Nindu Manasulu Serial Today July 25th: నిండు మనసులు సీరియల్: తండ్రి కోసం ప్రేరణ పోరాటం.. గణతో పెద్దగొడవ.. సుధాకర్ ఎందుకు షాక్ అయ్యాడు?

 

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ మామయ్య సుధాకర్కి తెలీకుండా గణ ఇంటికి బయల్దేరుతుంది. బైక్ బుక్ చేసుకోవడంతో సిద్ధూ బైక్ తీసుకొని వస్తాడు.

ప్రేరణ సిద్ధూని చూసి చిరాకు పడుతుంది. సిద్ధూ ప్రేరణతో వైజాగ్ నుంచి మీరు హైదరాబాద్ ఎందుకు వచ్చారండీ అని అడుగుతాడు. దాంతో బిర్యానీ బాగుంటుందని అంటుంది. ఇక సిద్ధూ ప్రేరణతో మీ ఫ్రెండ్ పూజ చాలా సంతోషంగా ఉందండి అని అంటాడు.


ప్రేరణ చిరాకుగా అందరూ ఉండి అనాథలా బతకడం అదీ ఒక బతుకేనా.. కుటుంబంతో ఉంటేనే సంతోషం అని అంటుంది. దానికి సిద్ధూ మీరు ఈ బంధాలను బాగా నమ్ముతున్నారు కానీ ఏదో ఒక రోజు ఈ బంధాలు అన్నీ అబద్ధం అని మోసం అని మీరే తెలుసుకుంటారని అంటుంది. లొకేషన్ వచ్చేసింది ఇక ఆపేయ్ అని ప్రేరణ అంటుంది. వంద అయిందని సిద్ధూ అని వంద కట్ అయితే మీకే నేను ఇంకా 5 వందలు ఇవ్వాలి తీసుకోండి అని అంటాడు. నేను ఆ రోజే మీకు చెప్పాను అన్నం అమ్ముకోను అని తీసుకోండి అని ప్రేరణ వంద ఇస్తుంది. సిద్ధూ ప్రేరణతో ఏదో ఒకరోజు మీ 600 మీకు ఇచ్చేస్తా అంటాడు.


ప్రేరణ గణ ఇంటి లోపలికి వస్తుంది. గణ ప్రేరణని చూసి షాక్ అయిపోతాడు. ఈశ్వరి కూడా షాక్ అయిపోతుంది. గణ పనిమనిషిని పిలిచి డబ్బులిచ్చి కూరగాయలు తీసుకురమ్మని పంపేస్తాడు. తర్వాత ప్రేరణ దగ్గరకు వెళ్లి ఎవరమ్మా మీరు ఏం కావాలి చందా కావాలా సేల్స్ గల్వా అని అడుగుతాడు. లోపలికి రావొచ్చా అని ప్రేరణ అడుగుతుంది. గణ రమ్మని పిలుస్తాడు. ఇంటి లోపలికి ప్రేరణ రాగానే టీ కావాలా కాఫీ కావాలా అంటాడు. నువ్వు పోలీసే కాదు మంచి యాక్టర్ కూడా అని ప్రేరణ అంటుంది. ఎందుకు వచ్చారని గణ అడిగితే మా నాన్న కోసం మా కన్న తండ్రి కోసం అని అంటుంది ప్రేరణ. దానికి గణ ఓ మీ నాన్న తప్పిపోయాడా అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి.. పనికిమాలిన విషయాలు మనుషుల్ని నేను ఇంటి వరకు తీసుకురాను అని అంటాడు. మా నాన్న తప్పిపోలేదు మా జీవితాల నుంచి తప్పించారు అని అంటుంది. ఎవరు అని గణ అడిగితే ప్రేరణ నువ్వే మా పేరు పక్కన ఉన్న మా నాన్న మాకు దూరం చేయాలని చూస్తున్నావ్ మమల్ని అనాథల్ని చేయాలని చూస్తున్నావ్ అందుకే మానాన్నని తీసుకొచ్చి దాచేశావ్ అంటుంది.


ఈశ్వరి గణతో ఎవరో అలా మాట్లాడుతుంటే ఏంట్రా చూస్తూ ఊరుకుంటున్నావ్ అంటుంది. దానికి గణ ఆరోజు అందరితో వీళ్ల ముఖం మీద ఊయించాను అయినా వీళ్లకి సిగ్గులేదమ్మా.. ఏయ్ అంత జరిగాక మీ తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకుంటారు అనుకుంటే నువ్వేంటే మా ఇంటికి వచ్చి ప్రశ్నిస్తున్నావ్ అని అడుగుతాడు. నిజం కోసం మా ఉనికి కోసం మా గుర్తింపు కోసం మళ్లీ వచ్చాను.. నా ఈ ధైర్యం నాది కాదు మా నాన్న ఇచ్చిన పుట్టుకది అని ప్రేరణ అంటుంది. నీ పుట్టుక ఒక అబద్ధం మీ బతుకునకు గుర్తింపే లేదు అంటాడు. అది చెప్పాల్సింది నువ్వు కాదు మా నాన్న చెప్పాలి అని ప్రేరణ అంటుంది. మా అడ్రస్ ఏంటో మా తల్లి గొప్పతనం మా నాన్న నోట రావాలి అంటుంది. మా నాన్న ఎప్పటికీ అలా చెప్పడు అని గణ అరిస్తే చెప్పిస్తే చెప్పించి తీరుతా అని ప్రేరణ అరుస్తుంది. నీకు ధైర్యం ఉంటే మా నాన్నని చూపించు నేను చెప్పిస్తా అంటుంది.


ఈశ్వరి ప్రేరణని చంపేస్తా గెంటేయ్రా అని అంటే పర్లేదులే అమ్మా అని గణ తన తండ్రి ఉన్న గదిని ప్రేరణకు చూపిస్తాడు. ప్రేరణ వెళ్లి తండ్రిని చూసి మాట్లాడండి నాన్న అమ్మ మీ మీద బెంగ పెట్టుకుంది. ఒక్క రోజులో అంతా తారుమారు అయిపోయింది. ఈ ఇంటి మనుషులు మమల్ని ఏం అంటున్నారో మీకు తెలీదు నాన్న.. తప్పు ఎక్కడ జరిగినా ముప్పు మాకు ఉంది నాన్న.. అందరూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీకు మాకు సంబంధం లేదట.. అసలు మీరు మా నాన్న కాదట అని ఏడుస్తుంది. రాజశేఖరం కదలడు. మా పుట్టుక గురించి మీరు చెప్పకపోతే మాకు చావే దారి నాన్న అని ప్రేరణ అంటే అదే మీకు దారి అని గణ వాళ్లు ఎంట్రీ ఇస్తారు. మీరు మా నాన్న కూతుళ్లని మా నాన్న ఎప్పటికీ చెప్పలేడు అన్నాను విన్నావా అంటాడు. మా నాన్న నోరు తెరిచి చెప్తేనే ఏదైనా ప్రయోజనం ఉంటుంది కానీ ఆయన చెప్పడే.. ఎందుకంటే ఆయన ఏదో చెప్పలేడు.. వినలేడు.. ఎదుటి వాళ్లని గుర్తు పట్టలేడు. అంటే కంటి రెప్ప వాల్చలేడు. శరీరాన్ని కదపలేడు.. ఇది నా మాట కాదు డాక్టర్ల మాట అని గణ చెప్పగానే ప్రేరణ షాక్ అయిపోతుంది.


ఈశ్వరి ప్రేరణతో ఇప్పటికైనా అర్థమైందా వెళ్లి అనాథల్లా బతకండి అంటుంది. మా నాన్న బిడ్డలు కాదు అంటే మీరు ఒప్పుకోరు.. మా నాన్నతో చెప్పించకపోతే నేను ఒప్పుకోను.. అప్పటి వరకు మీరు అక్రమ సంతానమే.. మీది చెత్త బతుకే.. మళ్లీ కనిపించొద్దు బయటకుపో అంటే మా నాన్న మాట్లాడే దాక ఇక్కడే ఉంటాను అని ప్రేరణ అంటుంది. దాంతో గణ ప్రేరణని లాక్కొని తీసుకెళ్లి బయట పడేస్తాడు. అప్పుడే అక్కడికి సుధాకర్ వస్తాడు. సుధాకర్ చూసి షాక్ అయిపోతాడు. కొంప మునిగింది ఇది ఇంత షాక్ ఇచ్చింది ఏంటి.. నన్ను మామయ్య అని పిలవకే అని అనుకుంటాడు.


గణ ప్రేరణను కోపంగా చూస్తే ఏంటే ఇంకా చూస్తున్నావ్ బయటకు వెళ్తావా ఇక్కడే చస్తావా అని అడుగుతాడు. దానికి ప్రేరణ పోతాను కానీ ఈ ఊరు నుంచి కాదు.. మా నాన్న కళ్లు తెరిచి ఇందిరాదేవి ఆయన భార్య అని మేం ఆయన పిల్లలం అని చెప్పేవరకు నువ్వు నిజం ఒప్పుకునే వరకు మళ్లీ మళ్లీ నేను వస్తూనే ఉంటాను.. ఈ రోజు నాలుగు గోడల మధ్య జరిగిన యుద్ధం రేపు ప్రపంచం ముందు జరుగుతుంది. నువ్వు కాదు కదా ఆ దేవుడు కూడా మానాన్నని మాకు దూరం చేయలేదు వస్తా మళ్లీ తిరిగి వస్తా అని వెళ్లిపోతుంది. సుధాకర్ చెమటలు పట్టేస్తాడు. గణ సుధాకర్ని చూసి దగ్గరకు వెళ్లి ఏంటి అలా చూస్తున్నావ్ తను ఎవరో నీకు తెలుసా అని అడుగుతాడు. తెలీదు సార్.. నాకు అవసరం లేదు అని సుధాకర్ అంటే ఇప్పుడు నీకు అవసరం వాళ్లు ఎక్కడున్నారో వాళ్ల అడ్రస్ కనిపెట్టు అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.