Karthika Deepam 2 July 25th: జ్యోత్స్న మాస్టర్ ప్లాన్.. అయోమయంలో కార్తీక్ బాబు, దీపా

 

 కార్తీక దీపం 2 జూలై 24వ తేదీ 418వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఓవైపు జ్యోత్స్న నిశ్చితార్థపు వేడుక జరుగుతూ ఉంటుంది.

ముహూర్త సమయం దగ్గర పడుతూ ఉంటుంది. గౌతమ్ జ్యోత్స్న వేలికి ఉంగరం తొడిగే సమయం కూడా వచ్చింది. కానీ ఎవరూ గౌతమ్ చెడ్డవాడని చెప్పడం లేదు. దీపా చెబుదామని ఎంత ప్రయత్నించినా కార్తీక్ బాబు మాత్రం వద్దంటే వద్దని చెప్పి అడ్డుకున్నాడు. కాసేపు ఆగితే అసలు విషయం నీకే తెలుస్తుందని చెబుతాడు. ఇక గౌతమ్ జ్యోత్స్న వేలికి ఉంగరం తొడిగే సమయానికి కూడా జ్యోత్స్న తనంటా తాను నిజం చెప్పదు. జ్యోత్స్నతోనే నిజం చెప్పించాలని ప్రయత్నించిన కార్తీక్ బాబు ప్లాన్ ఫెయిల్ అయ్యింది. దీంతో ఇక తనే నిశ్చితార్థాన్ని ఆగిపోయేలా వేసిన మరో ప్లాన్ ను అమలు చేస్తాడు. గౌతమ్ జ్యోత్స్న వేలికి ఉంగరాలు తొడిగే సమయం దగ్గర పడుతున్న టైమ్ లో శివనారాయణకు ఫోన్ వచ్చి బయటికి వెళ్తాడు. ఆ వెంటనే దశరథ కూడా వెళ్తాడు.


ఇక గౌతమ్ జ్యోత్స్న వేలికి ఉంగరం తొడిగే సమయానికి శివ నారాయణ వచ్చి ఆపారా అని ఎంగేజ్ మెంట్ ను అడ్డుకుంటాడు. అమ్మాయిల జీవితాలతో ఆడుకునే నీకు నా మనవరాలు కావాలా? అని ప్రశ్నిస్తాడు. నువ్వు ఇంతటీ మొసగాడివి అనుకోలేదు. ఎంతగానో నమ్మితే మమ్మల్నే మోసం చేయాలని అనుకుంటావా? అని ఫైర్ అవుతాడు. నా తప్పేంటీ అని గౌతమ్ తిరిగి ప్రశ్నించడంతో దాసు, రమ్యను పిలిపి గౌతమ్ గుట్టును తేట తెల్లం చేస్తాడు. ఇంక ఎక్కువ మాట్లాడితే తన అసలు గుట్టు బయట పడుతుందని నెమ్మదిగా గౌతమ్ జారుకునే ప్రయత్నం చేస్తాడు. ఇదే సమయంలో జ్యోత్స్ననే దీపాను చంపించాలని ప్రయత్నం చేసిందనే నిజం చెప్పాలని చూస్తాడు. కానీ జ్యోత్స్న అడ్డుకుంటుంది. ఇక నిశ్చితార్థం ఆగిపోయినందుకు సుమిత్ర కళ్లు తిరిగి కింద పడిపోతుంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తారు. తన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెబుతారు. ఇక జ్యోత్స్న నిశ్చితార్థం ఆగిపోయిన విషయాన్ని కార్తీక్ బాబు, దీపా కాంచనకు వివరిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 25వ తేదీ 419 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?


తన వదిన ఆస్పత్రి పాలైనందుకు కాంచన కంగారు పడుతుంది. జ్యోత్స్న వల్ల ఇంత మంది ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటుంది. ఇప్పుడు ఇబ్బంది పడ్డా ఫ్యూచర్ లో సంతోషంగా ఉంటారని దీపా చెబుతుంది. ఇక మీరు టెన్షన్ పడకండి అని అంటుంది. మరోవైపు సమయానికి దాసు బాబాయ్ ఎలా వచ్చాడని కార్తీక్ బాబును దీపా ప్రశ్నిస్తుంది. కానీ కార్తీక్ బాబు దీపాకు సమాధానం చెప్పడు. చెడును ఆపడానికి నిజం దానంత అదే సమయానికి వస్తుందని అంటాడు. మిగిలిన వివరాలు నీకు తర్వాత చెబుతానని అంటాడు. ఇక దీపా కూడా ఏదేమైనా గౌతమ్ తో జ్యోత్స్న నిశ్చితార్థాన్ని జరగకుండా ఆగిపోయిందని దీపా అనుకుంటుంది. కానీ అమ్మ సుమిత్రను తలుచుకుంటేనే బాధగా ఉందని, ఎప్పుడూ కోలుకుంటుందోనని అంటుంది. మున్ముందు అన్ని సక్రమంగానే జరుగుతాయిని కార్తీక్ బాబు అంటాడు. ఇదెలా ఉంటే.. పెద్ద గండం నుంచి బయటి పడ్డామని జ్యోత్స్న, దీపాలు సంతోషిస్తారు. సమయానికి దాసు నాన్న వచ్చి నా నిశ్చితార్థాన్ని ఆపడం ఆశ్చర్యంగా అనిపించింది. నువ్వు దాసు నాన్నకు ఎప్పుడు చెప్పావని జ్యోత్స్న పారును ప్రశ్నిస్తుంది. అసలు నేనెక్కడ చెప్పానని పారు తిరిగి సమాధానం ఇస్తుంది.


Gunde Ninda Gudi Gantalu July 25th: మౌనికతో మృగంలా ప్రవర్తించిన సంజూ.. రోహిణికి మీనా వార్నింగ్


మరి నువ్వు చెప్పకుండా దాసు ఎలా సమయానికి వచ్చి నిశ్చితార్థాన్ని ఆపగలిగాడు. మరోవైపు గౌతమ్ చేతిలో మోసపోయిన రమ్య గురించి దాసుకు ఎలా తెలుసు. ఆమెను కూడా ఎవరు తీసుకొచ్చారు అని ఆలోచిస్తూ ఉంటారు. కచ్చితంగా ఈ పని చేసింది కార్తీక్ బాబే అని స్పష్టం చేసుకుంటుంది. అంటే దీపాను చంపేందుకు కారణం ఎవరో గౌతమ్ చెబుతుంటే కార్తీక్ బాబు అడ్డుకోవడం వెనకాల కూడా కారణం ఉంది. దీపాను చంపేందుకు ప్రయత్నం చేసింది నేనే అన్న సంగతి కార్తీక్ బాబుకు తెలిసిపోయిందని జ్యోత్స్న కన్ఫమ్ చేసుకుంది. ఇవన్నీ తెలిసినా ఇన్నాళ్లు తెలియనట్టుగా ఉన్నాడు. ఏదేమైనా చివరల్లో నా నిశ్చితార్థాన్ని చెడగొట్టడమే కాకుండా, దీపాను కూడా కాపాడుకున్నాడు. కానీ దీపా మీద ఎలాంటి నింద పడకపోవడం కాస్తా అప్సెట్ గా ఉందని జ్యోత్స్న అంటుంది. ఆ దీపాను నేను ఎలా వదిలిపెడుతానే అని పారుజాతం రగిలిపోపతుంది. గౌతమ్ గాడి గురించి నిజం చెప్పమని ఎంత బతిమిలాడినా దీపా నోరు విప్పలేదని, అలాంటి దీపాను నేను అస్సలు వదిలిపెట్టనని పారుజాతం అంటుంది.


100 కోట్లు.. జూ.ఎన్టీఆర్, విజయ్, రజనీ కంటే.. పవన్ కళ్యాణ్ పైనే భారం?


ఇక గౌతమ్ వంటి మోసగాడి నుంచి జ్యోత్స్న జీవితాన్ని కాపాడినందుకు దాసును శివ నారాయణ, దశరథ ఇంటికి పిలిపించి మరీ అభినందిస్తారు. సరైన సమయంలో తమకు సాయం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతారు. ఇక నీకు గౌతమ్ చెడ్డవాడనే సంగతి ఎలా తెలుసని, రమ్య కూడా నీకు ఎలా పరిచయం అయ్యిందని శివ నారాయణ దాసును ప్రశ్నిస్తాడు. నాకు వారిద్దరి గురించి చెప్పింది కార్తీక్ బాబే అని అంటాడు. కార్తీక్ బాబు చెప్పినట్టుగానే నేను నడుచుకున్నానని తేట తెల్లం చేస్తాడు. మరోవైపు అసలు దీనంతటికి కారణం దీపా అని మండి పడుతుంది. దీపాను చెప్పుతో కొట్టాలని, మొదట గౌతమ్ చెడ్డవాడని చెప్పింది, మళ్లీ మంచి వాడని అనింది. ఇలా కన్ ఫ్యూజ్ చేసి మన కుటుంబంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నించిందని దీపాను నిందించే ప్రయత్నం చేసింది. కానీ కార్తీక్ బాబు పారు నోరును మూయిస్తాడు. దీపా చెప్పింది మీరు నమ్మరు కాబట్టి మంచి వాడని నేనే చెప్పించాను. దాసు చెబితే నమ్ముతారని ఇప్పుడిలా చేశానని అంటాడు. సరైనా ఆధారాలు లేకుండా గౌతమ్ ను నిందించలేము కదా అని ఇప్పటి వరకు ఆగానని చెబుతాడు. మరోవైపు దీపాపై హత్యాయత్నం చేసిందెవరో కూడా మున్ముందు తెలిసి పోతుందని కార్తీక్ బాబు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.