Meghasandesam Serial Today Episode: అందరూ కలిసి శారదను విధవను చేసేందుకు బయటకు తీసుకొస్తారు. పూర్ణిని నక్షత్ర పట్టుకుంటుంది. శారద ఏడుస్తుంది. ఇంతలో బిందు వచ్చి ఏడుస్తూ పెద్దమ్మను ఏమీ చేయోద్దని అడ్డు పడుతుంది.
బిందును మీరా తోసేస్తుంది.
బిందు: అమ్మా ఇది కరెక్టు కాదమ్మా..? అత్తయ్య ఎంత కవర్ చేసి చెప్పినా నాన్న మొదట పెద్దమ్మ మెడలో తాళి కట్టారు కాబట్టి ఇప్పుడు పెద్దమ్మను అలా చేస్తే నాన్న చనిపోయినట్టే కదమ్మా.. నా మాట విని జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఆపించు అమ్మా..?
మీరా: నోర్మూయ్.. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను.
అత్త: అమ్మా అపూర్వ నీకు పుణ్యం ఉంటుంది ఒక్కసారి ఆలోచించమ్మా..?
అపూర్వ: మాట్లాడొద్దు..
శారద: మీరైనా చెప్పండి అత్తయ్యా..? వదలండి..
అపూర్వ: ఏయ్ శారద మేము చేసే పనికి నువ్వు సహకరించావో సరేసరి. అదిగో నీ కూతురు పూర్ణిమను చూడు దానికి జీవితం లేకుండా చేస్తాను. చెప్పు నీ కూతురి జీవితం ముఖ్యమా నీ పసుపుకుంకుమలు ముఖ్యమా..?
పూర్ణి: అమ్మా.. వదులు.. అమ్మ
అపూర్వ: మానసికంగా మొగుడు చచ్చిపోయాడని చెప్పిన శారద మీకు సహకరిస్తుందిలే..
అని చెప్పగానే.. నలుగురు విధవలు వచ్చి శారదకు పసుపు పూసి స్నానం చేయించి బొట్టు పెట్టి గాజులు తొడుగుతుంటారు.
అత్తయ్య: అయ్యో భగవంతుడా ఇది చూడటానికేనా నేను బతికి ఉన్నది.
అని బాధపడుతుంది. ఇంతలో బిందు లోపలికి పరుగెత్తుకుంటూ వెళ్లి కేపీకి కాల్ చేస్తుంది.
బిందు: నాన్న ఎక్కడున్నారు..?
కేపీ: సిటీ అవుట్స్కట్లో మీటింగ్ ఉంటే వచ్చాను చెప్పమ్మా..?
బిందు: భూమితో ఏదో మాట్లాడాలంటూ పూర్ణితో కలిసి పెద్దమ్మ వచ్చింది నాన్న. సమయానికి ఇంట్లో భూమి కూడా లేదు.
కేపీ: భూమి లేదని వెళ్లిపోయారా..?
బిందు: అలా అయితే నీకెందుకు కాల్ చేస్తాను నాన్న. అమ్మ పెద్దమ్మను డివోర్స్ పేపర్స్ నువ్వే మాయం చేశావంటూ రూంలో బంధించింది నాన్న.
కేపీ: ఏంటీ..?
బిందు: అమ్మ మామయ్యకు కాల్ కూడా చేసి రమ్మని చెప్పింది నాన్న. అందరూ వచ్చాక పెద్దమ్మను బయటకు తీసుకొచ్చి ఘోరంగా అవమానిస్తున్నారు నాన్న
కేపీ: నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను..
అంటూ కేపీ కాల్ కట్ చేస్తాడు. బయట శారద ఏడుస్తుంది. విధవలు తమ పని తాము చేస్తుంటారు. ఇంతలో కేపీ ఇంటికి వచ్చి అందరినీ తిట్టి శారదను అక్కడి నుంచి పంపిచివేస్తాడు. తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి ఎస్సై, శరత్ చంద్రకు కాల్ చేస్తాడు.
శరత్: చెప్పండి ఎస్సై గారు..
ఎస్సై: మీకో ముఖ్యమైన విషయం చెబుదామని కాల్ చేశాను సార్.
శరత్: చెప్పండి..
ఎస్సై: మీరంతా అనుకుంటున్నట్టు శోభాచంద్ర గారికి యాక్సిడెంటల్ డెత్ కాదు సార్. ఫ్రీ ప్లాన్డ్ మర్డర్.
శరత్: శోభాది యాక్సిడెంటల్ డెత్ కాదా..? మర్డరా..? ఎవరు చంపారు నా శోభాను. ఏం చూసి నా శోభా మర్డర్ అయిందని నువ్వు కన్ఫం చేస్తున్నావు. లేదా నీకు ఏదైనా ఎవిడెన్స్ దొరికిందా.?
అంటూ శరత్ చంద్ర అడుగుతుంటే వెనక నుంచి వచ్చి మొత్తం విన్న అపూర్వ షాక్ అవుతుంది. భయంతో వణికిపోతుంది. మరోవైపు భూమిని వెతుక్కుంటూ తిరుగుతున్న శిన నేరుగా వెళ్లి భూమి వెళ్తున్న కారు కింద పడిపోతాడు. వెంటనే కారు దిగి వచ్చి శివను చూసిన భూమి షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.