WAR 2 Trailer : ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బ.. ట్రైలర్

 

WAR 2 Trailer : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న మల్టీస్టారర్ వార్-2 ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు.

ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పాత్రలకు సమాన న్యాయం దక్కినట్టు కనిపిస్తోంది. ఇందులో ఎన్టీఆర్ ను హృతిక్ రోషన్ పాత్రకు సమానంగా యాక్షన్ సీన్లు ఇచ్చేశారు. ఎవరిని ఎక్కువ చేయకుండా.. ఎవరినీ తక్కువ చేయకుండా ఇందులో ఇద్దరినీ సమానంగా చూపించిన విధానినికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ మధ్య ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ గా వచ్చిన టీజర్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు. ఈ టీజర్ పై ట్రోల్స్ స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ ను కావాలనే తక్కువ చేసి చూపించారంటూ నానా రచ్చ చేశారు. అయాన్ ముఖర్జీ, హృతిక్ రోషన్, యష్‌ రాజ్ ఫిలిమ్స్ ను సోషల్ మీడియాలో ఏకి పారేశారు.

దాంతో మూవీ టీజర్ కు ఎన్టీఆర్ టీజర్లకు వచ్చేంత ఆదరణ రాలేదు. ఆ ఎఫెక్ట్ ట్రైలర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ ను ఏ మాత్రం తక్కువ చేయకుండా ట్రైలర్ లో చూపించారు. ఒక రకంగా చెప్పాలంటే హృతిక్ రోషన్ పాత్ర కంటే ఎన్టీఆర్ పాత్రకు ఎక్కువ స్పేస్ ఇచ్చారు. ఇది ఆయన ఫ్యాన్స్ ను సంతృప్తి పరుస్తోంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఇలాంటి పాత్రలో కనిపించలేదు. ఇందులో ఆయన లుక్స్, యాక్షన్ లో ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇందులో ఇద్దరూ సోల్జర్స్ అని.. ఇది వార్ అంటూ అశుతోష్‌ రానా చెప్పిన డైలాగ్ ను బట్టి ఇద్దరి పాత్రలు సమానంగానే ఉంటాయనే హింట్ అయితే ఇచ్చారు. మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎఫెక్ట్ మూవీ ట్రైలర్ పై బాగానే కనిపిస్తోంది. ఇదే ఇంపార్టెన్స్ థియేటర్లలో కనిపిస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అంతకు మించి ఇంకేం కావాలి అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ మూవీ ఆగస్టు 14న రజినీకాంత్ కూలీ సినిమాతో పోటీ పడుతోంది.