Nuvvunte Naa Jathaga Serial Today july 23rd: నువ్వుంటే నా జతగా సీరియల్: ఒక్కటైపోయిన 2 ఫ్యామిలీలు.. పట్టరాని సంతోషంలో దేవాకి ప్రపోజ్ చేసిన మిథున!

 


Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున దేవా గురించి ఆలోచిస్తుంది. దేవాకి తన మీద ఉన్న ప్రేమని తనని దేవా కాపాడినప్పుడు చెప్పిన మాటల్ని తలచుకొని దేవా నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నువ్వు నన్ను కాపాడిన విధానంలో తెలిసిపోయింది.

ఛాలెంజ్లో నేను గెలిచేశా దేవా.. ఇప్పుడు నా మనసులో ప్రేమ నీకు చెప్పడం మాత్రమే ఉంది అని అనుకుంటుంది. ఇంతలో మిథున దగ్గరకు బేబి బామ్మ వస్తుంది.


బేబీ మిథునతో బంగారు తల్లీ నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు నీ మనసులో ప్రేమని దేవాకి ఎప్పుడెప్పుడు చెప్పాలా అని వాడు లవ్టూ మిథున అని చెప్తే వినాలి అని ఆరాట పడుతున్నావ్ అంతే కదా అంటుంది. మిథున బేబీతో ఛీ పో బామ్మ అని తెగ సిగ్గు పడుతుంది. బేబీ మిథునతో నువ్వు ఆశపడినవన్నీ జరిగిపోతాయి కానీ అంతకంటే ముందు నీకు చాలా విలువైన వెలకట్టలేని సంఘటన చూపిస్తా రా అని తీసుకెళ్లి మిథున తల్లిదండ్రులకు అత్తామామలు దగ్గరుండి వడ్డించడం హరివర్దన్, సత్యమూర్తిలు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూపిస్తుంది. మిథున చాలా సంతోషపడుతుంది. బేబీ మిథునతో ఇదే నీ గుండె నిండిపోయే సంతోషం అని అంటుంది.


సత్యమూర్తి హరివర్దన్ వాళ్లతో మీ కూతురు క్షేమంగా ఇంటికి వచ్చినందుకు కడుపు నిండేలా కాదు గుండె నిండేలా తినాలి అని వడ్డిస్తారు. మిథున ఆసీన్ చూసి చాలా సంతోషపడుతుంది. దేవా కూడా ఈ సీన్ చూసి ముందు షాక్ అయి తర్వాత సంతోషపడతాడు. బేబీ మిథునతో కొన్నిసార్లు బాధ కూడా సంతోషం ఇస్తుంది అంటే ఇదే అని వాళ్లని చూపిస్తుంది. నువ్వు కనిపించకుండా పోయావన్న బాధ మన రెండు కుటుంబాల్ని కలిపింది.. ఒక వైపు నిన్ను కోడలిగా వద్దు అనుకున్న కుటుంబం మరోవైపు దేవాని అల్లుడిగా వద్దు అనుకున్న కుటుంబం ఎలా ఒక్కటయ్యాయో చూడు. ఇంత వరకు మీ పెళ్లికి ఈ రెండు కుటుంబాలు లేవు ఇప్పుడు మీకు అండగా ఈ రెండు కుటుంబాలు ఉన్నాయి.. ఇక మీ బంధానికి తిరుగు లేదమ్మా అని అంటుంది. సంతోషంతో ఉన్న మిథునని దేవా అలానే చూస్తూ ఉంటాడు.


మిథున తన తాళి పట్టుకొని దేవా నువ్వు నా మెడలో కట్టిన నా కుటుంబాన్ని నాకు దూరం చేసింది అనుకున్నా.. కానీ ఈ రోజు నువ్వు కాపాడిన నా ప్రాణం మన రెండు కుటుంబాల్ని కలిపింది. ఇది నేను కలలో కూడా ఊహించని సంతోషం.. నువ్వు నా కలన నిజం చేసి నిలబెట్టావ్ అని అనుకుంటుంది. ఆ మాటలు దేవా విని సంతోషంగా నవ్వుకుంటూ వెళ్లిపోతాడు. ఇక మిథున తన మనసులో ప్రేమని దేవాతో చెప్పేయాలి అనుకుంటుంది.


హరివర్దన్ దేవా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి మిథున వచ్చి తండ్రి ఒడిలో పడుకుంటుంది. ఎన్ని రోజులు అయింది నాన్న ఇలా నీ ఒడిలో పడుకొని..నాన్న నేను కనిపించకపోయే సరికి నువ్వు చాలా అల్లాడిపోయింటావు కదా.. చాలా ఏడ్చుంటావు కదా.. నేను కనపడలేదని మా నాన్న ఎంతలా ఏడుస్తుంటారో అని నేను ఎంత ఏడ్చానో తెలుసా.. ఇప్పుడు మన బాధని సంతోషంగా మారిపోయింది.. అలా దేవానే మార్చాడు నాన్న అని చెప్తుంది. నా కోసం మీరు ఎంత ఏడ్చారో దేవా అలాగే ఏడ్చాడు నాన్న.. మీరు ఎంతలా తల్లడిల్లిపోయారో దేవా కూడా అంతే తల్లిడిల్లిపోయాడు.. నా కిడ్నాప్కి దేవాకి సంబంధం లేదు కానీ పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నాడు. తిండి నిద్రలు మాని నా కోసం తిరిగాడు. దేవాకి నా మీద ప్రేమ ఉందని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి నాన్న.. నేను మీతో చేసిన ఛాలెంజ్కి ఇంకా సాక్ష్యాలు కావాలా నాన్న.. ఇంక నేను గెలిచినట్లే కదా నాన్న అని అడుగుతుంది. హరివర్దన్ ఒప్పుకున్నట్లు తల ఊపుతాడు.


దేవా మిథున కోసం తన తండ్రి ప్రశ్నించి కొట్టడం మామ గన్ గురి పెడితే తండ్రి అడ్డు రావడం, మిథున హగ్ చేసుకోవడం ఇలా అన్నీ గుర్తు చేసుకుంటాడు. ఇంతలో మిథున వచ్చి దేవా దగ్గర కూర్చొంటుంది. నన్ను కాపాడటం కోసం నువ్వు ప్రాణాలు పణంగా పెట్టడం నేను కల్లారా చూశాను. ముక్కూ ముఖం తెలియని వాళ్ల కోసం ఎవరూ ఇలా ప్రాణాలు పణంగా పెట్టరు.. కేవలం మనసులో ఉన్నప్పుడు మాత్రమే ఇంతలా ఆరాటపడతారు. నీ మనసులో నా మీద ప్రేమ ఉందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం లేదు.. నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేను చెప్పాలి అనుకున్న మాటలు ఇప్పుడు నీ ముందు చెప్తున్నా.. దేవా నువ్వుంటే నా జతగా మనిద్దరం కలిసి సాగుదాం నిండు నూరేళ్లు సంతోషంగా.. అని దేవాని హగ్ చేసుకొని ఐలవ్యూ దేవా అని చెప్తుంది. దేవా ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన మనం తిరిగి మట్టిలో కలిసిపోయే వరకు ఒక్కటిగా బతుకుదాం దేవా అని అంటుంది.


దేవాలో ఏ రియాక్షన్ లేదని మిథున దేవానే చూస్తూ ఉంటుంది. నీ మౌనం నాకు అర్థమవుతుంది.. నీ మనసులో ప్రేమ నాకు కనిపిస్తుంది. నువ్వు చెప్పలేక నీ గొంతు దాటని మాటలు నా గుండెకు వినిపిస్తున్నాయి. నీ కళ్లు నాకు స్పష్టంగా చెప్తున్నాయి ఐలవ్యూ మిథున అని అంటూ మిథున వెళ్లిపోతుంది. ఉదయం ఇంటికి ఆదిత్య వస్తాడు. ఇక దేవా మిథునని కిడ్నాప్ చేసిన ప్లేస్లో మిథున ఫొటో ఎందుకు ఉంది. మిథున కిడ్నాప్ వెనక అంతు చిక్కని రహస్యం ఉంది అది ఏంటో కనిపెట్టాలి అనుకుంటాడు. ఆదిత్య దేవా దగ్గరకు వచ్చి నువ్వు సూపర్ బ్రదర్ మిథునని చాలా బాగా రక్షించావ్ ఒక్క సారి మిథునని కలవాలి అని మిథున మిథున అంటూ పరుగులు తీస్తాడు. మిథునని చూసి నిన్ను కిడ్నాప్ చేసిన వాడిని వదలను వాడి అంతు చూస్తా అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.