Disasters haunting the 'Mega' family! Starting from 'Bhola Shankar' to 'Harihara Veeramallu'...

 'మెగా' ఫ్యామిలీని వెంటాడుతున్న డిజాస్టర్లు! 'భోళా శంకర్' నుంచి మొదలై 'హరిహర వీరమల్లు' దాకా...



జూలై 24న విడుదలైన 'హరిహర వీరమల్లు' మూవీ, తొలిరోజు టైర్ 1 హీరోల రేంజ్‌లో ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోయింది. రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'హరిహర వీరమల్లు' మూవీ, మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.64.74 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

మొత్తంగా రూ.44.7 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్టు సమాచారం. ఈ మూవీకి రూ.128 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అందులో 33 శాతం తొలి రోజు తిరిగి రాబట్టగలిగాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే సెకండాఫ్‌కి తీవ్రమైన నెగిటివ్ టాక్ రావడంతో రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌పై ఆ ప్రభావం తీవ్రంగా పడింది..

తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు ఈ మూవీకి 30 శాతం కూడా టికెట్లు తెగడం లేదు. దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెడపి లేకుండా కురుస్తున్న వర్షాలు కూడా 'హరిహర వీరమల్లు' మూవీ వసూళ్లపై ప్రభావం చూపిస్తున్నారు. ఈ మూవీ కనీసం హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే వీకెండ్‌లోపు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాలి. అయితే టికెట్లు తెగుతున్న ట్రెండ్‌ని బట్టి చూస్తే, ఈ మూవీ రూ.75 కోట్ల షేర్ వసూలు చేయడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. దీంతో 'హరిహర వీరమల్లు' మూవీ కూడా రూ.30 నుంచి రూ.50 కోట్ల వరకూ భారీ నష్టాలు తేవడం ఖాయమని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు..

'ఆచార్య' డిజాస్టర్ తర్వాత 'వాల్తేరు వీరయ్య'తో కమ్‌బ్యాక్ ఇచ్చిన చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' మూవీ చూసి భారీ డిజాస్టర్ ఫేస్ చేశాడు. 'వేదాలం' రీమేక్‌గా వచ్చిన 'భోళా శంకర్', కనీసం రూ.50 కోట్ల గ్రాస్ కూడా వసూలు చేయలేకపోయింది..

చిరంజీవి కొడుకు రామ్ చరణ్, మూడేళ్లు కష్టపడి నటించిన 'గేమ్ ఛేంజర్' మూవీ 2025 సంక్రాంతికి విడుదలైంది. రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ కనీసం రూ.100 కోట్ల షేర్ సాధించలేక Epic డిజాస్టర్‌గా నిలిచింది..

మెగా బ్రదర్ నాగబాబు కొడుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత రెండేళ్లలో మూడు డిజాస్టర్లు ఫేస్ చేశాడు. 'F3' తర్వాత వరుణ్ తేజ్ నటించిన 'గాంఢీవధారి అర్జున', 'ఆపరేషన్ వాలెంటైన్', 'మట్కా' సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'మట్కా' మూవీ, థియేటర్ల నుంచి జీరో షేర్ వసూలు చేసి, 'మెగా' పరువు తీసింది...

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ నటించిన 'ఆదికేశవ' మూవీ, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. గత రెండేళ్లలో మెగా హీరోల సినిమాల ద్వారానే నిర్మాతలు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ నష్టపోయినట్టుగా లెక్కలు చూపిస్తున్నారు ట్రేడ్ నిపుణులు..

దీనికి తోడు చిరంజీవి లేటెస్ట్ మూవీ 'విశ్వంభర' మూవీపై రిలీజ్‌కి ముందే తీవ్రమైన నెగిటివిటీ ప్రచారం జరుగుతోంది. 8 నెలల క్రితం రిలీజైన టీజర్‌పై ట్రోలింగ్ వచ్చింది. దీంతో గ్రాఫిక్స్ వర్క్‌పై పూర్తి ఫోకస్ పెట్టి, భారీగా ఖర్చు పెడుతోంది చిత్ర యూనిట్. ఈ మూవీ రిలీజ్ డేట్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమా 'OG' మూవీపైనే ఆశలన్నీ పెట్టుకుంది 'మెగా' ఫ్యామిలీ.