పవన్ కళ్యాణ్ ..ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరో. ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా నెం 1 స్ధానం లో కి వెళ్ళిపోయాడు . పాలిటిక్స్ లో కూడా తనదైన స్టైల్ లో చక్రం తిప్పుతున్నాడు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ది వన్ అండ్ ఓన్లీ రీజన్ పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో సందేహం లేదు. ఈ మాట ఏ ఒక్కరో ఇద్దరో కాదు కోట్లలో జనాభానే ప్రతిరోజు చెప్పుతూ ఉంటారు . కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం నటించి రిలీజ్ అవుతున్న సినిమా "హరిహర వీరమల్లు".
జ్యోతి కృష్ణ దర్శకత్వంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మరికొద్ది గంటలో థియేటర్స్ లో ప్రీమియర్స్ పడిపోతున్నాయి . ఈరోజు రాత్రి 9:30 నిమిషాలకు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్స్ తో పాటు సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది . ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనివిందు చేయబోతున్నాడు. ఈ సినిమా స్టోరీ మొత్తం "కోహినూర్" వజ్రం గురించి అంటూ ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి అదేవిధంగా పవన్ కళ్యాణ్ వివరించారు . ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎ ఏం రత్నం నిర్మించారు.
బ్రో తర్వాత పవర్ స్టార్ థియేటర్స్ లో కనిపించబోతున్న సినిమా ఇదే కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమా పై హై ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా..?? అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు . మరో వైపు సినిమా రిలీజ్ కాకుండానే పవర్ స్టార్ రికార్డులు వేట మొదలుపెట్టేశాడు. ముఖ్యంగా ఆంధ్రాలోని గోదావరి జిల్లాల్లో పవర్ స్టార్ పవర్ ఏంటో చూపిస్తున్నారు . తూర్పుగోదావరి జిల్లాలో 49 సెంటర్స్ కి గాను 47 సెంటర్స్ లలో 107 షోస్ ను ప్రీమియర్ ప్రదర్శిస్తున్నారు. ఈ స్థాయిలో ప్రీమియర్స్ వేయడం జిల్లాలోనే ఆల్ టైం రికార్డ్ . ప్రీమియర్స్ కూడా దాదాపు ఆల్మోస్ట్ ఆల్ సోల్డ్ అవుట్ అయ్యాయి . ఇక ఉత్తరాంధ్రలోను 116 పైగా షో స్ కన్ఫామ్ అయిపోయాయి.
ఇది నిజంగా పవర్ స్టార్ కెరియర్ లోనే వన్ అఫ్ ది బిగ్గెస్ట్ రికార్డ్ అంటున్నారు జనాలు . ఉత్తరాంధ్ర కోనసీమ ఏరియాలలో ప్రీమియర్ షో టికెట్స్ అన్నీ కూడా బుక్ అయిపోయాయి . సినిమా రిలీజ్ అవ్వకముందే పరిస్థితి ఈ విధంగా ఉంటే సినిమా రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డ్స్ బ్లాస్ట్ అయిపోతాయో ఊహించుకుంటుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయ్. ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎంజాయ్ చేసే మూమెంట్ ఇది అంటూ సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ హరిహర వీరమల్లు సినిమాని ప్రమోట్ చేస్తున్నారు . చూడాలి మరి పవన్ ఫ్యాన్స్ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో..?? లేదో..??