Illu Illalu Pillalu Serial Today July 25th: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్: వల్లి పుట్టింటి గుట్టు రట్టు.. రామరాజు ఆగ్రహం..వల్లిని గెంటేసిన చందు..!

 

Illu Illalu Pillalu Serial Today Episode నర్మద, ప్రేమలు వల్లికి రామరాజు బాధ్యతలు ఇవ్వడం గురించి మాట్లాడుకుంటూ దొంగ చేతికే మామయ్య తాళాలు ఇచ్చేశారని అనుకుంటారు.

శ్రీవల్లి పెట్టిన రూల్స్ గుర్తు చేసుకొని ఆ వల్లీ చాలా ఎక్స్ట్రాలు చేస్తుందని అనుకుంటారు. వల్లీ పెత్తనం వెనక తన తల్లి హస్తం ఉందని వాళ్లు మన కుటుంబాన్ని ఏదో చేయాలనే ఇలా చేస్తున్నారు.. వాళ్లు మన ఫ్యామిలీ జోలికి రావడానికి కంటే ముందే మనం వల్లి పుట్టింటి గుట్టు తెలుసుకొని మామయ్య ముందు వాళ్లని నిలబెట్టాలని అనుకుంటారు. ఎక్కడ ఆపేశామో అక్కడే మొదలు పెడదాం అని వాళ్ల ఇంటిని వెతకడం మొదలు పెడతారు.


మరోవైపు వల్లీ తల్లిదండ్రులు ఇడ్లీ బండి పెట్టడం కోసం టిఫెన్లు అన్నీ సిద్ధం చేసుకొని బ్యాగ్లు సర్దుతూ ఉంటారు. ఇద్దరూ నర్మద గురించి మాట్లాడుకుంటారు. ఆ నర్మద సామాన్యురాలు కాదని తన కంట పడితే మన గుట్టు రట్టు చేసేవరకు ఊరుకోదని వల్లి తల్లి భర్త ఆనంద్రావుకి జాగ్రత్తలు చెప్తుంది. ఆనంద్ కూడా తాను చాలా జాగ్రత్తగా ఉంటానని కొత్త అవతారం ఎత్తేస్తున్నా ఎవరూ ఇక తనని గుర్తు పట్టేలేరని చెప్పి టిఫెన్లు తీసుకొని బయటకు వెళ్తేంటే ఎదురుగా రామరాజు నిల్చొని ఉంటాడు.


రామరాజు వెనకే నర్మద, ప్రేమ ఉంటారు. రామరాజుని శ్రీవల్లి తల్లిదండ్రులు చూసి బిత్తరపోతారు. నర్మద, ప్రేమలు రామరాజుతో ఇది వీళ్ల ఇళ్లు.. ఇది కూడా అద్దె ఇళ్లు మామయ్యగారు.. ఆ రోజు మనకు చూపించిన ఇళ్లు పెళ్లి కోసం రెంట్కి తీసుకున్నారు. ఫైనాన్స్ వ్యాపారం కోసం మీకు చెప్పిందంతా పచ్చి అబద్ధం అని మొత్తం చెప్పేస్తారు. రామరాజుని చూసి భార్య భర్తలు చెమటలు పట్టేస్తారు. రామరాజు లోపలికి వచ్చి ఇళ్లంతా చూస్తాడు. ఇంతలో చందు, తిరుపతి, వేదవతి అక్కడికి వస్తారు. శ్రీవల్లి తల్లి రామరాజుతో అన్నయ్య గారు ఈ ఇళ్లు మాకు కలిసి వస్తుందని ఏది పట్టినా బంగారం అవుతుందని మా పర్సనల్ పంతులు చెప్పడంతో మా బంగ్లా వదిలి ఇక్కడికి వచ్చాం అంటుంది. ఆనంద్ కూడా అబద్ధం చెప్తుంటే రామరాజు కోపంగా ఒక్కటి పీకుతాడు.


రామరాజు వాళ్లతో నా కొడుకుకి ఎన్ని సంబంధాలు చూసినా ఎదురింటి వాళ్లు చెడగొట్టారు. నా కొడుకుకి పెళ్లి చేయలేనేమో అని ఏడ్చాను.. నా నిస్సహాయతను అవకాశంగా తీసుకొని ఇంత మోసం చేస్తారా అని అంటాడు. మేం మోసం చేయలేదు అని అంటే దానికి వేదవతి ఆపండమ్మా మేం ఏం మీకు డబ్బు అడిగామా కట్నం అడిగామా మీకు మీరే మాకు కోట్లు ఉన్నాయి బంగ్లాలు ఉన్నాయి కోటీశ్వరులం అని చెప్పి మమల్ని మోసం చేశారని అంటుంది. మా కూతుర్ని మీ ఇంటి కోడల్ని చేస్తే అది జీవితాంతం సంతోషంగా ఉంటుందని ఇలా చేశామని వల్లి తల్లి అంటే మీ మనసులో నిజంగా అలాగే ఉంటే నాకు నిజం చెప్పుంటే నేను మొత్తం ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి చేసేవాళ్లం అని అంటాడు. నా కొడుకు జీవితం నాశనం చేసేశారు ఆడుకున్నారని వేదవతి అంటే మాకు అల్లుడు దేవుడు అని వల్లి తల్లి అంటుంది.


చందు అత్త మాటలకు మీరు నన్ను పిచ్చోడిని చేయలేదా పెళ్లి ఖర్చులకు అని నా దగ్గర పది లక్షలు తీసుకున్నారు కదా అని చెప్తాడు. రామరాజు, వేదవతి షాక్ అయిపోతారు. పది లక్షలు ఏంటి అని అడిగితే దానికి చందు వీళ్ల డబ్బు లాక్ అయిపోయిందని పెళ్లికి పది రోజుల మందు కాల్ చేసి పెళ్లి ఆపమని చెప్పారు అందుకే నేను పెళ్లి ఆగితే మీరు ఏమైపోతారో అని వడ్డీకి పది లక్షలు తీసుకొచ్చానని అంటాడు. పెళ్లి అయిపోయింది కదా ఇక చేసేది ఏం లేదు కదా ఈ విషయం గురించి ఇక మాట్లాడుకోవద్దని ఆనంద్ అంటే రామరాజు ఆనంద్ పీక పట్టుకొని పైకి లేపి చేసేది ఏం లేదా ఇంత మోసం చేశారు మిమల్ని వదలను మీ కూతురుని ఇంకొక్క క్షణం కూడా మా ఇంట్లో ఉంచను అని అంటాడు.


మరోవైపు శ్రీవల్లి తనకు పెత్తనం వచ్చేసింది ఇక తనని ఎవరూ ఆపలేరని గెంతులేస్తూ ఉంటుంది. రామరాజు ఆనంద్ని విసిరేయడంతో వల్లి దగ్గర పడతాడు. వల్లీ షాక్ అయిపోతుంది. పెద్ద కోడలు అని నెత్తిన పెట్టుకొని పెత్తనం ఇచ్చా ఇక నువ్వు మా ఇంట్లో ఉండటానికి వీళ్లేదు అని చెప్పాడు. చందుకి వల్లీని ఈడ్చుకుంటూ వెళ్లి బయటకు తోసేస్తాడు. నర్మద, ప్రేమలు గేట్ వేసేస్తారు. శ్రీవల్లి ఏడుస్తుంది. తీరా చూస్తే ఇదంతా ఆనంద్ కల. ఆనంద్రావు భార్యతో కల చెప్పి నా కల నిజం అయ్యేలా ఉందని భయంగా ఉందని అంటాడు. నాకు అదే భయం ఉంది అందుకే ఆ నర్మదకు భయంతో చచ్చేలా చేస్తా అంటుంది.


నర్మద సాగర్ తనని దూరం పెట్టడం గుర్తు చేసుకొని ఏడుస్తూ వెళ్తుంది. సాగర్ వచ్చి నర్మద ముందు బైక్ ఆపుతాడు. నర్మద తనకోసమే అనుకొని వెళ్లి సాగర్ని పిలుస్తుంది. సాగర్ బైక్ దిగి ఎదురుగా ఉన్న షాప్కి వెళ్లి బియ్యం ప్యాకెట్ల డబ్బులు అడుగుతాడు. తర్వాత వచ్చి సాగర్ నర్మద పిలిచినా పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. నర్మద చాలా ఏడుస్తుంది. అప్పుడే నర్మద దగ్గరకు శ్రీవల్ల తల్లి వస్తుంది. నీ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుందమ్మా. కట్టుకున్న వాడు నడిరోడ్డు మీద నిన్ను పట్టించుకోకుండా వెళ్లిపోతున్నాడు. రోషం పౌరుషం ఉన్న వాళ్లు ఈ అవమానం బాధ తట్టుకోలేక ఎవరైనా చచ్చిపోతారు. నువ్వు అలా చేయకు నీ తల్లికి కడుపు కోత పెట్టకుఅంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.