Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today july 25th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ తన భార్యని విహారి చెప్పేశాడా.. యమునకు సీరియస్‌ అవ్వడానికి కారణమేంటి?

 

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారితో చారుకేశవ లక్ష్మీతో తన బంధం గురించి ఇంట్లో చెప్పేయాలని ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని లక్ష్మీ విషయంలో పాపం మనదే అని అంటాడు.

విహారి చారుకేశవతో మీరు అన్నది నిజమే మామయ్య మన వల్ల తను కష్టపడుతుంది. ఇక మీదట తను కష్టపడకూడదు.. మాట పడకూడదు.. తన ఇక మీదట అందరికీ సమాధానం లేని ప్రశ్న కాకూడదు.. ఇక తన మీద సంతోషం తప్ప ఇంకేం ఉండకూడదు అని అంటాడు.


లక్ష్మీని తీసుకొని విహారి ఇంటికి వెళ్లడానికి బయల్దేరుతారు. ఎక్కడికి వెళ్తున్నాం విహారి గారు అని లక్ష్మీ అడిగితే మన ఇంటికి వెళ్తున్నాం ఈ రోజు మన బంధం గురించి ఇంట్లో చెపేస్తున్నాం అని అంటాడు. మంచి నిర్ణయం తీసుకున్నావ్ అని చారుకేశవ అంటాడు. లక్ష్మీ వద్దని అంటుంది. ఇంటికి రాను అని విహారితో చెప్తుంది. లక్ష్మీ విహారిని ఏం మాట్లాడొద్దని చెప్తాడు. చాలా గొడవలు అవుతాయని లక్ష్మీ అంటుంది. ఏం జరిగినా పర్లేదు అని విహారి అంటాడు. లక్ష్మీ ఎంత చెప్పినా విహారి వినకుండా ఇంటికి తీసుకెళ్తాడు. చారుకేశవ కూడా విహారికే సపోర్ట్ చేస్తాడు.


అంబిక లక్ష్మీని తిట్టుకుంటుంది. సిద్ధార్థ్ని పట్టుకొని 30 కోట్లు రికవరీ చేసిందని తిట్టుకుంటుంది. ఇంతలో సుభాష్ కాల్ చేస్తాడు. అంబిక సుభాష్తో ఆ హ్యాకర్ నోరు తెరిస్తే నువ్వు దొరికిపోతావని అంటుంది. హ్యాకర్ నోరు తెరవడని సిద్ధార్థ్ చెప్పేస్తాడా అని సుభాష్ అడిగితే వాడిని బెదిరించానని చెప్పడు అని అంటుంది అంబిక. మన తర్వాత ప్లాన్ రెడీ చేయమని సుభాష్తో చెప్తుంది. ఇంతలో చారుకేశవ ఇంటి లోపలికి వెళ్లి దిష్టి తీయడానికి ఎర్ర నీరు తీసుకురమ్మని చెప్తాడు. వసుధ వచ్చి ఏమైందని అడిగితే లక్ష్మీ, విహారి వస్తున్నారని అంటాడు. వసుధ చాలా సంతోషపడుతుంది.


లక్ష్మీ విహారితో నిజం చెప్తే మీ కుటుంబం ముక్కలైపోతుందని నేను మధ్యలో వచ్చాను మధ్యలో వెళ్లిపోతాను అంటే విహారి ఒప్పుకోడు. నువ్వు నా మాట విను నాతోరా అని అంటాడు. లక్ష్మీని తీసుకొని గుమ్మం దగ్గరకు వెళ్తాడు. వసుధ, చారుకేశవ ఆపుతారు. వసుధ దిష్టి తీయడానికి రెడీ అయితే పద్మాక్షి వచ్చి దిష్టి పళ్లెం తోసేస్తుంది. ఏంటే వంద కోట్లు నొక్కేసినందుకు దాన్ని పంపేస్తే మీరు దిష్టితీసి మళ్లీ ఎలా లోపలికి తీసుకొస్తారు అని అంటుంది. అంబిక లక్ష్మీతో సిగ్గూ శరం లేకుండా ఎలా ఈ ఇంటికి వచ్చావ్ అంటుంది. విహారి ఆపి తన తప్పు లేదు పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ ఇచ్చారు. అవసరం అయితే వెళ్లి పోలీస్ స్టేషన్ని వెళ్లండి అంటాడు.


సహస్ర, యమునలు హాస్పిటల్ నుంచి చెప్పకుండా ఎందుకు వెళ్లావ్ అని అడిగితే విహారి సారీ చెప్తాడు. అందరికీ మరో విషయం చెప్పాలి అంటాడు. లక్ష్మీ ఆపడానికి ప్రయత్నిస్తుంది. లక్ష్మీని ఎందుకు తీసుకొచ్చావ్.. తను ఇంట్లోకి రావడానికి వీళ్లేదు అని పద్మాక్షి అంటుంది. ఎందుకు రాకూడదు తన తప్పు లేదని తేలిన తర్వాత కూడా మీరు తనని రావొద్దని అనడం బాలేదు అంటాడు. వసుధ, చారుకేశవ లక్ష్మీకి సపోర్ట్ చేస్తారు. యమున ఏం మాట్లాడటం లేదని వసుధ అంటే ఈ శనిదాని గురించి తెలియడం వల్లే పంపేసింది ఇంకేం మాట్లాడుతుంది అంటుంది. విహారి లక్ష్మీని వెనకేసుకొస్తాడు. సహస్ర విహారితో ఏంటి బావ ఆ లక్ష్మీని వెనకేసుకొస్తున్నావ్ అంటుంది. దానికి విహారి వెనకేసుకొస్తా అది నా బాధ్యత అంటాడు.


విహారి మాటలు విన్న యమున మనసులో విహారి వాలకం చూస్తుంటే లక్ష్మీ గురించి నిజం అందరికీ నిజం చెప్పాలని అనుకుంటున్నాడని అనుకుంటుంది. అంబిక విహారితో ఇంటి పని వాళ్లకి నువ్వు సపోర్ట్ చేయడం ఏంటి అని అడుగుతుంది. మీరు స్థాయి మర్చిపోయారు అని విహారి అంటాడు. ఏంటి విహారి అర్థం లేకుండా మాట్లాడుతున్నావ్ అని పద్మాక్షి అడుగుతుంది. యమున మనసులో వీడు కచ్చితంగా అందరికీ నిజం చెప్పబోతున్నాడు అనుకుంటుంది. యమున చాలా టెన్షన్ పడుతుంది. లక్ష్మీని బయటకు పంపేసి రా విహారి అని పద్మాక్షి అంటే తను బయటకు వెళ్లదు అని విహారి అరుస్తాడు. తనని నువ్వు పంపకపోయినా నేను గెంటేస్తా అని అంబిక ముందుకు వస్తే ఆగు అత్తయ్యా అని విహారి చేయి చూపించి తను ఇక్కడే ఉండాలి ఉంటుంది. ఎందుకంటే తను ఈ ఇంటి మనిషి అని అంటాడు. ఏంటి విహారి తన ఈ ఇంటి మనిషి ఏంటి అని పద్మాక్షి అడిగితే తను ఎవరో మీరు తెలుసుకోవాలని విహారి అంటాడు. ఇంతలో యమునకు ఫిట్స్ వచ్చేస్తుంది.


విహారి నిజం చెప్పే టైంకి లక్ష్మీ యమునను చూసి పరుగులు తీస్తుంది. అందరూ కంగారు పడతారు. చారుకేశవ డాక్టర్కి కాల్ చేస్తాడు. డాక్టర్ చూసి చాలా నీరసంగా ఉన్నారు రెస్ట్ అవసరం అంటారు. విహారి వాళ్లని బయటకు తీసుకెళ్లి ఆవిడకు ఫిట్స్తోపాటు హార్ట్ ఎటాక్ కూడా వచ్చింది.. ఆమె తట్టుకోలేని ఏ న్యూస్లు ఆమెకు చెప్పొద్దు చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంది. విహారి అందరితో అందరూ డాక్టర్ చెప్పింది విన్నారు కదా దయచేసి మా అమ్మతో ఎవరూ హార్స్గా మాట్లాడొద్దు.. అమ్మ బాధ పడే విషయం ఏమైనా ఉంటే తనతో పంచుకోవద్దు.. అత్తయ్య మీకు మరీ మరీ చెప్తున్నా మీకు మా అమ్మ మీద కోపం ఉండొచ్చు ఏం అనొద్దు అంటుంది. పద్మాక్షి విహారితో నువ్వు నాకు అంత చెప్పాలా డాక్టర్ చెప్పిన తర్వాత నేను ఎందుకు అలా ప్రవర్తిస్తాను. పైగా నాకు ఇప్పుడు తన మీద కోపంలేదురా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.