Nuvvunte Naa Jathaga Serial Today july 25th: నువ్వుంటే నా జతగా సీరియల్: అత్తింటికి దేవా.. మిథున-దేవా బంధానికి మరో పరీక్ష! మామ మనసు గెలుస్తాడా?

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున తండ్రి హరివర్దన్ మిథునని తన ఇంటికి వచ్చేయమని దేవా నిన్ను ఇష్టపడటం లేదని చెప్తాడు. ఇప్పటికైనా నువ్వు ఇష్టం అని చెప్పమని చెప్పు అని అడుగుతారు.


మిథున తండ్రితో చెప్తేనే కాదు నాన్న చూపించినా ప్రేమే అని అంటుంది. మనకోసం ఎవరైనా కంట తడి పెట్టుకోవడాన్ని అంతు లేని ప్రేమ అంటారు. మరి ప్రాణం ఇవ్వడాన్ని వెలకట్టలేని ప్రేమ అనరా.. అని దేవా చేయి పట్టుకొని భుజం మీద వాలుతుంది.


హరివర్దన్: మాట్లాడితే అతను ప్రాణాలు కాపాడాడు అంటున్నావ్. నీకు ఆ పరిస్థితి రావడానికి కారణం అతనే కదా. నువ్వు బతికున్నావ్ కాబట్టి తీసుకొచ్చాడు లేదంటే.. అతని వల్ల నీ ప్రాణాలకు ప్రమాదమమ్మ. ఏ క్షణం నీకు ఏమవుతుందా అని భయంతో మేం బతకలేమమ్మా.

మిథున: నాన్న దేవ ఉండగా నాకు ఏం కాదు అని చెప్తే అర్థం చేసుకోరేంటి నాన్న.

హరివర్దన్: నీకు ఎలా చెప్పాలమ్మా అతను ఒక రౌడీ ప్రతీ రోజు శత్రువుల్ని పెంచుకుంటాడు. అతని శత్రువులు అతని మీద కోపంతో నిన్ను ఏదో ఒకటి చేస్తారు. నువ్వు అతని కోసం ఏం చెప్పినా వినను.

సత్యమూర్తి: సార్ ఇప్పుడు మీరు మాట్లాడిన ప్రతీ మాట నిజం. ఒక ఆడపిల్ల తండ్రిగా మీరు మాట్లాడిన దాంట్లో అర్థముంది. మీ స్థానంలో నేను ఉన్నా ఇలాగే మాట్లాడుతాను. కానీ ఒక్క విషయం చెప్తాను. నా కొడుకు రౌడీగా మారినందుకు ఎంత బాధ ఉందో అంత కోపం ఉంది. వాడిని వాడి పనుల్ని సమర్దించను. కానీ మిథున విషయంలో మాత్రం నేను వాడిని నమ్ముతున్నాను. మిథున వల్ల వాడికి మంచి, చెడు, కష్టం తెలిసొచ్చొంది. వాడిలో మార్పు మొదలైంది. మార్పు దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం. మిథున వల్ల వీడిలో మార్పు వస్తుందని నేను నమ్ముతున్నా.

హరివర్దన్: నేను నమ్మను.

మిథున: నాన్న మీకు రౌడీలా కనిపిస్తున్న దేవాలో మంచి మనసు ఉంది. తను నా అనే బంధం కోసం ఎంత తాపత్రయ పడతాడో నాకు తెలిసింది. అందులో నేను ఉన్నాను. నాకు పదిరోజుల టైం ఇవ్వండి దేవాని మన ఇంటికి తీసుకొస్తా. అతనిలో మంచి మనసు ఉందని నిరూపిస్తా అతనిలో మార్పు వచ్చేలా చూపిస్తా. దేవా నన్ను మంచిగా చూసుకుంటాడని మీరు తెలుసుకునేలా చేస్తా. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. దేవా మన ఇంటికి రావడానికి ఒప్పుకోండి నాన్న.

బేబీ: బాబు నా మనవడు మంచోడు కాకపోవచ్చు కానీ రాక్షసుడు కాడు. నా మనవడు రౌడీ కానీ వాడికంటే మంచోడు లేదు. కోట్లు లేవు కానీ మంచి గుణం ఉన్నవాడు. దయచేసి దేవుడి ముడి వేసిన వాళ్ల బంధాన్ని అలాగే ఉండనివ్వండి విడదీయకండి బాబు.

మిథున: నాన్న చిన్నప్పటి నుంచి నాకు నచ్చిన అన్నీ మీకు నచ్చాయి. దేవా కూడా మీకు నచ్చుతాడు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి.

హరివర్దన్: ఒకవేళ నువ్వు అనుకున్నది జరగకపోతే అతని క్యారెక్టర్ నాకు నచ్చకపోతే.

మిథున: అప్పుడు మీరు ఏం చెప్తే అదే చేస్తాను.


హరివర్దన్ సరే అనడంతో మిథున, దేవా హరివర్దన్ ఇంటికి బయల్దేరుతారు. మిథున దేవాతో మనిద్దరం కలిసి మా పుట్టింటికి వెళ్తున్నాం ఇది ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేనిది దేవా అని మిథున చెప్తుంది. దేవా మధ్యలో బైక్ ఆపి మిథునకు వాటర్ తీసుకొచ్చి ఇస్తాడు. ఇద్దరూ మళ్లీ బయల్దేరుతారు. మరోవైపు కాంతం దేవాలో మార్పు చూసి రగిలిపోతుంది. ఇళ్లంతా ధూపం వేసి పూజలు చేసి మిథున, దేవా ఏ జన్మలోనూ కలిసి ఉండకూడదని మొక్కుకున్నానని భర్తతో చెప్తుంది. దేవా మిథునని నడిరోడ్డు మీద వదిలేసి వచ్చేస్తాడు ఇద్దరూ విడిపోతారు అని అంటుంది. ప్రమోదిని, ఆనంద్ వస్తారు. అవ్వడు ఇద్దరూ విడిపోరు అని ప్రమోదిని అంటుంది. ఆ పరమశివుడు ఎప్పుడూ మంచి వైపే ఉంటాడు.. మిథున లాంటి మంచి అమ్మాయి మన ఇంట్లో ఉంటే మన కుటుంబానికే మంచిది అని ఆనంద్ అంటాడు. వాళ్లిద్దరూ కలిసి ఉండటం నాకు అస్సలు నచ్చడం లేదు.. ఈ ఇంటిని ముక్కలు చేసి అయినా ఇద్దరినీ దూరం చేస్తా అని కాంతం అనుకుంటుంది.


లలిత చిన్న కూతురితో మొదటి సారి కూతురు అల్లుడు వస్తున్నారు నాకు కాళ్లు చేతులు ఆడటం లేదని హారతి రెడీ చేస్తుంది. బావని ఇంటికి తీసుకొచ్చేలా అక్క నాన్నని ఒప్పించింది అంటే మామూలు విషయం కాదని అలంకృత సంబర పడిపోతుంది. దేవా, మిథున ఇంటికి వస్తారు. దేవాని చూసి రాహుల్, త్రిపుర చిరాకుపడతారు. హరివర్దన్ ఏం మాట్లాడకుండా ఉంటాడు. మొదటి సారి వచ్చిన నా కూతురు అల్లుడికి హారతి ఇస్తానని లలిత అంటే ఏమైనా చేస్తే అర్థం ఉండాలి వాళ్లు వారం కోసం అగ్రిమెంట్ మీద వచ్చారని నా కూతురి కోసం కేవలం నా కూతురి కోసం అన్నీ భరిస్తానని అంటాడు. లలిత మిథున వాళ్లతో మా నాన్న అలాగే అంటారు కానీ చూస్తూ ఉండండి కూతుర్నిఅల్లుడిని దగ్గరకు తీసుకుంటారని అంటుంది. లలిత మిథున, దేవాలకు హారతి ఇస్తుంది. త్రిపుర వాళ్లతో వారం రోజుల్లో వెళ్లిపోతాడు కదా ఇంత హడావుడి ఎందుకు అంటుంది. మిథున ఇది తమ నూరేళ్ల జీవితానికి ఆరంభం అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.