోహిణి మాత్రం ఏం పేరు పెట్టాలో మేం ఆలోచించి చెబుతామని అంటుంది.